మత్స్యకారులపై పచ్చ ప్రతాపం
చినగంజాం: జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఒక్క చినగంజాం మండలంలోనే తీరప్రాంతం ఉంది. పల్లెపాలెం పంచాయతీలో 303 కుటుంబాలు, పెదగంజాం పంచాయతీలోని గ్రామాలలో 900 కుటుంబాలు ఉన్నాయి. వీరికి వేట ప్రధాన వృత్తిగా ఉంది. వీరికి మోటారు, నాన్ మోటారు బోట్లు మొత్తం 205 వరకు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి రూ.10 వేలు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది నయాపైసా ఇవ్వలేదు. పూట గడవక వారు ఇబ్బందులు పడుతున్నారు.
కక్ష సాధింపు పనులు చినగంజాం మండలం పల్లెపాలెం గ్రామ పంచాయతీ బాపయ్య నగర్ గ్రామానికి చెందిన వాటుపల్లి రమేష్ మత్స్యకారుడు చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో తెప్ప కొనుగోలు చేయగా... మత్స్యశాఖ ద్వారా అతనికి తెప్ప రిజిస్ట్రేషన్ చేసి 2021 మార్చి 3వ తేదీన లైసెన్స్ సైతం జారీ చేశారు. అప్పటి నుంచి తెప్ప మీద వేట సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరువాత 2023 డిసెంబరు 18వ తేదీన తెప్ప లెసెన్స్ రెన్యువల్ చేశారు. ఆ లైసెన్స్ గడువు 2026 జూన్ 30 వరకు ఉంది. ఇటీవల రమేష్ గ్రామ సచివాలయంలోని ఫిషరీస్ అసిస్టెంట్ కాలేషా వద్దకు లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు రూ.700 నగదు చెల్లించేందుకు వెళ్లాడు. ఐలా పాలచంద్రరావు పేరుతో లైసెన్స్ ఉందని నగదును తిరిగి ఇచ్చేశాడు. టీడీపీ నాయకులు రూ. 2 వేలు అడిగితే ఇవ్వలేదని ఫిషరీస్ అసిస్టెంట్‌తో కుమ్మక్కయ్యారని రమేష్ ఆరోపించారు. డబ్బు తీసుకుని పాల చంద్రరావు పేరిట లెసెన్స్ మార్చారని చెప్పారు. ఇద్దరు టీడీపీ నాయకుల ఒత్తిడి తెస్తున్నారని... వచ్చే సంవత్సరం వేట నిషేధ భృతి రాదని అప్పటికే ఉన్న ఫిషరీష్ అసిస్టెంట్ చెప్పాడు. ఓ టీడీపీ ప్రజాప్రతినిధి, ఇద్దరు టీడీపీ నాయకులు, మరో టీడీపీ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కళాసీగా పేరు నమోదు చేసుకోమని, పొరపాటు జరిగి ఉంటే సరి చేస్తామని బి. ఫిషరీస్ ఏడీఏ కృష్ణకిషోర్ తెలిపారు.
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
మత్స్యకారులపై పచ్చ ప్రతాపం
● పేద మత్స్యకారుల పొట్టకొట్టిన
తెలుగు తమ్ముళ్లు
● అడిగినంత ఇవ్వలేదని
తెప్ప లైసెన్స్ రద్దు
● మత్స్యశాఖ అధికారుల
అండతో అరాచకాలు
● వేట సంధికాల జీవన భృతి
కోల్పోయిన పేద జాలర్లు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 524.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
సీఎం చంద్రబాబు తరహాలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు. సుపరిపాలన అని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం... దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, బెదిరింపులకు దిగుతోంది. సంపద సృష్టిస్తామని చెబుతూ లంచాలు, అక్రమాల రూపంలో ప్రజాధనాన్ని పంచుకుంటున్నారు. లంచం ఇవ్వలేదని అధికారుల సాయంతో పచ్చనాయకులు మత్స్యకారుల తెప్ప లైసెన్స్‌లు లాగేసుకుంటున్నారు. వేట సంధి కాలంలో ప్రభుత్వం ఇచ్చే భృతి రాకుండా చేసి పేద మత్స్యకారుల పొట్టగొడుతున్నారు.