సంగీతంలో రెండోసారి గిన్నిస్‌ రికార్డ్‌ | - | Sakshi
Sakshi News home page

సంగీతంలో రెండోసారి గిన్నిస్‌ రికార్డ్‌

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్‌బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్‌ విల్సన్‌బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్‌ విల్సన్‌బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్‌ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్‌ విల్సన్‌బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్‌ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్‌ విల్సన్‌ బాబుకు సర్టిఫికెట్‌, మెడల్‌ అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement