వేలాదిగా విమానసరీ్వసులు రద్దు
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
వాషింగ్టన్: భీకర శీతాకాలపు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్‌లలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 14,100 విమాన సరీ్వసులు రద్దు కాగా, 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ప్రమాదాలు పెరుగుతున్నాయి.
విద్యుత్ తీగలు తెగిపోయి లక్షలాది ఇళ్లు చీకట్లలో మగ్గుతున్నాయి. హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని అధికారులు సూచించారు. ఇవే పరిస్థితులు సోమవారం కూడా కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. పలు రాష్ట్రాలకు అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు అధ్యక్షుడు ట్రంప్ అనుమతినిచ్చారు.


