బాపట్ల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అద్దంకి నియోజకవర్గానికి చెందిన జజ్జర ఆనందరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్‌మీడియా వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన దాసరి కిరణ్‌బాబును నియమించారు. వీరి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మరొకరికి గాయాలు
మంగళగిరి టౌన్: బైక్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు మరొకరు గాయపడిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పసుపులేటి మధుబాబు(50) శుక్రవారం పని నిమిత్తం ఆత్మకూరు వచ్చాడు. తిరిగి చిలువూరు వెళ్లే క్రమంలో నంబూరు మీదుగా వెళ్లేందుకు మంగళగిరి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న మధుబాబు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు, బైక్ రెండూ అదుపుతప్పి సర్వీస్‌రోడ్ నుంచి కిందకు ఎగిరిపడ్డాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న మధుబాబు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆదినారాయణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధు బాబు ఓ ప్రైవేటు బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగళగిరి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు మధుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


