డమాస్కస్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

NRI Telugu People And YSRCP Leaders Offer Their Tribute To Late CM YSR - Sakshi

మేరిల్యాండ్‌: అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని డమాస్కస్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి.వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్‌,  ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్  పార్థసారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్‌సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ ధనిరెడ్డి  ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు జరిగాయి. 

ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. 

- వైఎస్సార్‌ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ ప‌థకాల‌ను వైఎస్సార్‌ ప్రవేశపెట్టి,  ప్రతీ పేద‌వాడికి అండగా నిలిచిన  గొప్ప వ్యక్తి  రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా వైఎస్సార్  జయంతి, వర్ధంతిలతో పాటు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్‌ పేరు మీదుగా మేరిల్యాండ్‌లో జరుపుతున్నామని తెలిపారు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే నవరత్నాలకు సీఎం జగన్‌ రూపకల్పన చేశారని తెలిపారు.

- వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది ఈ వేడుకల్లో భాగం కావడం చూస్తుంటే రాజశేఖరరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. 

- మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్‌ మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్‌ సారధిరెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. 

- వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకుడు పవన్ ధనిరెడ్డి మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్‌ వైఎస్సార్‌ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ తపన ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ... కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు. 

పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ సారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్‌సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు భాస్కర బొమ్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొండా, వెంకట్ యర్రం, పవన్ ధనిరెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, రవి బారెడ్డి, మురళి బచ్చు, రాంగోపాల్ దేవపట్ల, శ్రీనివాస్ పూసపాటి, రామకృష్ణ, వాసుదేవ రెడ్డి తల్లా, గిరిధర్ బండి, సతీష్ బోబ్బా, పూర్ణశేఖర్ జొన్నల, శ్రీనాథ్, వెంకట్ కీసర, శ్రీనివాస్ పూతన, రామచంద్ర యారుబండి, నాగిరెడ్డి, లక్ష్మి నారాయణ, కరుణాకర్ వణుకూరి, అనంత్ పూసపాటి, శివ పిట్టు, శ్రీనివాస్, రాజు గొనె, రవి ముత్తోజు, రరాజు బచ్చు, నవీన్ చింతలపూడి లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.

ఫుడ్‌డ్రైవ్‌
వైఎస్సార్‌ జయంతి సందర్భంగా పిక్నిక్ , ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకు రెండు వందల మందికి పైగా  కుటుంబం తో వచ్చి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ లో ఐదు వందల పౌండ్స్ కి పైగా ఫుడ్ ను మన్నా ఫుడ్ సెంటర్‌కి డొనేట్ చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top