వేధింపులకు ఉద్యోగి బలి | - | Sakshi
Sakshi News home page

వేధింపులకు ఉద్యోగి బలి

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

వేధింపులకు ఉద్యోగి బలి

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మర్రిపాలెంలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు తిరిగి అన్నవరం సొసైటీకి సీఈవోగా వచ్చాడు. అప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభించాడు. జీతాలు ఇవ్వకుండా బెదిరించడంతో తట్టుకోలేక ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రొంపిచర్ల పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాసరావుతోపాటు సొసైటీ పీఐసీ నర్రా సురేంద్రబాబుపై కేసు నమోదు అయింది. సొసైటీ ఉద్యోగిని పచ్చవ భవానికి 18 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీనిపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణలో అవినీతి వెలుగు చూసింది.

Advertisement
 
Advertisement
Advertisement