జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఉత్కంఠ భరితంగా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చీరాల సబ్ డివిజన్ జట్టుపై హెడ్ క్వార్టర్స్ టీమ్ విజయం
బాపట్లటౌన్: మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహద పడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌పేరెడ్ గ్రౌండ్‌లో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పని ఒత్తిడిని అధిగమించి మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు క్రీడలు ఎంతో దోహద పడతాయన్నారు. టోర్నమెంట్‌లో గెలుపోటములు సమానమని తెలిపారు. క్రీడల వలన నాయకత్వ లక్షణాలు పెరగడంతోపాటు సమష్టి కృషి అలవడుతుందన్నారు. ఆడడం, వీక్షించడం మంచి అలవాట్లు అయినప్పటికీ బెట్టింగ్‌లు నిర్వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. బెట్టింగ్‌ల వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్న ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిణామాలు చూస్తూనే కొంతమంది అత్యాశతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యువత బెట్టింగ్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని, క్రికెట్‌ను కేవలం క్రీడా స్ఫూర్తితో మాత్రమే చూడాలని పేర్కొన్నారు. దానిని జూదంగా మార్చి తమ అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, ఎస్‌బీ–2 సీఐ ఎం.రాంబాబు, సీసీఎస్ సీఐ పి. ప్రేమయ్య, ఆర్‌ఐలు మౌలుద్దీన్, ప్రదీప్, చీరాల 2 టౌన్ సీఐ శశికుమార్, ఇతర పోలీస్ అధికారులు, చీరాల సబ్ డివిజన్, జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్ల సభ్యులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్ హెడ్ క్వార్టర్స్ జట్టు
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన హెడ్ క్వార్టర్స్ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. చీరాల సబ్ డివిజన్ జట్టుపై బాపట్ల హెడ్ క్వార్టర్స్ జట్టు విజయం సాధించింది. టోర్నమెంట్‌లో చీరాల, బాపట్ల, రేపల్లె సబ్ డివిజన్లకు చెందిన మూడు జట్లు, ఏఆర్ జట్టు, హెడ్ క్వార్టర్స్ జట్టు పాల్గొన్నాయి.


