బాపట్లటౌన్: సముద్రస్నానాలు చేస్తూ ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ముగ్గురు గల్లంతైన ఘటన సోమవారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన గోవతోటి మణిషా, గోవతోటి పవిత్ర, గోవతోటి సంతోష్‌లతో కలిసి సోమవారం సముద్రస్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. తీరంలో విధులు నిర్వర్తిస్తున్న మైరెన్ పోలీసులు తక్షణమే స్పందించి ముగ్గురిని కాపాడారు. ముగ్గురు ప్రాణాలు కాపాడిన మైరెన్ ఏఎస్‌ఐ కె.వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ టి.శ్రీనివాసరావు, హోంగార్డు కె.నాగరాజు, కె.ఆశీర్వాదంలను మైరెన్ సీఐ, డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు.
సత్వరమే స్పందించి కాపాడిన మైరెన్ పోలీసులు


