అమెరికాలో నైట్రోజన్‌ గ్యాస్‌తో తొలి మరణ శిక్ష అమలు

Us Executes A Man With Nitrogen Gas First Time In History - Sakshi

అలబామా: మరణ శిక్షల్లో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలోనే అలబామా రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్‌ గ్యాస్‌ వాడి ఊపిరాడకుండా చేసి ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషి అయిన కెన్నెత్‌ యూజెన్‌ స్మిత్‌(58) ఊపిరితిత్తుల్లోకి ఫేస్‌ మాస్క్‌ ద్వారా ‍ స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి శిక్ష అమలు చేశారు. గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్‌ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.  

నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేసే విధానంపై అమెరికాలో వివాదం నడుస్తోంది. ఇది పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని ప్రభుత్వం చెబుతుండగా  విమర్శకులు మాత్రం  నైట్రోజన్‌ గ్యాస్‌తో మనిషిని చంపడం క్రూరమైన ప్రయోగం అని  మం‍డిపడుతున్నారు. 

అమెరికాలో సాధారణ మరణశిక్ష అమలు విధానం అయిన విషపు ఇంజెక్షన్‌తో స్మిత్‌కు ఇంతకుముందే శిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఐవీ లైన్‌ కనెక్ట్‌ కాకపోవడంతో శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేశారు. నైట్రోజన్‌ గ్యాస్‌తో తనను చంపడంపై స్మిత్‌ వేసిన అప్పీల్‌పై యూఎస్‌ అప్పీల్‌ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో శిక్ష అమలు ఖాయమైంది.

ఇదీచదవండి.. విక్టోరియా బీచ్‌లో ప్రమాదం... నలుగురు భారతీయులు మృతి 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top