సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ బ్లాక్ వివాదంపై విచారణకు కేంద్ర బృందాన్ని సింగరేణికి పంపిచనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కేంద్రం బృందం.. తెలంగాణలో పర్యటించనుంది.
కాగా, నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఇద్దరు సభ్యుల కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. ఈ వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను, ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు.


