జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ మారు వేషంలో తనిఖీలు పబ్లిసిటీనే.. ఫలితం లేదు మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఏ విధమైన లోపాలు కనిపించవు.. ఎవరిపై క్రమశిక్షణ చర్యలూ లేవు సూపరింటెండెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు
చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్‌లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా 2024 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్‌లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్‌లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసి ఆయన వైరల్ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.
మూడుసార్లు తూతూ మంత్రమే..
సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్‌లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్ డాక్టర్స్, సర్జన్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్ రాకుండా జూనియర్స్‌పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు.
మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలుకు పంపే పనిలో పోలీసులుఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


