మెతుకుసీమపై చలిపంజా విసురుతోంది. ఏకంగా 11.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి రాష్ట్రంలోనే మెతుకుసీమ రెండోస్థానంలో నిలిచింది.
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: మెతుకుసీమపై చలిపంజా విసురుతోంది. ఏకంగా 11.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి రాష్ట్రంలోనే మెతుకుసీమ రెండోస్థానంలో నిలిచింది. దీంతో జనం చలి తీవ్రతతో వణికిపోతున్నారు. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం వేళ బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ముందస్తు జాగ్రతగా ప్రజలు స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. పెరుగుతున్న చలిప్రభావంతో చంటి పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తట్టుకోలేక జనం ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లకే పరిమితవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. మున్ముందు చలి ప్రభావం మరింతగా పెరిగే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


