తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ | - | Sakshi
Sakshi News home page

తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ

మంగళగిరి టౌన్‌: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్‌ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement