ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు

WhatsApp Users In India Can Now Add Payments While Sending Money Through The App - Sakshi

వాట్సాప్‌ ! ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫోన్‌ లో ఎక్కువగా వినియోగించే యాప్‌. ఈ యాప్‌ తో స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, నచ్చిన వారితో గిల‍్లిగజ్జాలు. ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత హిస్టరీయే ఉంది. అయితే ఇన్ని రోజులు వాట్సాప్‌ లో చాటింగ్‌ చేసిన మనం ఇకపై ఆర్ధిక లావాదేవీలను జరుపుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను మంగళవారం ఇండియన్‌ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.గూగుల్‌ పే తరహాలో మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసేందుకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్‌ పేమెంట్‌ డైరక్టర్‌ మనేష్ మహాత్మే మాట్లాడుతూ.. వాట్సాప్‌  నుంచి 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు.వాట్సాప్‌ ద్వారా మనీ సెండ్‌ చేయడం.. అదే వాట్సాప్‌ నుంచి మనీ తీసుకోవడం అనేది ట్రాన్సాక్షన్‌ మాత్రమే. కానీ యూజర్లు వారి భావాల్ని ఒకరికొకరు పంచుకోవడం వెలకట్టలేనిది. అందుకే భవిష్యత్‌లో వాట్సాప్‌కు మరిన్ని ఫీచర్లను అప్‌డేట్‌ చేయనున్నట్లు తెలిపారు.  

వాట్సాప్‌ నుంచి డబ్బులు పంపడం ఎలా? 

♦ ముందుగా వాట్సాప్‌ డ్యాష్‌ బోర్డ్‌ ఓపెన్‌ చేయాలి

♦ రైట్‌ సైడ్‌ టాప్‌ లో ఉన్న మూడు డాట్స్‌ పై ట్యాప్‌ చేయాలి

♦ ట్యాప్‌ చేస్తే మీకు న్యూ గ్రూప్‌, న్యూ బ్రాడ్‌ కాస్ట్‌, లింక్డ్‌ డివైజెస్‌, స్టార్డ్‌ మెసేజెస్‌ తో పాటు చివరిగా పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది

♦ ఆ పేమెంట్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి యాడ్‌ పేమెంట్‌ మెథడ్‌ ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి

♦ అలా పేమెంట్‌ మెథడ్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేస్తే పేమెంట్స్‌ ఆప్షన్‌ తో డ్యాష్‌ బోర్డ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి

♦ కంటిన్యూ ఆప్షన్‌ తరువాత మీకు నచ్చిన బ్యాంక్‌ ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

♦ అనంతరం మీ కాంటాక్ట్‌ నెంబర్‌ ను వెరిఫై చేసుకోవాలి 

♦ వెరిఫై తరువాత.. న్యూ పేమెంట్‌ ఆప్షన్‌ లో మీరు ఎవరికైతే మనీ సెండ్‌ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ నెంబర్‌ మీద క్లిక్‌ చేసి..డబ్బులు పంపించుకోవచ్చు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top