రోజుకు 30 – 40 మందిని లేపేద్దాం  | Israeli minister calls for killing 30 to 40 Palestinians in Gaza nightly | Sakshi
Sakshi News home page

రోజుకు 30 – 40 మందిని లేపేద్దాం 

Aug 18 2026 5:29 AM | Updated on Aug 18 2026 5:29 AM

Israeli minister calls for killing 30 to 40 Palestinians in Gaza nightly

ఇజ్రాయెలీ మంత్రి వ్యాఖ్య 

గాజా ప్రజలకు బతికే హక్కు లేదని వెల్లడి 

వాళ్లు మనుషులే కాదని వ్యాఖ్య

జెరూసలేం: ‘‘గాజాలో ప్రతి రాత్రి ఓ 30 – 40 మందిని లేపేసేలా ప్లాన్‌ చేయాలి. వీళ్లతో మనకు తక్షణం ముప్పు ఉన్నందుకు మాత్రమే కాదు... అక్కడ బతికేందుకు అర్హత లేని వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు బతక్కూడదు. వాళ్లసలు మనుషులే కాదు’’ఈ మాటన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఇజ్రాయెలీ జాతీయ భద్రత శాఖ మంత్రి ఇటమార్‌ బెన్‌గ్విర్‌. కొంచెం ఆలస్యంగా ఆదివారం ఈ సమాచారం వెలుగు చూసింది. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్‌ పాలస్తీనాలో మారుమోగుతోంది. 

 గాజాలో హమాస్‌ చెర నుంచి విడుదలైన బందీ రోమ్‌ బ్రాస్లావ్‌స్కీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో బెన్‌గ్విర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి అనంతరం ఇజ్రాయెల్‌ చేపట్టిన చర్యలపై చర్చ సందర్భంగా.. గాజాపై దాడులు తగ్గించడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూతో నాకు విభేదాలున్నది రహస్యం ఏమీ కాదు. 

గాజాలో ప్రతి రాత్రీ కొంతమందిని లక్ష్యంగా చేసుకుని 30 నుంచి 40 మందిని మట్టుబెట్టాలి’’అని బెన్‌గ్విర్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బెన్‌గ్విర్‌తోపాటు పలువురు ఇజ్రాయెలీ అధికా రులు గతంలోనూ గాజా విషయంలో ఇ లాంటి విపరీత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో కొన్నింటిని పాలస్తీనా అనుకూల వర్గాలు ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించాయి కూడా.

 గాజాలో మారణహోమానికి ఇజ్రాయెల్‌ ప్రయతి్నస్తోందనేందుకు వీటిని నిదర్శనాలుగా చూపాయి. అయితే గాజాలో తాము మారణ హోమానికి పాల్పడలేదని ఇజ్రాయెల్‌ అంటోంది. బెన్‌గ్విర్‌ తాజా వ్యాఖ్యలను స్థానిక మీడియా అసలు పట్టించుకోనేలేదు. కానీ 2023 నాటి హమాస్‌ దాడి తరువాత బెన్‌గిŠవ్‌ర్‌ లాంటివాళ్లు ఇజ్రాయెల్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. పాలస్తీనీయులు గాజా నుంచి సామూహికంగా తరలిపోవాలని, అక్కడ ఇజ్రాయెల్‌ స్థావరాలు ఏర్పాటు చేయాలని కూడా బెన్‌గ్విర్‌ పిలుపునిచ్చారు. 

ఈ విధానం జాతి నిర్మూలనకు దారితీయవచ్చని అంతర్జాతీయ న్యాయ నిపుణులు హెచ్చరించారు. బెన్‌గ్విర్‌ జాతీయ భద్రతా శాఖ మంత్రి అయినప్పటికీ మిలటరీపై ఆయన పెత్తనం ఏమీలేదు. గాజాపై దాడులకు ఆదేశించే అధికారమూ లేదు. అయితే దేశంలో ప్రస్తుతం ఈయనో ప్రభావశీలమైన నేత. దేశంలో పాలస్తీనీయులను బంధించి ఉంచిన జైళ్లు ఉన్న ప్రాంతాల్లో మంచి పట్టున్న వ్యక్తి. 2025లో బెన్‌గ్విర్‌ పాలస్తీనా ఖైదీలకు పెట్టే ఆహారంలో గణనీమైన కోతలు విధించినందుకు ఇజ్రాయెలీ ఉన్నత న్యాయస్థానం కూడా తప్పు పట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement