న్యూస్‌రీల్
చంద్రబాబు పాలనలో వేరుశనగ రైతులకు వింత పరిస్థితి వేసవి సాగు ప్రారంభంతో కోరిన విత్తన రకం అందక ఇబ్బందులు దిగుబడి తగ్గినా అదే రకం అంటగడుతున్న ప్రభుత్వం ఇకనైనా మార్చి ఇవ్వాలని రైతుల డిమాండ్
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 33.9760 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 525.10 అడుగులకు చేరింది. ఇది 158.7393 టీఎంసీలకు సమానం.
చంద్రబాబు సర్కారు వచ్చాక రైతులకు కన్నీరే మిగిలింది. విత్తనం నాటిన నాటి నుంచే ఎరువులు, పురుగుమందులు మొదలు పంట చేతికొచ్చే వరకు ఏదో ఒక సమస్య అన్నదాతలను అతలాకుతలం చేస్తోంది. పాలకుల అసమర్థతతో నేడు పంట విక్రయించాలంటే కొనే దిక్కు లేకుండా పోయింది. లాభం సంగతి దేవుడెరుగు... పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు కుదేలు అవుతున్నారు. విత్తనాలు కూడా వేరుశనగలో కోరుకున్న రకం దొరకడం లేదు. రైతులపై కనికరం చూపని చంద్రబాబు ప్రభుత్వం తీరుతో తీవ్ర ఆవేదనలో కూరుకుపోతున్నారు.
జూన్ 15వ తేదీ నుంచి ఖరీఫ్ పంట కాలం ప్రారంభం అవుతుంది. అయితే చీరాల ప్రాంతంలో వేసవిలో కూడా వేరుశనగ సాగు చేపడతారు. స్పింక్లర్లతో రైతులు పంట పండిస్తారు. ఈ క్రమంలో ఏడాదికి వారికి మూడు పంటలు పండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా వేరుశనగకు సంబంధించి టీఏజీ–24 రకం ఎక్కువ సాగు చేస్తుంటారు. సాగుదారుల్లో ఎక్కువ మంది ఆ రకాన్ని అడుగుతున్నారు. ఆ విత్తన రకం దీర్ఘకాలంగా సాగు చేస్తుండటంతో విశిష్ట అనే రకం విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ రకం ఒకింత దిగుబడి తగ్గుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వానికి మా పరంగా ఇచ్చే సమాచారంలో ఆ విషయాన్ని పేర్కొంటున్నాం. మా వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నాం.
– నిర్మలాదేవి, ఏఓ, చీరాల మండలం
చీరాల అర్బన్: అదునులో పదును కావాలి. పదునులో విత్తనం పడాలి. ప్రకృతి అనుకూలించాలి. చీడపీడల నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వాటికి మద్దతు కాకుండా గిట్టుబాటు ధర దక్కాలి. అప్పుడే రైతులకు నాలుగు రూపాయలు మిగులుతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకు పాలకులు, అధికారులు చిత్తశుద్ధి చూపాలి. కేవలం మాటలకే పరిమితమైతే రైతుకు ప్రయోజనమే ఉండదు,. ప్రస్తుతం మొక్కజొన్న రైతులకు లాభం సంగతి అటుంచి, కనీసం మద్దతు ధర కూడా లేదు. వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట నష్టపరిహారం ఊసే లేదు. వేరుశనగ రైతులకు కనీసం విత్తనాలు దొరకడం లేదు.
జల్లులతోనే సాగు.
చీరాల నియోజకవర్గంలో పలువురు రైతులు స్పింక్లర్ల సాయంతో నీటి తడులు ఇస్తూ వేరుశనగ సాగు చేస్తుంటారు. కోరిన విత్తనాలను మాత్రం ప్రభుత్వం సరఫరా చేయటం లేదు. సర్కారు విత్తనాలతో సరైన దిగుబడులు రావటం లేదు. దీంతో తాము అడిగినవి ఇవ్వకుండా... వద్దన్న వాటిని అంటగడితే ఎలా అని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖరీఫ్ నాటి కన్నా టీఏజీ–24 రకం విత్తనాలు సరఫరా చేయాలని పలువురు రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. వేరుశనగకు సంబంధించి గత రెండు సంవత్సరాలుగా దిగుబడులు తగ్గుతున్నాయి. సాగు పరిస్థితులతోపాటు విత్తనాలు కూడా కొంత కారణంగా రైతులు చెబుతున్నారు. చీరాల ప్రాంతంలో కొందరు మూడు పంటలు పండిస్తారు. అందులో వేరుశనగ సాగు చేసేవారు టీఏజీ–24 రకం విత్తనాలను ఎద పెడుతుంటారు. దిగుబడి ఎకరాకు రమారమి 40 బస్తాలు (36 కేజీలు) వస్తుంటాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వపరంగా విశిష్ట రకం వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుబడులు తగ్గుతున్నాయని భావిస్తున్నారు. ఎకరాకు 25 నుంచి 28 బస్తాలు మాత్రమే దిగుబడి రావడం నిదర్శనమంటున్నారు.
వేసవి సాగు ప్రారంభం
వేసవి వేరుశనగ సాగును రైతులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టారు. మరో ఏడెనిమిది వందల ఎకరాలు విస్తీర్ణంలో సాగు కానుంది. అందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ వారి తిరునాళ్ల రేపటితో పూర్తవుతుంది. ఆ తరువాత వేసవి వేరుశనగ సాగు ప్రారంభిస్తామని రైతులు చెబుతున్నారు.ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు స్పింక్లర్లు కింద వేసవిలో వేరుశనగ సాగు చేసే రైతులకు సంబంధించిన పంట వివరాలను ఈ – క్రాప్ చేస్తున్నారు.
7
విత్తన మార్పిడి ముఖ్యం
భూమి పరంగా ప్రతి సంవత్సరం ఒకే పైరు వేయకుండా పంట మార్పిడి జరిగితే బాగుంటుంది. చీడపీడలు తగ్గుతాయి. సరైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెప్పటం పరిపాటి. అదే రీతిలో దీర్ఘకాలం ఒకే పంటకు రకం సంబంధించి ఒకే రకమైన విత్తనాలు వినియోగించటం కూడా సరైన పద్ధతి కాదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో విత్తన మార్పిడి నేపథ్యంలో విశిష్ట రకం వేరుశనగ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. దిగుబడి తగ్గటాన్ని పరిగణనలోకి తీసుకుని మెరుగైన పంట వచ్చే విత్తనాలను తమకు సరఫరా చేయాలని వేరుశనగ రైతులు కోరుతున్నారు.


