అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

గుంటూరు మెడికల్‌: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్‌క్యూఏఎస్‌) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్‌ ఆరోగ్యమందిర్‌కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement