సిరియా రాజధాని డమాస్కస్‌లో పేలుడు.. ఆరుగురు మృత్యువాత | Explosion-Occured-In-Syria-Capital-Damascus-Cafe Near Palace Of Justice | Sakshi
Sakshi News home page

సిరియా రాజధాని డమాస్కస్‌లో పేలుడు.. ఆరుగురు మృత్యువాత

Jul 2 2026 10:59 PM | Updated on Jul 2 2026 11:14 PM

Explosion-Occured-In-Syria-Capital-Damascus-Cafe Near Palace Of Justice

సిరియా రాజ‌ధాని డ‌మాస్క‌స్‌లోని ఒక కేఫ్‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో క‌నీసం ఆరుగురు మృతి చెంద‌గా, 22 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా క‌థ‌నాల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3.24 గంట‌ల స‌మ‌యంలో అల్‌-మ‌ర్జా జిల్లాలోని ప్యాలెస్ ఆఫ్ జ‌స్టిన్ అనే న్యాయభ‌వనానికి స‌మీపంలో ఉన్న అల్‌-నాస‌న్ వీధిలోని కేఫ్‌లో పేలుడు జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందింది. 

పేలుడు ప‌రికరం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న సంభ‌వించిన‌ట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు సంబంధించి విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు సిరియా అధికార‌ ప్ర‌తినిధి మిలాద్ ఫ‌ద్ తెలిపారు. కేఫ్ ప‌రిస‌రాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. పేలుడుకు బాధ్యులు ఎవ‌ర‌న్న‌ది క‌నిపెడ‌తామ‌ని పేర్కొన్నారు. 

కేఫ్‌కు 40 మీట‌ర్ల దూరంలోనే న్యాయస్థాన భ‌వ‌నం ఉండ‌డంతో ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అయితే ఈ వారంలో సిరాయా మాజీ గ్రాండ్ ముఫ్తీ అహ్మ‌ద్ బ‌ద‌ర్ అల్‌-అల్దీవ్ హ‌స్సౌన్ ప్యాలెస్ ఆఫ్ జ‌స్టిస్‌లో విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా సిరియా రాజ‌ధాని డ‌మాస్క‌స్‌లో భ‌ద్ర‌తా ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని, సంపూర్ణ స్థిర‌త్వాన్ని నెల‌కొల్ప‌డానికి సిరియా ప్ర‌భుత్వానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని డ‌మాస్క‌స్ గ‌వ‌ర్నర్ మ‌హెర్ మ‌ర్వాన్ తెలిపారు.

చదవండి: అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement