శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 గ్రంథాలయాలు నడిచేదెలా! వేధిస్తున్న నిధుల లేమి, సిబ్బంది కొరత చీరాల: విజ్ఞాన భాండాగారాలుగా పిలుచుకునే గ్రంథాలయాలు ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విజ్ఞానంతోపాటు వివేకాన్ని అందిస్తూ ఎందరో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేందుకు సహకారం అందించిన గ్రంథాలయాలపై కూటమి ప్రభుత్వం కత్తికట్టింది. సెస్‌ల రూపంలో నిధులు వసూలు చేసినా గ్రంథాలయాలకు జమ కాకపోవడంతో పాటు, సిబ్బంది కొరతను కూడా అధిగమించకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. స్థానిక సంస్థల నుంచి వసూలు చేసిన సెస్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విజ్ఞాన దీపాలు వెలిగించాల్సిన గ్రంథాలయాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్రంథాలయాలకు గ్రహణం పట్టింది. నిధుల సంక్షోభం కారణంగా సిబ్బందికి జీతాలు, గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కూడా కల్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
నిధుల విడుదలలో జాప్యం...
గ్రంథాలయాలకు మంజూరు చేయాల్సిన నిధులు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా.. లైబ్రరీ సెస్ మాత్రం గ్రంథాలయాల ఖాతాకు జమ కాలేదు. దీంతో గ్రంథాలయాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. దాతల సహకారంతో వారిచ్చిన వస్తువులు, ఫర్నిచర్‌తోనే గ్రంథాలయాలను నెట్టుకొస్తున్నారు.
రూ.24 కోట్ల సెస్ బకాయిలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాల పరిధిలో గ్రంథాలయాలకు రావాల్సిన బకాయిలు రూ.24 కోట్లు ఉన్నాయి. వీటిని సకాలంలో గ్రంథాలయాల ఖాతాల్లో జమ చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. అలానే గ్రేడ్–2 గ్రంథాలయమైన చీరాలకు మున్సిపాలిటీ నుంచి రూ.2.50 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది. చీరాల శాఖ గ్రంథాలయం గ్రేడ్–2 గా ఉంది. గ్రంథాలయంలో 32 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఎంతో మంది నిరుద్యోగులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారితో నిత్యం కళకళలాడుతుంది. లైబ్రరీ సెస్ సకాలంలో మంజూరు కాకపోవడంతో గ్రంథపాలకులుకు కూడా రెండు నెలలుగా జీతాలు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అరకొర నిధులు.. దాతలే దిక్కు..
గ్రంథాలయాల నిర్వహణ, మౌలిక వసతులు, గ్రంథపాలకునికి జీతాలు ఇలా అన్ని రకాల ఖర్చులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులు, జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఖర్చు వేలల్లో ఉంటుంది. వేసవిలో విద్యార్థులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించి గ్రంథాలయాలను నెట్టుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాల వారోత్సవాల నిర్వహణకు ప్రత్యేక గ్రాంటు విడుదల చేసేది. సెస్ వసూళ్లు నేరుగా గ్రంథాలయాల ఖాతాల్లో జమయ్యేవి. వాటితో గ్రంథాలయ అభివృద్ధి, భవనాల నిర్మాణం, పుస్తకాల కొనుగోలు వంటి కార్యక్రమాలను చేపట్టారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదు.
న్యూస్‌రీల్
జీతాలు, పెన్షన్లకు గ్రాంట్లు విడుదల చేయాలి
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేయాలి. లైబ్రరీ సెస్ ఎప్పటికప్పుడు జమ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలకు అవసరమైన నిధులు కేటాయించాలి. పెన్షనర్లకు అందించే బెనిఫిట్స్ సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా స్పందించాలి.
నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
దుర్గమ్మకు భక్తుల విరాళాలు
బాపట్ల
శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026
వేధిస్తున్న నిధుల లేమి, సిబ్బంది కొరత
7
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
రూ.23 కోట్ల సెస్సు బకాయిలు
నిధుల కొరతతో రెండు
నెలలుగా అందని వేతనాలు
వేసవి శిక్షణ శిబిరాలకు
మంజూరు కాని నిధులు
వైఎస్సార్ సీపీ హయాంలో
గ్రాంటు విడుదల
–పీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం
తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు.