పాస్‌పోర్ట్‌ అప్పగించిన మాజీ మంత్రి రజిని | - | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ అప్పగించిన మాజీ మంత్రి రజిని

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాలు నరసరావుపేట డీఎస్పీకి పాస్‌పోర్ట్‌ అందజేత

నరసరావుపేట టౌన్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్‌పోర్ట్‌ను ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో అందజేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి విడదల రజినిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు కేసును కొట్టివేయాలని ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టటంతోపాటు పాస్‌పోర్ట్‌ను విచారణ అధికారి అయిన డీఎస్పీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో విడదల రజిని మొదట చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావుకు పాస్‌పోర్టును అందజేశారు. ఆమె వెంట మైనార్టీ నాయకుడు దరియావలి, న్యాయవాది నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement