మన పనస ఘనత.. | Average Annual Jackfruit Production By Country | Sakshi
Sakshi News home page

మన పనస ఘనత..

Jun 28 2026 10:08 AM | Updated on Jun 28 2026 10:32 AM

Average Annual Jackfruit Production By Country

ఫండే

పనసపండు

ఘనాంకాలు

వేసవి ఫలాల్లో మామిడి తర్వాత చెప్పుకోదగినది పనసపండు. పనసపండు వేసవి ముగిసిన తర్వాత కూడా దొరుకుతుంది. మన దేశంలో మార్చి నుంచి ఆగస్టు వరకు పనసపండ్లు దొరుకుతాయి. పనస పుట్టినిల్లు ఏ దేశమో సరైన సమాచారం లేదు గాని, ఇది తూర్పు ఆసియా దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు పాకినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.


పదహారో శతాబ్దంలో కాలికట్‌ రేవులో అడుగుపెట్టిన పోర్చుగీసు నావికుడు గార్షియా డి ఓర్టా కేరళ ప్రాంతంలో విరివిగా పండే పనసపండ్లను చూసి ఆశ్చర్యపోయాడు. మలయాళీలు వీటిని ‘చక్కా’ అనేవారు. దీని ఆధారంగా ఓర్టా పోర్చుగీసు భాషలో ‘జాకా’ అని రాసుకున్నాడు. ‘జాకా’ పదం ఆధారంగా ఇంగ్లిష్‌లో పనసపండుకు ‘జాక్‌ఫ్రూట్‌’ అనే పేరువచ్చింది. మామిడి పండ్లతో పాటు పనసపండ్ల ఉత్పాదనలో కూడా మన భారతదేశం చాలాకాలంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. మన పనస ఘనతకు గణాంకాల్లో తెలుసుకుందాం.


పనసపండు పోషకాల గని. ఇందులో శక్తినిచ్చే పిండి పదార్థాలు, చక్కెరలు, ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలతో పాటు విలువైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండులో ఉండే పోషకాలు ఇవీ...


పనసపండ్ల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలోనే ఉన్నా, ఇక్కడి ఉత్పాదనలో ఎక్కువ భాగం ఇక్కడే వినియోగం అయిపోతోంది. అందువల్ల పనస ఎగుమతుల్లో మన దేశం ఐదో స్థానానికి పరిమితమై ఉంది. ప్రపంచవ్యాప్తంగా పనస ఎగుమతుల విలువ ఏటా 150 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటోంది. పనస ఎగుమతుల్లో మొదటి పది దేశాల వివరాలను గణాంకాలలో తెలుసుకుందాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement