గ్యాస్‌ బుకింగ్‌ వయా ఫేస్‌బుక్‌, ట్విటర్‌

You can book gas cylinder refill via Facebook and Twitter - Sakshi

న్యూఢిల్లీ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?. అయితే, మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ విధానంలో సిలిండర్‌ను బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు!. డిజిటలైజేషన్‌ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కల్పించింది.

ఫేస్‌‘బుక్‌’లో ఇలా..
ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సరి.

ట్విటర్‌లో ఇలా..
ట్విటర్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్ విషయానికొస్తే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్‌ ద్వారా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి.

సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలకు సేవలను సునాయాసంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top