ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్‌ వీరన్నపాలెం డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్‌, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు.

దెబ్బ తింటున్న సంప్రదాయాలు..

ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం.

‘జనరల్‌ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు..

రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్‌ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్‌ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్‌ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్‌ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్‌ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్‌ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్‌ చైర్మన్‌ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్‌, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్‌ నాయుడు పాల్గొనగా కళానికేతన్‌ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు.

ప్రజల సమస్యలను

ఎత్తిచూపిన ప్రదర్శనలు

Advertisement
 
Advertisement
Advertisement