పైకి ఆహారం.. తింటే విషమే చీరాల టౌన్: మనం తినేది ఆహారమా..లేక అనారోగ్యాలను తెచ్చే రంగు రంగుల విషమా...? అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా రెస్టారెంట్లలో విచ్చలవిడిగా రంగులు, టేస్టింగ్ సాల్ట్, వెనిగర్‌లతో పాటుగా నెలల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసం, మసాలాలు, రొయ్యలు అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో రోడ్డు పక్కన అమ్మే చాలా చికెన్ పకోడి సెంటర్ల నుంచి రెస్టారెంట్లు వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లు, అరటి పండ్లను త్వరగా మగ్గించేందుకు కార్బైడ్‌ను కూడా వినియోగిస్తున్నారు. పండ్లను సైతం విషతుల్యం చేస్తున్నారు. ఈ దందా విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రంగానే దాడులు చేస్తున్నారు. రెస్టారెంట్‌లో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, రొయ్యలు, ఉల్లిపాయ పేస్ట్‌లతోపాటుగా కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం, టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా ఎక్కడ చూసినా కల్తీ కనిపిస్తోంది. మనం తినే ఆహారం విషతుల్యం అవుతోంది. చూడడానికి ఆకర్షణీయంగా రంగురంగుల్లో ఉన్నా అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటి వలన జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా వ్యాపారులలో మాత్రం మార్పు రావడం లేదు. చీరాల నియోజకవర్గంలో పెద్ద భవనాలు, షాపులు నిర్వహిస్తున్న వెజ్, నాన్‌వెజ్ రెస్టారెంట్లున్నాయి. పలావు పాయింట్లు, చికెన్ పకోడి, బిర్యానీ పాయింట్లు, బండ్లపై అమ్మే నాన్‌వెజ్ ఫ్రైలు, నాన్‌వెజ్ కూరలు అమ్మే దుకాణాలు రెండొందల వరకు ఉన్నాయి. గ్రామాల్లో కూడా నాన్‌వెజ్ బిర్యానీ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి.
విష రసాయన రంగుల వినియోగం
జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన రెస్టారెంట్లు ప్రజలను ఆకర్షించేలా చేస్తున్నా అందులో అందించే ఆహారం మాత్రం నాణ్యంగా ఉండడం లేదు. చీరాల్లో గతంలో నిర్వహించిన దాడుల్లో పలు రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లను పరిశీలించారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మసాలా దినుసులు, ఉల్లిపాయల పేస్ట్, పుదీనా చట్నీలతోపాటు రంగు కోసం రసాయనాలు వినియోగిస్తూ ప్రజలను రోగాల బారిన చేసే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లు చూసి విస్తుపోయారు. అలానే కిచెన్‌లో అపరిశుభ్రంగా ఉండడం, వాడిన నూనెనే తిరిగి వాడడం వంటివి గుర్తించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. కొన్ని మాంసాహారాలను, మసాలా, నూనెలను ల్యాబ్‌లకు పంపించి రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పలు హోటళ్లలో అపరిశుభ్రత, పప్పు దినుసులు కొన్ని కల్తీవి ఉన్నట్లుగా గుర్తించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. విచ్చలవిడిగా వ్యాపారం...
న్యూస్‌రీల్
తనిఖీలు చేస్తున్నాం
జిల్లాలోని రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లలో తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఆహారంలో ఫుడ్ కలర్ ఎక్కువగా వాడటం వలన అనారోగ్యాలకు గురవుతారు. కార్బైడ్ వేసి పండించిన పండ్లు తిన్నా అనారోగ్యం తప్పదు. వ్యాపారస్తులు నిబంధనలు పాటించి తాజా మాంసం, ఆహార పదార్థాలు, నూనెలు వాడాలి. ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసాహారం, మసాలాలు, పదేపదే వాడిన నూనెతో పదార్థాలు తయారు చేయడం శిక్షార్హం. ఆహారం విషతుల్యం కాకుండా ఉండేందుకు తనిఖీలు చేపడుతున్నాం. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిస్తున్నాం. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం.
సాగర్ నీటిమట్టం
ఆహార విక్రయానికి సంబంధించిన వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఆహారపరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. లైసెన్స్ కోసం ప్రభుత్వానికి నిర్ణీత రుసుం చెల్లిస్తే అధికారులు పరిశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. చాలా వరకు లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లు అధికంగా వస్తున్న సీజన్. పండ్లు మగ్గించేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అరటి పండ్లు కూడా త్వరగా పండేందుకు కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ చీరాల్లో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించారు.
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
పైకి ఆహారం.. తింటే విషమే
– ప్రణీత్, ఆహార భద్రతాధికారి
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.10 అడుగులకు చేరింది. ఇది 156.8580 టీఎంసీలకు సమానం.
ఆహారంలో విచ్చలవిడిగా
రంగుల వాడకం
తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం
పండ్లను మగ్గించేందుకు
కార్బైడ్ వాడకం
తనిఖీల్లో బయటపడుతున్న వాస్తవాలు