21 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

21 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

21 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేట: జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నామని డీఆర్‌ఓ నారదముని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలపై సమన్వయ సమావేశం గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌ఓ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ జిల్లాలో మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 17,572 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇంటర్మీడియెట్‌ తొలి ఏడాది 10,789, ద్వితీయ సంవత్సరం 6,783 మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 32 కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. సమావేశంలో డీఈసీ సభ్యులు కె.వేణు, కేటీటీవీ రమణ, డీఈఓ, ఏపీఎస్‌ ఆర్‌టీసీ, ఏపీసీపీడీసీఎల్‌, డీఎంహెచ్‌ఓ, ఎల్‌డీఎం, పోలీసు, తపాలా, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 17న చదరంగం పోటీలు టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఏపీ పోలీసుల ప్రతిభ సాగర్‌ నీటిమట్టం

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్‌ అండ్‌ ఉమెన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెలక్షన్‌ పోటీలు స్థానిక శ్యామలానగర్‌లోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్‌ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్‌ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ిసీహెచ్‌ రవీంద్ర రాజు, బాలకుటీర్‌ సీఏఓ దుర్గా రఘురామ్‌, ప్రిన్సిపల్‌ సుధామాధవి, విజయ్‌కుమార్‌ తదితరులు ఆవిష్కరించారు.

మంగళగిరి టౌన్‌: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన అఖిల భారత టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్‌ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్‌ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్‌ డబుల్‌ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఏపీ ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement