నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి | - | Sakshi
Sakshi News home page

నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి

బాపట్ల: జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యారంగ సమీక్ష సమావేశంలో విద్యార్థులకు కిట్స్‌ పంపిణీ, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, యూడైస్‌ డేటా, మధ్యాహ్న భోజన పథకం, ఎఫ్‌ఎల్‌ఎన్‌కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీ పథకం, సీసీ టీవీ ఏర్పాటు, అనీమియా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌ కౌన్సెలింగ్‌, హాస్టల్‌ నిర్వహణ, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌మేళాలు, వయోజన విద్య, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌ సింగ్‌, జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిని మాధవి అధికారులు పాల్గొన్నారు.

నైబర్‌ హుడ్‌ వర్క్‌ స్పేస్‌ కల్పనకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నైబర్‌ హుడ్‌ వర్క్‌ స్పెస్‌ పాలసీ 2025–30 కింద పని స్థలాన్ని లీజుకు ఇవ్వదలచిన వర్క్‌ డెవలపర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement