కర్లపాలెం: క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు క్రికెట్ పోటీలు దోహదపడతాయని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలం కట్టావాద గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు ఆసక్తి పెంపొందించుకోవాలని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఆటల పోటీలు దోహదపడతాయన్నారు. క్రికెట్ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో సక్రమంగా నిర్వహించాలని నిర్వాహకులను ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, అంబేడ్కర్ యువజన సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త చెన్ను జనార్థన్, నాయకులు మార్పు బెనర్జి, మార్పు రత్నం, వీరయ్య, సలగల మోక్షానందం, కొండమూది శ్యామ్యూల్, దాసరి బాబూరావు ఉన్నారు.


