‘చర్లపల్లి–తిరువనంతపురం’ రైలును కేరళలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి–తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు. రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
రైలు వేళలు ఇలా...
17041 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17042 నంబరుతో బుధవారం సాయంత్రం 5.30కు తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11.30కి చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ రైలు నల్లగొండ, గుంటూరు, తెనాలి, గూడూ రు, రేణిగుంట, కాటా్పడి, ఈరోడ్ – కోయంబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకులం టౌన్, కొ ట్టాయం, కాయంకులం రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం ఇదే రూట్‌లో శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. కొత్తగా ప్రారంభం కానున్న అమృత్‌భారత్ వల్ల అయ్యప్ప భక్తులకు భారీ ఊరట లభించనుంది. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో హాలి్టంగ్ సదుపాయం ఉంది.ఈ ట్రైన్‌లో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్ బోగీలు ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు.


