-
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
Wall Street Journal: ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్!
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్‌తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్‌తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్‌పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి పౌరులకు భారత సర్కార్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది. -
ఇజ్రాయెల్ టార్గెట్ మిస్?.. ఇరాన్ ఎంబసీపైకి మిస్సైళ్లు!
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్? సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు సిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడులకు తెగబడింది. సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సిరియా సైనికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది మరణించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకవైపు రన్‌వే దెబ్బతింది. రెండు టర్మినళ్లలో నిర్వహణ వ్యవస్థ ధ్వంసమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ దాడి ఘటన జరిగింది. గత ఏడు నెలల్లో డమాస్కస్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించడం ఇది రెండోసారి. బషర్ అల్ అసద్‌కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లాల నుంచి ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌తోపాటు డమాస్కస్ దక్షిణాన ఉన్న సిరియా ఆయుధాగారంపైనా ఇజ్రాయెల్ క్షిపణులను ఎక్కుపెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లో కాల్పులు రమల్లా: ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యంతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు చనిపోయారు. జెనిన్‌లోని కాఫిర్దాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీని పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్మీ వారిపైకి కాల్పులకు దిగింది. కాల్పుల్లో సమెర్ హౌషియెహ్(21), ఫవాద్ అబెద్(25) అనే వారు మృతి చెందారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement