హనుమజ్జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హనుమజ్జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

తాడేపల్లి రూరల్‌: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో 10వ తేదీ ఉదయం సంపూర్ణ సుందరకాండ పారాయణ, 11న ఉదయం 9 గంటలకు శ్రీ దాసాంజనేయ స్వామి వారికి అభిషేక మహోత్సవం, మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదగోష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న ఉదయం 9 గంటలకు యోగాంజనేయ స్వామి వారికి నవకలశ స్నపనం, విశేష అలంకరణ, 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్‌చాలీసా పారాయణ, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. మూడు రోజులు కై ంకర్యాలు జరుగుతాయని, పుష్ప కై ంకర్యానికి రూ. 11,000, ప్రసాద కై ంకర్యానికి రూ. 5,000, ఉత్సవ కై ంకర్యానికి రూ. 3000గా నిర్ణయించామని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement