Reliance Industries And BP Commence Production From Reliance MJ field In KG Block - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ ఎంజే క్షేత్రం నుంచి గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభం

Jul 1 2023 7:01 AM | Updated on Jul 1 2023 9:26 AM

Gas production started from Reliance MJ field - Sakshi

న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాక్‌లోని ఎంజే చమురు, గ్యాస్‌ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెల్లడించాయి. ఈ బ్లాక్‌లోని మరో రెండు క్షేత్రాలైన ఆర్‌–క్లస్టర్‌ నుంచి 2020 డిసెంబర్‌లో, శాటిలైట్‌ క్లస్టర్‌ నుంచి 2021 ఏప్రిల్‌ నుంచి గ్యాస్‌ ఉత్పత్తి అవుతోంది. 

ఎంజే క్షేత్రం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేజీ–డీ6 బ్లాక్‌లోని మొత్తం మూడు క్షేత్రాల నుంచి రోజుకు 30 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి కాగలదని రిలయన్స్‌–బీపీ తెలిపాయి. ఇది దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో సుమారు మూడో వంతు ఉంటుందని, డిమాండ్‌లో 15 శాతానికి సరిపోవచ్చని పేర్కొన్నాయి. ఎంజే క్షేత్రంలో కనీసం 0.988 టీసీఎఫ్‌ గ్యాస్‌ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement