నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు మెడికల్‌ కాలేజీ ఉద్యోగాల ఎంపిక తుది జాబితా విడుదల ఏఎన్‌యూ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష ఫలితాలు విడుదల రేపు జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన శ్రీ సుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ ఫూల్‌లో జిల్లాస్థాయి పురుషులు, మహిళల స్విమ్మింగ్‌ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 24వ తేదీన కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరగనున్న 12వ సీనియర్‌ అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. క్రీడాకారులు 2013 లేదా అంతకు ముందు జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లు 14వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8296374963 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

మంగళగిరి టౌన్‌: నేషనల్‌ సబ్‌ జూనియర్‌ అండ్‌ జూనియర్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పవర్‌ లిఫ్టర్లు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని అసోసియేషన్‌ కార్యాలయంలో బుధవారం క్రీడాకారుల వివరాలు వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా, అమలాపురంలో పోటీలు జరుగుతాయని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లిఖిత, విజయశ్రీ, కౌశిక్‌లు పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆశించారు.

గుంటూరు మెడికల్‌: పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి సంబంధించి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్న 211 ఉద్యోగాల ఎంపిక తుది జాబితాను విడుదల చేసినట్లు గుంటూరు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుది జాబితాను గుంటూరు మెడికల్‌ కాలేజీ వెబ్‌సైట్‌తోపాటు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ వెబ్‌సైట్‌లో కూడా పరిశీలించవచ్చని తెలిపారరు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల నియామక ప్రకటనను మార్చి 26న విడుదల చేయగా, మొత్తం 4,791 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మొదట ప్రాథమిక మెరిట్‌ జాబితాను విడుదల చేసి, అనంతరం అభ్యంతరాలు (గ్రీవెన్సెస్‌) స్వీకరించేందుకు తగిన సమయం కల్పించినట్లు చెప్పారు.అందిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, ధ్రువీకరణ అనంతరం తుది మెరిట్‌ జాబితా, తుది ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు గుంటూరు మెడికల్‌ కాలేజీ సిబ్బంది ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, తుది ఎంపిక జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష ఫలితాలను అదనపు పరీక్షల నిర్వహణ అధికారి ఎ వెంకటేశ్వర్లు బుధవారం విడుదల చేశారు. ఏఎన్‌యూ పరిధిలో 2026 మార్చి, ఏప్రిల్‌లో జరిగిన బీఏ, బీఎస్సీ, బీకాం జనరల్‌, కంప్యూటర్స్‌, బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం, బీఎఓఎల్‌ ఆరవ సెమిస్టర్‌ పరీక్షలకు 8790 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 8741 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి వివరాలు వర్స్డ్ఠిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement