సిరియాలో పేలుళ్లు: 19 మంది మృతి | 19 more killed in syria | Sakshi
Sakshi News home page

సిరియాలో పేలుళ్లు: 19 మంది మృతి

Sep 19 2013 5:05 PM | Updated on Sep 1 2017 10:51 PM

సిరియాలో మరోసారి హింస రాజుకుంది. గురువారం జరిగిన పేలుళ్లలో 19 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సిరియాలో మరోసారి హింస రాజుకుంది. గురువారం జరిగిన పేలుళ్లలో 19 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిరియా మధ్య రాష్ట్రం హామ్స్లో జబురిన్, అక్రాద్ అల్-డఫ్నీ పట్టణాల మధ్య రోడ్డుపై పేలుడు పదార్థాలను అమర్చి రెండు బస్సులు, ఓ కారును పేల్చివేశారు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ దుర్ఘటనకు కారకులు ఎవరన్న విషయం తెలియరాలేదు. రెణ్నెళ్ల కిత్రం సిరియా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తిరుగుబాటు దారుల కీలక స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement