వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ఐదేళ్ల బాలుడు లియామ్ కోనేజో రామోస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఖండించారు. చిన్నారుల్ని ఇలా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను సమర్థించింది.
మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో ప్రీ-స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న లియామ్‌ను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బాలుడితో పాటు అతని తండ్రిని నిర్భందించి తీసుకెళ్లారు. ఇలా చిన్నారుల్ని అదుపులోకి తీసుకోవడం గత రెండు వారాల్లో అదే స్కూల్ జిల్లాలోని నాలుగు విద్యార్థులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక పాఠశాల అధికారులు వెల్లడించారు.
అదుపులోకి తీసుకున్న అనంతరం ఐసీఈ అధికారులు చిన్నారిని ‘ఎర’గా ఉపయోగించారని ఆరోపించారు. ఐదేళ్ల బాలుడిని ఎందుకు అదుపులోకి తీసుకోవాలి? ఇది మానవత్వానికి విరుద్ధం’ అని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ బృందం ఈ చర్యను చట్టపరమైన అమలు చర్యగా సమర్థించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాము ఎలాంటి తప్పు చేయలేదు’ అని స్పష్టం చేసింది.
ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చకు దారి తీసింది. ప్రజలు,పాఠశాల అధికారులు, మానవ హక్కుల సంస్థలు చిన్నారులను ఇలాంటి చర్యల్లో భాగం చేయడం అమానుషం’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘He is just a baby’అనే ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Liam Ramos is just a baby. He should be at home with his family, not used as bait by ICE and held in a Texas detention center.
I am outraged, and you should be too. pic.twitter.com/djr2z1AG0N— Kamala Harris (@KamalaHarris) January 22, 2026


