రైతులకు మద్దతు ధర కల్పించండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు మద్దతు ధర కల్పించండి

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

చీరాల అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వం రైతులను మాటలతో మభ్యపెడుతోందని, పండిన ధరలకు గిట్టుబాటు ధర లేదని, కనీసం రైతుల పంటల ఉత్పత్తులను మద్దతు ధర కన్నా వెంటనే కొనుగోలు చేయాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గురువారం వైఎస్సార్‌ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ బాబు ఆదేశాల మేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతాంగం కునారిల్లుతోందన్నారు. మొంథా తుఫాన్‌ నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం ఇంత వరకు అందించక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, ధాన్యం, అపరాలు ఏవి చూసినా కనీస మద్దతు ధర లేక పోవటంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు రైతుల పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేయించకపోతే ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల బసవపున్నారెడ్డి, పట్టణ అధ్యక్షుడు యాతం మేరీబాబు, మండల అధ్యక్షుడు బక్కా అద్దంకి రెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు రాజు వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, బొడ్డు సుబ్బారావు, మాజీ కౌన్సిలర్‌ బత్తుల అనీల్‌, ఆసాది అంకాళ రెడ్డి, షేక్‌ హుమాయూన్‌ కబీర్‌, వాసిమల్ల వాసు, గోలి గిరి, చెల్లి బాబు, తేళ్ల రాంబాబు నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల బాధ్యులు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

చీరాల ఆర్డీఓ కార్యాలయంలో

వైఎస్సార్‌ సీపీ నాయకుల వినతిపత్రం

Advertisement
 
Advertisement
Advertisement