సిరియాలోని అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులు రక్తపాతాన్ని సృష్టించారు. దాంతో 17 మంది మరణించారు. మృతుల్లో జడ్జి, మిలటరీ ఉన్నతాధికారి ఉన్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది.
సిరియాలోని అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులు రక్తపాతాన్ని సృష్టించారు. దాంతో 17 మంది మరణించారు. మృతుల్లో జడ్జి, మిలటరీ ఉన్నతాధికారి ఉన్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. అలెప్పో నగరంలోని మెరిడియన్, అల్ఫర్కన్ ప్రాంతాల్లోని జనవాసాలపై తిరుగుబాటుదారులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్లను స్థానిక టీవీలలో ప్రసారం చేసింది. ఆ దాడుల్లో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.