గ్యాస్‌తో పంటకు నీరంట..! 

Farmer Is Supplying Water To The Crop With Gas In Srikakulam District - Sakshi

రాజాం: రైతులు కొత్త కొత్త పద్ధతులు అన్వేషిస్తున్నారు. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఎందువ మోహనరావు తన పంటపొలంలో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించేందుకు వినూత్న విధానాన్ని అవలంబించారు. తన వద్ద ఉన్న ఆయిల్‌ ఇంజిన్‌కు వంట గ్యాస్‌ సిలిండర్‌ జతచేసి ఎంచక్కా ఇంజిన్‌ సాయంతో మడ్డువలస కాలువలో నీటిని పంటపొలానికి తరలించారు. ఎకరా మొక్కజొన్న పంటకు 4 కిలోల గ్యాస్‌ సాయంతో నీరు పెట్టుకోవచ్చని రైతు ‘సాక్షి’కి తెలిపారు. తన స్నేహితుల వద్ద ఈ విధానాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
(చదవండి: రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్‌)
వినూత్నం: బాయిలర్‌ కోడి, పెరుగు ప్యాకెట్లు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top