కాలువలోకి దూసుకెళ్లిన ఆటో | - | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన ఆటో

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

కాలువలోకి దూసుకెళ్లిన ఆటో ఆటోను ఢీకొన్న కారు నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ ఔత్సాహిక నటీనటులకు శిక్షణ ఒక వరం

ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్‌ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు.

ముగ్గురికి తీవ్రగాయాలు

కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్‌ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్‌ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

నరసరావుపేట టౌన్‌: ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు.

తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస నాయక్‌ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్‌ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా అధ్యక్షత వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement