న్యూస్‌రీల్
ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న అన్ని వర్గాలు యంత్రాలతో వ్యవసాయ పనులపై పెను ప్రభావం సలసల కాగుతున్న వంట నూనెలు.. కొండెక్కిన కూరగాయల ధరలు చంద్రబాబు పాలన తీరుపై మండిపడుతున్న సామాన్యులు
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు.
చీరాల అర్బన్: చంద్రబాబు పాలన తీరు ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత అన్న చందంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంపు, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు చమురు మంట పెట్టారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 3.35, డీజిల్ పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్ల విక్రయాలు పెరిగాయి. యంత్రాలతో చేసే వ్యవసాయ పనులకు బాడుగ ధరలు భారంగా మారాయి. ఆటో చార్జీల పెంపుతో ప్రయాణాలకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఫోన్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
రైతులపై మరింత భారం
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగ అనే చందంగా పరిస్థితి మారింది. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాలేదు. నకిలీ విత్తనాల బెడదతో రైతులు నష్టపోయారు. పంట రుణాలు మాటలకే పరిమితం అయ్యాయి. అన్నీ తట్టుకుని పండించిన పంటలకు మద్దతు ధరలు లేవని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పరోక్షంగా వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం కూడా ప్రశ్నార్థకమేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండెక్కిన కూరగాయల ధరలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ఆదాయం ఎంతున్నా కుటుంబ పోషణకే సరిపోవటం లేదని వాపోతున్నారు. కూరగాయల ధరలు కొండెక్కాయి. వాటిని పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ లబ్ధి పొందుతోంది. వంట నూనెలు, పప్పుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. సామాన్యుల ఇంటి బడ్జెట్ నానాటికీ పెరిగిపోతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్
7


