జంతర్‌ మంతర్‌ నిరసనల కాలక్రమం | Jantar Mantar Protest Timeline | Sakshi
Sakshi News home page

జంతర్‌ మంతర్‌ నిరసనల కాలక్రమం

Jul 26 2026 1:55 AM | Updated on Jul 26 2026 1:55 AM

Jantar Mantar Protest Timeline

జూన్‌ 6, 2026: జంతర్‌ మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు షురూ! 

⇒ ప్రధాన డిమాండ్‌: నీట్‌ యూజీ–2026 పేపర్‌ లీక్, సీబీఎస్‌ఈ ఆన్‌‑ స్క్రీన్ మార్కింగ్‌ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.  

జూన్‌ 28, 2026: సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష మొదలు. దేశవ్యాప్తంగా అందరి, ముఖ్యంగా జెన్‌–జీ దృష్టిని ఆకర్షించిన ఘట్టమిది. 
భారతదేశం నలుమూలల నుంచి సీజేపీ ఉద్యమానికి సంఘీభావం. వెల్లువలా జంతర్‌మంతర్‌కు జెన్‌–జీ.  

జూలై 18, 2026: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్‌ భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు జూలై 21న మెదాంత ఆసుపత్రికి తీసుకెళ్లేందకు అనుమతిచి్చంది.  

జూలై 20, 2026: చలో సంసద్‌ ర్యాలీ సందర్భంగా జంతర్‌ మంతర్‌ వద్ద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. మహిళలు సహా పలువురు విద్యార్థులకు గాయాలు. కొంతమందిపై పెల్లెట్‌ గన్‌ ప్రయోగం. జంతర్‌ మంతర్‌ చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాల మోహరింపు.  

జూలై 23, 2026 (రాత్రంతా జాగరణ): గాయాలు, అలసట ఉన్నప్పటికీ విద్యార్థులు నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఆటలు, పాటలతో సందడిగా రాత్రంతా సందడిగా మారింది జంతర్‌ మంతర్‌. 

 దేశం నలుమూలల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎందరో ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార పానీయాలు పంపించడం, కుర్రాళ్ల విన్యాసాలతో ఆ రాత్రి నిరసన కార్యక్రమాల్లో కొంగొత్త వైఖరిని ఆవిష్కరించింది. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న కొందరికి స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారం, నీరు, మందులు పంపిణీ చేశారు; ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగించేందుకు విసనకర్రలతో వారికి సపర్యలు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  
నిరసనకారులు రాక్‌స్టార్‌ సినిమాలోని ‘‘సడ్డా హక్‌’’తోపాటు చాలా సినిమా పాటలను ఉత్సాహంగా పాడి, ఆడారు. నినాదాలు రాత్రంతా మారుమోగాయి. 

జూలై 24, 2026: కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నేత జితేంద్ర సింగ్‌ మెదాంత ఆసుపత్రిలో సోనమ్‌ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన్‌ రాజీనామా మినహా మిగిలిన షరతులకు రాతపూర్వక అంగీకారం తెలపడంతో ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నట్లు సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రకటించారు. 
జూలై 25, 2026: పేపర్‌ లీక్‌పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా. 
  నిరసనకారులు దీనిని పాక్షిక విజయంగా ప్రకటించారు, కానీ పరీక్షల నిర్వహణ. పారదర్శకతపై మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement