పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు

మంగళగిరి టౌన్‌: చైనాలో జరిగే పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు భారత్‌ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్‌లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్‌ జూనియర్‌ అండ్‌ జూనియర్‌(మెన్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ అండ్‌ ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్‌ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్‌ లిఫ్టర్లు ఎం. షానూన్‌ 47 కేజీల విభాగం, జూనియర్‌ ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌, ఇ.ఎల్‌. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్‌ జూనియర్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement