అన్నీ సూపర్ స్మార్ట్
అసలు వయసును లెక్కకడతాయి
చిన్న చిన్న మార్పులనూ గుర్తిస్తాయి
న్యూఢిల్లీ: వయసులు రెండు రకాలని మీకు తెలుసా? అవునండి. ఇది నిజం. ఒకటేమో మీరు పుట్టిన సంవత్సరం నుంచి ఇప్పటివరకూ లెక్కపెడితే వచ్చేది. రెండోది... బయలాజికల్ ఏజ్ అని పిలిచేది మన శరీరం తాలూకూ వయసు. రెండింటికీ తేడా ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. ఒకే ఏడాది కొనుగోలు చేసిన రెండు కార్లలో ఒకటి ఎక్కువ మైళ్లు తిరిగితే.. దాని బయలాజికల్ ఏజ్ ఎక్కువ. రెండోదానిది తక్కువ అని.
కారు బదులు మిమ్మల్ని ఊహించుకుంటే బయలాజికల్ ఏజ్ అంటే ఏమిటో అర్థమైపోతుంది. సరే...ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన బయలాజికల్ ఏజ్‌ను అంచనా కట్టేందుకు ఉపయోగపడే ఎపిజెనిటిక్ గడియారాలు చాలా తెలివైనవి శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా ఇవి పరిశీలిస్తూంటాయని ఇటీవల జరిగిన అధ్యయనం ఒకటి తెలిపింది. కొంచెం వివరంగా చూస్తే... మన శరీర క్రియలన్నీ జన్యువుల ఆధారంగానే జరుగుతాయని, కళ్ల రంగు మొదలుకొని ఒడ్డూ, పొడవు, ఇతర లక్షణాలకూ ఈ జన్యువులే కారణమని మనం చదువుకుని ఉంటాం.
పుట్టుకతో వచ్చే ఈ జన్యువులు ఆన్/ఆఫ్ అవుతూంటాయి. ఆన్ అయినప్పుడు శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లు ఉత్పత్తి అవుతూంటాయి. ఆఫ్ అయినప్పుడు కావు. డీఎన్‌ఏ పోగులు కొన్ని వచ్చి జన్యువులకు అతుక్కోవడం వల్ల ఈ ఆన్/ఆఫ్‌లు జరుగుతూంటాయి. ఇలా అతుక్కున్న డీఎన్‌ఏ పోగుల్లోని కూర్పు ఆధారంగా బయలాజికల్ ఏజ్‌ను అంచనా కట్టవచ్చు. 2013లో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎపిజెనిటిక్ గడియారం ‘హార్వత్ క్లాక్’శరీరంలోని 51 కణజాలాల్లో ఉండే ‘353 సీపీజీ’ప్రాంతాల్లోని డీఎన్‌ఏ పోగుల కూర్పును పరిశీలించి బయలాజికల్ వయసును అంచనా వేస్తుంది.
తరువాతి కాలంలో ఈ హార్వత్ క్లాక్‌తోపాటు రక్తానికి మాత్రమే సంబంధించిన హన్నుమ్ క్లాక్, ఆయుష్షు, వ్యాధుల ముప్పులను అంచనా వేసే గ్రిమ్ ఏజ్ క్లాక్, ఫీజో ఏజ్ క్లాక్, ట్రాన్స్‌స్క్రిప్టోమిక్ క్లాక్, పోటియోమిక్ క్లాక్, మలీ్టయోమిక్ క్లాక్ అని బోలెడన్నింటి గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది. వీటన్నింటి ఆధారంగా మన బయలాజికల్ వయసుకు సంబంధించిన వేర్వేరు విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు గ్రిమ్ ఏజ్ క్లాక్ ద్వారా మనకు ఫలానా వ్యాధి వస్తుందా? రాదా? అని అంచనా వేయవచ్చునన్నమాట.
అన్ని గమనిస్తూంటాయి..
మన ఎపిజెనిటిక్ గడియారాలు శరీర రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియలు, కణాల మధ్య సమాచార వినిమయాల్లో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గుర్తిస్తూంటాయని ‘ఎన్‌పీజీ ఏజింగ్’జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం ఒకటి తెలిపింది. హోర్వాత్, హన్నుమ్, ఫీనోఏజ్ గ్రిమ్‌ఏజ్‌లతోపాటు డునెడిన్‌పేస్ ఎపిజెనిటిక్ గడియారాలను కొలవడం ద్వారా తామీ అంచనాకు వచి్చనట్లు సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతేకాకుండా.. తాము జన్యువులు ఆన్/ఆఫ్ స్థితుల ఆధారంగా సరికొత్త ఎపిజెనిటిక్ క్లాక్ ఒకదాన్ని సిద్ధం చేశామని ఇది వయసుతోపాటు వచ్చే సమస్యలు మరణాలను మరింత కచి్చతంగా లెక్కకట్టగలదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త థాలిడా ఎమ్ అర్బావాంగ్ తెలిపారు. ‘‘వయసు అంటే చాలామంది బర్త్‌డే కేక్‌పై వెలిగించే కొవ్వొత్తులు అనుకుంటారు.
వాస్తవానికి ఇది మన శరీరంలోపలి కణాల్లో ఏం జరుగుతోందన్న దానికి సంబంధించింది’’అని థాలిడా వ్యాఖ్యానించారు. ఎపిజెనిటిక్ గడియారాలు ఒక్కోటి మన వయసుకు సంబంధించిన ఒక్కో అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూంటాయని తాము గుర్తించినట్లు తెలిపారు. అమెరికాలో సుమారు 3227 మంది రక్త నమూనాలను పరిశీలించి, జన్యువులకు అతుక్కునే డీఎన్‌ఏ పోగుల కూర్పు, జన్యువుల ఆన్/ఆఫ్ స్థితులను పోల్చి చూశామని చెప్పారు.
వీటి ఆధారంగా శరీరంలో శక్తిని సమన్వయ పరచడం మొదలుకొని కణాల అభివృద్ధి, రోగ నిరోధక వ్యవస్థ కణాలు పనిచేయడం వరకూ అనేక అంశాలను అర్థం చేసుకుని తుది అంచనాకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ కూడా జీవక్రియలు, రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు, కణాల మధ్య సమాచార వినిమయం వంటివి గమనిస్తున్నట్లు తెలిసిందన్నారు. హోర్వత్ గడియారం జీవక్రియలకు సంబంధించిన సమాచారాన్ని గమనిస్తే, హన్నుమ్ క్లాక్ హోమియోస్టాసిస్, వాసు్కలర్ వాల్ ఇంటరాక్షన్లను గమనిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. అలాగే గ్రిమ్‌ఏజ్ క్లాక్ ఇంటెర్‌ఫెరాన్ సిగ్నలింగ్‌ను పరిశీలిస్తుందన్నారు.


