అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

మంగళగిరి టౌన్‌: పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ అండ్‌ ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్‌ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్‌ జూనియర్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని బ్రాంజ్‌ మెడల్‌ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీ ల్లో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

పతకాలు సాధించిన క్రీడాకారులు

Advertisement
 
Advertisement
Advertisement