రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్‌ డాలర్లు దాటిన భారత్‌ పెట్టుబడులు

India Investment Oil And Gas Projects In Russia Crossed 15 Billion Dollars  - Sakshi

న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్‌ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్‌ ప్రాజెక్టులపై భారత్‌ పెట్టుబడులు 15 బిలియన్‌ డాలర్లను మించడం గమనార్హం.

అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్‌ భారత్‌కు చెందిన ఎస్సార్‌ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్‌ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్‌ఎన్‌జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు.

చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top