breaking news
temperatures decreased
-
నేడు 5 జిల్లాల్లో శీతల గాలులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 2–3 రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా శీతల గాలులు వీచే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌యూ)లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. రాబోయే 2–3 రోజుల్లో అక్కడక్కడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. వ్యవసాయ వాతావరణ సూచనలు ⇒ వేరుశనగ, బొబ్బర్లను ఈ నెల 30 వరకు విత్తుకోవచ్చు. ⇒ మినుములు, పెసర విత్తనాలను వచ్చే నెల 10 వరకు విత్తుకోవచ్చు. ⇒ జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను వచ్చే నెల 31 వరకు విత్తుకోవచ్చు. ⇒ యాసంగి వరి నారుమళ్లను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 మధ్యలో పోసుకోవచ్చు. ⇒ ఆలస్యంగా నాటుకున్న వానాకాలం వరిలో గింజమచ్చ తెగులు ఆశించే అవకాశముంది. నివారణకు 1 మి.లీ. ప్రోపికొనజోల్ + 1 మి.లీ. స్పైరోమెసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
బాబోయ్.. చలి
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: మెతుకుసీమపై చలిపంజా విసురుతోంది. ఏకంగా 11.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి రాష్ట్రంలోనే మెతుకుసీమ రెండోస్థానంలో నిలిచింది. దీంతో జనం చలి తీవ్రతతో వణికిపోతున్నారు. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం వేళ బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ముందస్తు జాగ్రతగా ప్రజలు స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. పెరుగుతున్న చలిప్రభావంతో చంటి పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తట్టుకోలేక జనం ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లకే పరిమితవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. మున్ముందు చలి ప్రభావం మరింతగా పెరిగే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


