ఆరోపణలను ఖండించిన వాంగ్‌చుక్‌  | Sonam Wangchuk denied allegations that struck deal with the government | Sakshi
Sakshi News home page

ఆరోపణలను ఖండించిన వాంగ్‌చుక్‌ 

Jul 26 2026 5:28 AM | Updated on Jul 26 2026 5:28 AM

Sonam Wangchuk denied allegations that struck deal with the government

లద్దాఖ్‌ తరహా పరిస్థితి 

నివారణకే ఒప్పుకున్నా 

విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం 

న్యూఢిల్లీ: కేంద్రంతో కుదిరిన ‘‘ఒప్పందం’’మేరకే తాను 26 రోజుల ఆమరణ నిరాహారదీక్షను ఉపసంహరించానన్న వార్తలను సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఖండించారు. జంతర్‌మంతర్‌ వద్ద ప్రశాంతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చినందుకే విరమించినట్లు స్పష్టం చేశారు. గత ఏడాది సెపె్టంబర్‌ 24న లద్దాఖ్‌లో యువతపై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుంటూ, ఢిల్లీలో కూడా అలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షను ఉపసంహరించుకుని శాంతి కోసం పిలుపునిస్తే పరిస్థితి సర్దుకుంటుందని భావించానని చెప్పారు.

 శుక్రవారం ఆర్ధరాత్రి యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసిన సోనమ్‌ నిరాహార దీక్ష విరమణకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదాన్ని కూడా ఆయన ఈ వీడియోలో పోస్ట్‌ చేశారు. తనను అరెస్ట్‌ అయినా చేయాలని, లేదంటే స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం కలి్పంచాలని వాంగ్‌చుక్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కేంద్ర మంత్రుల చర్చల సందర్భంగా తాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు పట్టబట్టలేదని, విద్యార్థులు కేసుల్లో చిక్కుకో కూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నానని చెప్పారు.

 లోపాయికారి ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే 26 రోజులపాటు ఆకలితో ఎలా ఉండేవాడినని ప్రశ్నించారు. ఏసీ గదిలో కూర్చొని ఒప్పందం చేసుకునే వాడినని అన్నారు. మంత్రులు నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంతోపాటు, పార్లమెంటులో చర్చకు అంగీకరించారని, కేసుల విషయంలో మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఆందోళన చెందాననన్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ సభ్యుల సమక్షంలోనే నిరాహార దీక్ష ఉపసంహరించాలని అనుకున్నా మంత్రులు రాకముందు నుంచే తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని అన్నారు. వారు లేకుండానే దీక్ష విరమించడంపై దుఃఖం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement