అమృతలూరు పీహెచ్‌సీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అమృతలూరు పీహెచ్‌సీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

అమృతలూరు పీహెచ్‌సీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు

వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్‌ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్‌ శృతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు, హెల్త్‌ అసిస్టెంట్‌ మేకా శంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement