breaking news
Narayanpet District Latest News
-
సరిహద్దులో తోడేళ్లు..!
పేట్రేగుతున్న ఇసుకాసురులు –8లో uతెలంగాణ టు కర్ణాటక.. రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ● తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో కృష్ణానది పరివాహకంలో దర్జాగా రోడ్లు వేసి నదీ గర్భాన్ని తోడుతున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి.. కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ● ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుకను వరంగా మార్చుకున్న ఆ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలు కొందరు తెలంగాణ బార్డర్ దాటిస్తూ దోపిడీకి తెగబడ్డారు. సరిహద్దులు దాటి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాత్రివేళల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. ..రోజు, నెల వారీ మామూళ్లతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కట్టిపడేసి, తెలంగాణ సరిహద్దు కేంద్రంగా దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యనేతల అండదండలతో ‘హద్దు’లు దాటిన ఇసుకాసురుల బాగోతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు. అక్కడ రూ.10 వేలు.. ఇక్కడ రూ.లక్షఏపీ టు తెలంగాణ.. ఏపీలోని తాడిపత్రి, కర్నూలు నుంచి తెలంగాణకు ఉచిత ఇసుక.. నారాయణపేట జిల్లా కృష్ణానదిలో దర్జాగా రోడ్లు వేసి దందా భారీ యంత్రాలతో తోడి కర్ణాటకలో పలు చోట్లకు తరలింపు బార్డర్లో మాఫియాకు ముఖ్య నేతల అండదండలు కృష్ణా మండలంలో నిర్వాహకుల బరితెగింపు ప్రశ్నించిన వారికి బెదిరింపులు, పలువురిపై దాడులు ఏీపలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. -
ఎలాంటి అనుమతులు లేవు..
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేసే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. అక్రమ ఇసుక రవాణను అడ్డుకునే వారిపై దాడులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. కర్ణాటకకు చెందిన రౌడీషీటర్ అక్రమ ఇసుక రవాణలో పాత్ర ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ పరివాహక ప్రాంతంలో ఇసుకను రవాణా చేసేందుకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. – డా. వినీత్, ఎస్పీ, నారాయణపేట జిల్లా -
నర్వ పెద్ద చెరువుకు ముప్పు..
నర్వ పెద్ద చెరువు బఫర్ జోన్లో అక్రమంగా చేపల చెరువు నిర్మాణం జరుగుతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే సర్వేనంబర్లు 107, 108లో సుమారు 30 ఎకరాల్లో భారీఎత్తున మట్టి పనులు చేపట్టి 70 శాతం నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణాలతో 300 ఎకరాల ఆయకట్టు, తాగునీటి వనరులు, పశువుల నీటి అవసరాలు, ఉందేకోడ్లోని సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతినే ప్రమాదం ఉంది. చేపల చెరువు నుంచి వెలువడే కలుషిత నీరు యాంకీ చెరువులోకి చేరి నీటి నాణ్యత దెబ్బతింటుంది. సమగ్ర విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు విన్నవించాం. – నర్వ, ఉందెకోడ్, యాంకి గ్రామాల ప్రజలు -
ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి
నారాయణపేట: అర్జీదారులు ఎన్నో ఆశలతో ప్రభు త్వ కార్యాలయాలకు వస్తారని, వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధితశాఖ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావా ణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది అర్జీదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కష్టాల్లో కౌలు రైతు!
● అందని ప్రభుత్వ ఫలాలు ● పెట్టుబడి సాయానికి వడ్డీ వ్యాపారులే దిక్కు ● ఆర్థిక ఇబ్బందులతో సతమతం మరికల్: సాగు భూములు లేని పలువురు ఇతరు ల భూములను కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కు అందించే పలు సంక్షేమ పథకాలు వారికి వర్తించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట పె ట్టుబడి సాయానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయి స్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల ను ఆదుకుంటామని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా నేటికీ అమలు కావడం లేదు. గుర్తింపు కరువు.. కౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పెట్టుబడి సాయం భూ యజమానుల ఖాతాల్లో నేరుగా జమవుతోంది. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పు ల పాలవుతున్నారు. యాసంగిలో ప్రభుత్వం ఆ న్‌లైన్ విధానంలో రైతులకు ఎరువులను సరఫరా చేస్తుండటంతో కౌలు రైతులకు అందక పంట దిగుబడి కూడా తగ్గిందనే చెప్పవచ్చు. పండిన కొద్దిపాటి పంటను విక్రయించేందుకు భూ యా జమాన్య హక్కులు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టాల పాలయ్యారు. కొందరు భూ యజమానులు, ఇతరులను ప్రాధేయపడి పంట ఉత్పత్తులను అమ్ముకున్నారు. భూ యజమానుల ఖాతాల్లో జమైన నగదును సకా లంలో కౌలు రైతులకు బదిలీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలున్నాయి. పది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చే స్తా. ప్రభుత్వం మా లాంటి కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు లు అందజేయాలి. నే రుగా మాకే పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలివ్వాలి. పంట ఉ త్పత్తులను విక్రయించేందుకు అవకాశం క ల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చి న హామీ మేరకు కౌలు రైతులను ఆదుకోవాలి. – మాసప్ప, కౌలు రైతు, మరికల్ రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశా. ప్రైవేట్‌లో రూ.3 వడ్డీకి రూ.30 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టా. ప్రభు త్వం కౌలు రైతులకు గు ర్తింపు కార్డులిచ్చి పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేస్తే కాస్త ఉప యోగంగా ఉంటుంది. కౌలు రైతుల కష్టాలు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెట్టుబడి మీదపడి నష్టాలను చవిచూస్తున్నాం. – బాలప్ప, కౌలు రైతు, కన్మనూర్ పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందాలంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. అప్పుడే గ్రామాల వారీగా కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందించి పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – సక్రియనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త : డీఎంహెచ్ఓ
నారాయణపేట: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలు, విరేచనాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకరోజు ‘డ్రై డే‘ పాటించి ఇంటి లోపల, బయట నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటిట్యాంకులు, డ్రమ్ములు, బకెట్లు, ఇతర నీటి నిల్వ పాత్రలపై తప్పనిసరిగా మూతపెట్టి ఉంచాలని, దోమ తెరలు, దోమ నివారణ సాధనాలను వినియోగించడంతో దోమ కాటుకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. తాగునీటిని మరిగించి లేదా శుద్ధిచేసి మాత్రమే వినియోగించాలని.. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, వారి సలహా లేకుండా మందులు వాడరాదన్నారు. సీజనల్ వ్యాధులపై సమాచారం, సలహాలు, సాయం కోసం జిల్లా ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 76800 50297ను సంప్రదించాలని సూచించారు. వైద్య కళాశాలలో సీట్లు పెంచాలి : బీఆర్ఎస్ నారాయణపేట: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఉన్న 50 ఎంబీబీఎస్ సీట్లను 150కు పెంచాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. నారాయణపేట కళాశాలను మాత్రం 50 సీట్లకే పరిమితం చేయడం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఆశతో ఉన్నప్పటికీ, పరిమిత సీట్ల కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన నారాయణపేట జిల్లాలో విద్యా సౌకర్యాలను మరింత మెరుగుపర్చడం ప్రభుత్వ బాధ్యతన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించి సీట్ల సంఖ్య పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్, జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వైభవంగా జగన్నాథుడి రథయాత్ర నారాయణపేట: జిల్లాకేంద్రంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. సరాఫ్బజార్లోని బసవేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర మెయిన్న్రోడ్, పాత బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా మీదుగా ఎస్ఆర్ గార్డెన్స్ వరకు సాగింది. వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ భక్తిగీతాలు ఆలపించారు. కోలాట ప్రదర్శనలు, భజన బృందాల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్గమధ్యంలో భక్తులు పూల చల్లుతూ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 56 రకాల మహా నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. పీయూలో పీజీ పరీక్షలు ప్రారంభం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వీసీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పరీక్షకేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపల్ మధుసూదన్‌రెడ్డి, కృష్ణయ్య, గౌస్ తదితరులు ఉన్నారు. -
బెదిరింపులు.. దాడులు
అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
నారాయణపేట: సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.బాలనర్సింహులు సతీమణి భారతమ్మకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్‌న్స్ కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును సోమవారం తన కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తారని.. అలాంటి సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం, పోలీసుశాఖ అత్యంత బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో లేదా ఇతర పరిస్థితుల్లో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అందించే బీమా, సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చెక్కు తీసుకున్న భారతమ్మ ప్రభుత్వం, పోలీసుశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ విజయభాస్కర్, డీపీఓ సూపరింటెండెంట్ శ్యాంసుందర్రాజుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పాత పింఛన్ అమలు చేయాలి
నారాయణపేట: దశాబ్దాల పాటు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి వృద్ధాప్యంలో కనీస జీవన భద్రత కూడా లేకపోవడం దురదృష్టకరమని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్‌తో సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన జన జాగరణ యాత్ర ఆదివారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీగార్డెన్స్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా వీర సావర్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. భారీ బైక్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని ‘సీపీఎస్ వద్దు–ఓపీఎస్ ముద్దు‘, ‘పాత పెన్షన్ మా హక్కు‘ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వీరసావర్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నారాయణపేట జిల్లాలో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు వసంతరావుకు నెలకు రూ.3 వేలలోపే పింఛన్ రావడం సీపీఎస్ విధానం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ మాదిరిగా తెలంగాణలోనూ పాత పింఛన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని డీసీసీ మాజీ అధ్యక్షుడు కంభం శివకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆగస్టు 23న నిర్వహించే ’చలో హైదరాబాద్’ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహదేవ్, జిల్లా ప్రధానకార్యదర్శి రాఘవేంద్రాచారి, జిల్లా కోశాధికారి సత్యపాల్, రాష్ట్ర నాయకులు, టి–జాక్ చైర్మన్ నర్సింహారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, తపస్ నాయకులు శేర్ కృష్ణారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. -
సైక్లింగ్ పోటీలకు ఎంపిక
మక్తల్: రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు మక్తల్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం పట్టణంలోని ఎల్లమ్మకుంటలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి గోపాలం ప్రారంభించారు. పోటీల్లో 76 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మక్తల్‌కు చెందిన అర్జున్‌కుమార్, అక్షయ్‌కుమార్, వెంకటేష్, రమేష్, గోపీచంద్, లోకేష్, శ్రీనాథ్, జనార్ధన్, వేణుగోపాల్, విఘ్నేష్, మనోహర్, అభిలాష్, ఆకాష్, మహేష్, అశోక్, పురుషోత్తం, వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ నెల 20న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఆయా క్రీడాకారులు పాల్గొంటారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు రేణుక, మీనాకుమారి, అంబ్రేష్, చంద్రకళ, శివకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, దామోదర్, స్వప్న, బోయ లలిత, అవంతి, యాదగిరి, బుడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి..
పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
నిర్మాణం.. వివాదాస్పదం!
మార్కెట్‌యార్డులో సా..గుతున్న షెడ్ నిర్మాణం –8లో uపనులు నత్తనడకన సాగుతుండటంపై రైతులు, కమిషనన్ ఏజెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి సుమారు రెండు నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో సాగడం లేదని చెబుతున్నారు. వచ్చే సీజనన్ వరకు పనులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్ కోసం పిల్లర్లు నిర్మించడంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ఎదుటే పిల్లర్లు ఉండటంతో రైతులు ధాన్యం తీసుకొచ్చిన వాహనాలు నిలపడం, ఉత్పత్తులు దించుకోవడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. నిర్మాణంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి రాకూడదని వారు కోరుతున్నారు. నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న కవర్ షెడ్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మరోవైపు నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం 9 నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి చూ స్తే గడువులోగా కష్టమేనన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టాల్సి ఉండగా.. మార్కెట్ కమిటీ చైర్మనే సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం, డిజైనన్పై వివాదం కొనసాగుతుండగా.. పనుల నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎత్తు తగ్గించారా..? షెడ్ ఎత్తు తగ్గించేందుకు నష్టపరిహారం పేరిట కమిషన్ ఏజెంట్ల నుంచి డబ్బులు వసూలు చేశారన్న వ్యవహారం మార్కెట్‌యార్డులో తీవ్ర చర్చకు దారితీసింది. షెడ్ నిర్మాణంతో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు దుకాణదారులు జూన్ 6న మార్కెట్ కమిటీ చైర్మనన్ ఆర్.శివారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సరి చేసేందుకు అయ్యే ఖర్చును దుకాణ యజమానులే భరించాల్సి ఉంటుందని.. ఒక్కొక్కరు రూ.5 వేలు ఇవ్వాలని కోరగా, చివరకు సుమారు 10 మంది దుకాణదారులు ఒక్కొక్కరు రూ.3 వేల చొప్పున ఇచ్చిన తర్వాతే ఎత్తు తగ్గించారనే చర్చ బహిరంగంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ కరువు.. రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ అధికారుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం పనులు చూసి వెళ్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారంపై చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దుకాణాల ఎదుటే పిల్లర్ల నిర్మాణం, ఎత్తులో మార్పులు, పనుల జాప్యం, డిజైన్‌పై అభ్యంతరాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనంతో చేపట్టిన పనుల్లో నాణ్యత, పారదర్శకత, వేగం అన్నింటినీ అధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యతను మరిచారన్నది కానవస్తుంది. రూ.2.40 కోట్లతో పనులు వ్యాపారానికి అడ్డంకిగా మారిందంటున్న ఏజెంట్లు సబ్ కాంట్రాక్టర్‌గా మారిన మార్కెట్ చైర్మన్? తూతూమంత్రంగా అధికారుల పర్యవేక్షణ -
రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా అథ్లెట్లు
నారాయణపేట ఎడ్యుకేషన్: మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం జరిగిన 4వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ ఆదివారం తెలిపారు. మహిళా విభాగంలో ఐదువేల మీటర్ల పరుగుపందెంలో నిర్మల, అండర్–16 మహిళా విభాగం రెండు వేల మీటర్ల పరుగు పందెంలో పూజ రజత పతకం సాధించారన్నారు. అదేవిధంగా పురుషుల ఐదువేల మీటర్ల పరుగు పందెంలో వంశరాజ్ కిరణ్‌కుమార్, ట్రాయథ్లాన్ సి–గ్రూప్‌లో వేణుకుమార్ కాంస్య పతకం సాధించినట్లు చెప్పారు. పతకాలను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి క్రీడాకారులకు అందజేసినట్లు వివరించారు. -
డూప్లికేటుగాళ్ల ఆగడాలు..!
వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు. జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్, గద్వాలకు చెందిన వంశీధర్‌రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్ హైదరాబాద్ ఆటోనగర్ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్ 60 బస్తాలు, ప్రవీణ్‌కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్‌గౌడ్ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్‌రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌లో లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే ధ్యేయంగా.. స్థానికులను మచ్చిక చేసుకొని ఇద్దరు డీలర్ల రహస్య దందా నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి.. -
తాగునీటి సరఫరాలో అంతరాయం వద్దు
నారాయణపేట ఎడ్యుకేషన్: పుర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా అందించేందుకు అధికారు లు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పుర చైర్పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ కోరారు. ఆదివారం ఉదయం మండలంలోని సింగారం సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి పంపుహౌస్‌ను ఆమె పరిశీలించారు. పంపుహౌస్ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసు ్తతం పట్టణానికి 606 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుందని.. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురపాలిక తరుఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంపుహౌస్‌ను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలని, సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. టూడేలీగ్‌లో విజేతగా నిలవాలి మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్‌సీఏ టూడేలీగ్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూడేలీగ్‌లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శన చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా, ఏకాగ్రతతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రానున్న రోజుల్లో రంజీ, భారతజట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జట్టు తన తొలి మ్యాచ్‌లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది. ఉమ్మడి జిల్లా జట్టు ఇదే.. ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్‌నగర్), సంజయ్ (నాగర్‌కర్నూల్), అభిలాష్‌గౌడ్ (నారాయణపేట), వర్షిత్‌రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), జి.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), ముఖిత్ (మహబూబ్‌నగర్), గగన్ (నాగర్‌కర్నూల్), వెంకట్‌సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్‌నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్‌కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు. -
ప్రాజెక్టుల పూర్తికి సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం ● విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో ని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్‌కుమార్, రమేష్‌రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడి
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్ ● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు మహబూబ్‌నగర్ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్‌గౌడ్, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ సమకూర్చారు. అనంతరం వికారాబాద్‌కు చెందిన కృష్ణయ్యగౌడ్తో కలిసి జయప్రకాష్‌గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈగల్ పోలీస్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్‌ను సీజ్ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్గౌడ్తోపాటు కృష్ణయ్యగౌడ్, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించింది. బీటెక్ చదివి.. తుంకినీపూర్కు చెందిన జయప్రకాష్‌గౌడ్ బీటెక్ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 13న ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్‌గౌడ్ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. మూడురోజులుగా తనిఖీలు.. హైదరాబాద్‌కు చెందిన ఈగల్ ఫోర్స్ బృందాలు మూడు రోజుల నుంచి అన్నాసాగర్ శివారులో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చివరికి ఆదివారం ఆరు కారులలో దాదాపు 20 మంది ఈగల్ ఫోర్స్ పోలీసులు స్థావరంపై ఆకస్మిక దాడులు చేసింది. ఆల్ఫాజోలం తయారీలో మంచి పట్టుసాధించిన జయప్రకాష్‌గౌడ్ రెండేళ్ల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలకు సుపరిచితుడిగా మారాడు. అతను తయారు చేసిన ఆల్ఫాజోలం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు కల్లు దుకాణాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. వీటిని సరఫరా చేయడానికి స్థానికంగా మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకొని కల్లు దుకాణాలకు వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. -
ఏళ్లుగా వెట్టిచాకిరే..
26 ఏళ్లుగా మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్నా. నేటికీ కనీస వేతనానికి ఆమడ దూరంలో ఉన్నాం. ఇచ్చే వేతనం కూడా రెండు, మూడునెలలకు ఓసారి చెల్లిస్తుండటంతో పాటు రెండేళ్లుగా పీఎఫ్ చెల్లించడం లేదు. దీంతో దుర్భర జీవితాలు గడుపుతున్నాం. ఇటీవల సవరించిన జీఓ నంబర్ 6 ప్రకారం వేతనాలు అందించి న్యాయం చేయాలి. – కె.రాజప్ప, మిషన్ భగీరథ కార్మికుడు, పారేవుల హెడ్‌వర్క్స్ రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారు జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో సుమారు 800 మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వేతనాలు పెంచాలని పలుమార్లు ఉద్యమాలు చేసినా కేవలం రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారు. జీఓనంబర్ 6 ప్రకారం స్కిల్డ్ వేతనాన్ని కార్మికులకు అందించాలి. దీంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా వర్తింపజేయాలి – అరుణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి, ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం ● -
భూ నష్టపరిహారం పెంచి ఇవ్వాలి
కోస్గి రూరల్: జాతీయ రహదారిని అనుసరించి ఉన్న నాచారం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.60 లక్షలు, తోగాపూర్ నిర్వాసితులకు రూ.40 లక్షలు ఇవ్వాలని బాధితులు ఆర్డీఓ రమేష్‌కు విన్నవించారు. శనివారం కోస్గిలోని మండల పరిషత్ కార్యాలయంలో నారాయణపేట రేడియల్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో ఐదోసారి గ్రామసభ నిర్వహించారు. నాచారంలో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, తోగాపూర్‌లో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించిందని ఆ మేరకే చెల్లిస్తుందని తెలిపారు. ఈ నెల 21న నారాయణపేట కలెక్టరేట్లో సమావేశం ఉంటుందని.. బాధితులు పాల్గొని తమ అభిప్రాయాలను కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు. గ్రామసభలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ సుభాష్, సీనియర్ అసిస్టెంట్ భీమమ్మ, సర్పంచ్‌లు రేణుక, శ్రీనివాస్, జీపీఓలు సత్యనారాయణ, అంజప్ప తదితరులు పాల్గొన్నారు. -
జీవితం.. దుర్భరం
కనీస వేతనాలకు నోచుకోని కార్మికులు ● జూన్ 1 నుంచి అమలుపై ఆశ.. జూలైలోనూ రాక నిరాశ ● మూడు జోన్ల ప్రకటనతో అయోమయం ● ఏళ్లుగా మారని బతుకులు –8లో uనర్వ: కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా.. నేటికీ సరిగా అమలుకావడం లేదు. మిషన్ భగీరథ, గ్రామపంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వీబీకే, స్కీం వర్కర్స్ ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తూ అభద్రతతో జీవితం గడుపుతున్నారు. కనీస వేతన చట్టం ప్రస్తుత కాలానికి అనుగుణంగా సవరించకపోవడంతో చాలా నష్టపోతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ సమూలంగా తీసేస్తామన్న పాలకులు ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ ఊసే ఎత్తకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లోని కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇదిలా ఉండగా రెండునెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం వేజ్కోడ్–2019కి అనుగుణంగా కొత్త కనీస వేతన చట్టాన్ని రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నాటికి సవరించిన వేతనాలు జులై వేతనంతో అందుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. నేటికీ ఏ ఒక్క రంగానికి పూర్తిస్థాయిలో వేతనాలు పెరగలేదు. తాజాగా సవరించిన వేతనాలు.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వందల సంఖ్యలో ఉన్న పరిశ్రమలు వారి షెడ్యూళ్లను రద్దుచేసి నైపుణ్య స్థాయి, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఏకీకృత వేతన వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు వేతన చెల్లింపులో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లింపులను పూర్తిగా రద్దుచేసింది. ఇకపై కార్మికులకు నెలవారీ వేతనాలు బ్యాంకుల ద్వారా ఎలక్ట్రానిక్ బదిలీ లేదా చెక్కురూపంలో మాత్రమే అందిస్తారు. కొత్త విధానంలో నెలవారీ వేతనాల లెక్కింపును 26 రోజుల పనిదినాల ఆధారంగా నిర్ణయించారు. వారాంతపు సెలవుల కారణంగా కార్మికులకు వేతన నష్టం జరగకుండగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేయాలని.. అదనపు పనికి వేతనం రెట్టింపు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మూడు జోన్లుగా.. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించింది. మున్సిపల్ కార్పొరేషన్లు జోన్–1, మున్సిపాలిటీలు జోన్–2, ఇతర ప్రాంతాలు జోన్–3గా విభజించారు. -
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని అందుకు బ్యాంకర్లు సహకరించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన బ్యాంక్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వర్లుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇచ్చి లక్ష్యానికి చేరువ చేయాలన్నారు. గతంలో ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి రూ.5 లక్షల వరకు రుణం ఇచ్చేవారని ప్రస్తుతం రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నారని చెప్పారు. ఇందులో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం వస్తుందన్నారు. మహిళలను పెద్ద పెద్ద వ్యాపారులుగా చేయడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింహులు, ఏపీడీ రేణుక, డీపీఎం లక్ష్మయ్య, డీజీఎం రామచంద్రరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ దామోదర్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
జీవ వైవిధ్యంపై అవగాహన ఉండాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, విద్యార్థులు జీవ వైవిధ్యంపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా శనివారం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్ధులకు సాంఘికశాస్త్ర ఫోరం ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జీవవైవిధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సదాశివయ్య హాజరై ఉపాధ్యాయులు, విద్యార్ధులకు వేర్వేరుగా జీవ వైవిధ్యంలో పాముల పాత్ర సవివరంగా తెలియజేశారు. అదేవిధంగా వాటి ప్రాముఖ్యత.. ఏవి విషపూరితం, ఏవి విషరహితమైనవి, వాటి ప్రవర్తన, కాటు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. -
16 అధ్యాపక పోస్టులు మంజూరు
మద్దూర్ (కోస్గి): కమిషనర్ ఆ్‌ఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు 16 పోస్టులు మంజూరయ్యాయని.. 2026–27 విద్యా సంవత్సరానికిగాను అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ ఇంజినీరింగ్–4, కంప్యూటర్ ఇంజినీరింగ్–3, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్–3, గణితం–2, భౌతికశాస్త్రం–2, రసాయన శాస్త్రం–2 ఖాళీలున్నాయని.. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలున్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత పత్రాలతో ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23న ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు విద్యుత్ అంతరాయం నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ ఏఈ మహేష్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని యాద్గిర్ రోడ్, చిల్డ్రన్స్ ఆస్పత్రి, సివిల్–1, సివిల్–2, సత్యసాయి, వీఐపీ ఫీడర్ల ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని.. గృహ, వాణిజ్య వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్ఆర్జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్‌గౌడ్, నాగర్‌కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ–కేవైసీ తప్పనిసరి నారాయణపేట: జిల్లాలోని రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.బాలరాజు శనివారం ఒక ప్రకటనలో కోరారు. రేషన్‌కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు సమీపంలోని చౌకధర దుకాణానికి వెళ్లి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని సభ్యులకు భవిష్యత్‌లో రేషన్ పంపిణీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా ఇతర కారణాలతో వెళ్లలేని వారి వివరాలను ముందుగానే సంబంధిత చౌకధర దుకాణ డీలర్‌కు తెలియజేయాలని సూచించారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.9,041 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 840 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,041, కనిష్టంగా రూ. 4,369, సరాసరి రూ. 6,581 ధరలు లభించాయి. అదే విధంగా 7 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటా రూ. 2,711 ధర పలికింది. -
నకిలీ.. మకిలీ
● నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి.. ● మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం ● రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం.. ● కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు ● గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెలుగులోకి ఇలా.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు. గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ.. నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించి కర్ణాటకకు చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినేపల్లిలో వెలుగులోకి రాగా.. సమీప మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో తక్కువ ధర పేరిట వేలాది మంది రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను టార్గెట్‌గా చేసుకుని కేటుగాళ్లు దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ డీఏపీ ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. తమ బాధను వెల్లగక్కలేక, మింగలేక మథనపడుతున్నారు. రైతుల్లారా బీ అలర్ట్.. డీఏపీ.. డై అమ్మోనియం ఫాస్పేట్. వ్యవసాయంలో అత్యంత ప్రాముఖ్యత గల ఎరువు. విత్తనాలు విత్తే సమయంలో గానీ.. నాట్లు వేసేటప్పుడు గానీ దీన్ని బేసల్ ఎరువుగా వేస్తారు. వేరు వ్యవస్థ అభివృద్ధి, పంట ఎదుగుదల, అధిక దిగుబడికి ఇది దోహదం చేస్తుంది. అలాంటి ఈ ఎరువు అసలుదా.. నకిలీదా అని గుర్తు పట్టేందుకు మూడు రకాలుగా పరీక్షించాలని రైతులకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు. డీఏపీ గింజను గోరుతో గట్టిగా నొక్కాలి. గింజ రాయిలా గట్టిగా ఉండి.. పగలకుంటే మంచిది. మట్టిగడ్డలా పొడిపొడిగా రాలిపోతే నకిలీది. కొన్ని డీఏపీ గింజలను చేతిలోకి తీసుకుని పాన్ (తాంబూలం)లో వేసే తడి సున్నం కలిపి బాగా రుద్దాలి. ఘాటైన వాసన (అమ్మోనియా) వస్తే అసలైన డీఏపీ. ఎలాంటి వాసన రాకపోతే రాతి పొడితో చేసిన నకిలీ ఎరువు అని గ్రహించవచ్చు. కొన్ని డీఏపీ గింజలను ఇనుప పెనం మీద వేసి వేడి చేయాలి. వేడికి ఉబ్బి కరిగిపోతే అసలైన డీఏపీ. కరగకుండా గట్టిగా ఉంటే నకిలీది. లైసెన్స్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలి. కొన్న తర్వాత దుకాణాదారుడి నుంచి కచ్చితంగా రశీదు తీసుకోవాలి. రాత్రి వేళ లేదా అనుమానాస్పద వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు. ఎరువుల నాణ్యతపై అనుమానం వస్తే వెంటనే వ్యవసాయాధికారికి సమాచారం అందించాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో అనుమతి ఉన్న విత్తన, ఎరువుల దుకాణాల్లో ఈ సారి పత్తి విత్తనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. రైతులు ఎక్కడి నుంచో పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు అనుమానం ఉంది. నిఘా పెట్టడంతో పలు చోట్ల నకిలీ విత్తనాలు దొరికాయి. కానీ నకిలీ డీఏపీ ఎరువులు పట్టుబడడం ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటిసారి అనుకుంటా. కర్ణాటక, గద్వాల సరిహద్దుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్, జిల్లావ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్ నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై రైతులు అలర్ట్‌గా ఉండాలి. వీటిని విక్రయించిన వారు, ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు. కొనుగోలు చేసిన రైతులు నకిలీ డీఏపీ ఎరువులను అంటగట్టిన వారి వివరాలు వెల్లడించకపోతే.. వారిపైనా చర్యలు తప్పవు. అవసరమైతే కేసులు పెట్టాల్సి వస్తుంది. – హేమంతకేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ డీఏపీ విక్రయాలకు సంబంధించి పోలీసులు కొందరు డీలర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేటలో 111 బస్తాలు నకిలీ డీఏపీ దొరికిన వ్యవహారంపై పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లిలో సైతం విక్రయించినట్లు తెలిసింది. దీంతో మాహదేవునిపేట, అమ్మపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాలు నడిపే కొందరు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వ్యవసాయాధికారులు నకిలీ డీఏపీ నమూనాలను శనివారం టెస్టింగ్ కోసం హైదరాబాద్‌కు పంపించగా.. మంగళవారం నివేదిక రానుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ఈపాస్ యంత్రాలతో ఎరువులు విక్రయించాలి నారాయణపేట: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ డా. వినీత్ సమక్షంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. రహదారులపై రిఫ్లెక్టర్లు, రంబుల్ స్ట్రిప్స్, పక్కనే హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల పరిసరాలను సేఫ్టీ జోన్లుగా అభివృద్ధి చేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలు కల్పించాలని, ప్రధాన రహదారులపై పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిశాఖ తమ పరిధిలో చేపట్టిన రోడ్డు భద్రత పనుల పురోగతిని సకాలంలో నివేదికల రూపంలో సమర్పించాలన్నారు. ప్రమాద సమయంలో బాధితులకు అత్యవసర వైద్యం వేగంగా అందేందుకు 108 అంబులెనన్స్ సేవలను బలోపేతం చేయాలని, జాతీయ రహదారులపై అవసరమైన చోట అదనపు అంబులెన్సులు, అత్యవసర స్పందన కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రమాద బాధితులకు సాయం చేసే గుడ్ సమారిటన్ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి సాయం చేసే వ్యక్తులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. అతివేగం, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మైనర్ల డ్రైవింగ్, ఫిట్నెస్ లేని వాణిజ్య వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో రవాణా, పోలీసు, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, ఆర్టీసీ, 108 అంబులెన్స్ సేవలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దామరగిద్ద: రైతులకు అవసరమైన ఎరువులను ఈ పాస్ యంత్రంలో ఆధార్ నమోదుతో విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్, హాకా రైతు సేవాకేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ఎరువులు, వరి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో బెట్ట పరిస్థితులు నెలకొన్నందున వర్షాధారంగా సాగు చేసిన పెసర, కంది, పత్తి, జొన్న పంటలను సంరక్షించుకోవడంపై సూచనలు చేశారు. దుకాణాలకు వచ్చే రైతులకు వర్షాభావ పరిస్థితులు, పంటల సంరక్షణ, ప్రత్యామ్నాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్, ఏఈఓ గోపాల్ ఉన్నారు. న్యాయవాదుల నిరసన మక్తల్: నర్వ మండలం ఉందేకోడ్కు చెందిన న్యాయవాది నీరజ్‌పై దాడికి నిరసనగా శుక్రవారం మక్తల్ న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరు కావడం లేదని జూనియర్ సివిల్ న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రేయ, తిమ్మన్న, శ్రీనివాస్, సూర్యప్రకాశ్, ఆనంద్, రవికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు రుణాలు ఇవ్వండి
● ఎస్బీఐలోనే ఎందుకింత తిరస్కరణ? ● ఆగష్టు 15లోగా 100 శాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని.. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, పీఎం డీడీకేవై తదితర పథకాల పురోగతిపై బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ శాఖల్లో రుణ దరఖాస్తుల తిరస్కరణలు అధికంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. ఈ అంశంపై లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రత్యేక చొరవచూపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద బ్యాంకుల వారీగా పెండింగ్, తిరస్కరణ దరఖాస్తులపై సమీక్షించి అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బ్యాంకర్లు, ఏపీఎంలు, డీపీఎంలు సమన్వయంతో పనిచేయాలన్నాని సూచించారు. పీఎం డీడీకేవైపై కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నందున లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తులను వెంటనే గ్రౌండింగ్ చేసి ఆగష్టు 15లోగా 100 శాతం పూర్తి చేయాలన్నారు. సీ్త్రనిధి రుణాలు, స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల పురోగతిపైనా దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఎల్డీఎం విజయ్‌కుమార్, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్, పుర కమిషనర్ శంకర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
నారాయణపేట: తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. గురువారం మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాలు ఆలస్యం కావడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లలో నీటిలభ్యత తగ్గుతున్న నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే వరి సాగు రైతులకు భారంగా మారే అవకాశం ఉందన్నారు. బోర్ల కింద వరి విస్తీర్ణాన్ని తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వులు, ఆముదం, సజ్జ, జొన్న, రాగులు తదతర చిరుధాన్యాలు సాగు చేయడంతో దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ పంటలకు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు రైతులకు ఆర్థికపరంగా కూడా భద్రత కల్పిస్తాయని పేర్కొన్నారు. పత్తి రైతులు మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు 2 శాతం యూరియా ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. నేలలో తేమ నిల్వ ఉంచేందుకు కలుపు నియంత్రణ, తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే రాయితీలు, పంట నష్టపరిహారం, బీమా, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్, సర్పంచ్ చంద్రశేఖర్‌గౌడ్, రాంరెడ్డి, తిమ్మప్ప, ఆనంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కూలి పనులే దిక్కు
ఏటా వర్షాలు, ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేయడం కోసం ఎదురుచూస్తాం. చెరువుల్లో చేపలు పెరిగితేనే జీవనోపాధి.. ఆలస్యమైతే కూలి పనులే దిక్కు. చెరువుల్లో చేపల వేట లేకపోవడంతో చాలామంది మత్స్యకారులు ఉపాధి పనులు, వ్యవసాయ, భవన నిర్మాణ పనులకు వెళ్లాల్సి వస్తోంది. కులవృత్తిపై ఆధారపడలేని పరిస్థితి నెలకొంది. – ప్రకాష్, మత్స్యకారుడు, ఊట్కూర్ మత్స్యకార కుటుంబాలు చేపల అమ్మకాలతో పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, అప్పుల చెల్లింపులు సాగుతాయి. సీజన్ ప్రారంభమవుతుందనే ఆశతో అనేక మంది వలలు, పడవలు సిద్ధం చేసుకుంటారు. ఇందుకోసం కొందరు అప్పులు కూడా చేస్తారు. పంపిణీ ఆలస్యమైతే మొత్తం జీవన చక్రం దెబ్బతింటుంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ చూపి త్వరగా టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు చేపట్టారు. – కాంత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, మత్స్య సహకార సంఘం జిల్లాలో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీకిగాను ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ వెలువడనుంది. వర్షాలు పడితే ఆగష్టు, సెప్టెంబర్‌లో చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు సిద్ధంగా ఉన్నాం. – రహమాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి ● -
రహదారి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నారాయణపేట: జిల్లాకేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రహదారులపై అక్రమ పార్కింగ్‌పై పోలీసుశాఖ దృష్టి సారించింది. డయల్ యువర్ ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్ గురువారం పట్టణంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్యతో కలిసి సరాఫ్‌బజార్, మెయిన్‌చౌక్, ఓల్డ్ బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్ ప్రధాన రహదారి తదితర రద్దీ ప్రాంతాల్లో పర్యటించారు. రహదారులపై నిలిపిన వాహనాలు, దుకాణాల ఎదుట ఆక్రమణలు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న అంశాలను పరిశీలించి వాహన, దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతుందని తెలిపారు. వాహనదారులు రోడ్లపై కాకుండా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అలాగే వ్యాపారులు తమ దుకాణాల ఎదుట ఉన్న రహదారులపై సామగ్రి ఉంచకుండా సహకరించాలని కోరారు. -
మగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు..
జననాల్లో మహబూబ్‌నగర్ టాప్.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. -
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఆత్మరక్షణ శిక్షకుల (కోచ్‌లు) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్, సమగ్రశిక్ష చైర్మన్ ఆమోదం, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆదేశాల మేరకు కరాటే, జూడో, కుంగ్‌ఫూ, కలరిపయట్టు, తాయిక్వాండో లేదా గుర్తింపు పొందిన ఇతర యుద్ధకళల్లో అనుభవం, అర్హులైన శిక్షకులు 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను జతచేసి జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయం, మినీ స్టేడియం గ్రౌండ్, నారాయణపేటలో సమర్పించాలని పేర్కొన్నారు. ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్‌గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్సీఓ ఆఫీస్‌లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి ఊట్కూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని.. సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని.. విడతల వారీగా బిల్లులు ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. అవసరం ఉన్న వారికి రెవెన్యూ అధికారులు ఇసుక సరఫరా చేయిస్తారని చెప్పారు. ఆయన వెంట ఎంపీడీఓ పావని, ఏఈ ప్రేమ, కార్యదర్శి శ్రీనివాసరావు, భరత్ తదితరులు ఉన్నారు. కమీషన్ల కోసమే ఎత్తిపోతల నిర్మాణం : బీఆర్ఎస్ మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమీషన్ల కోసమే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని చిన్నగోప్లాపూర్లో భీమా ఫేజ్–1 పంపుహౌజ్‌ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్ సరికాదని, దీంతో నిధులు వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. కొడంగల్ రైతులను మోసం చేస్తున్నారని, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పథకంతో రైతులకు ఎలాంటి లాభం లేదని.. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేవిధంగా ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, చిట్యాల జుబేర్‌పాషా, సర్పంచ్ గాలిరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అశిరెడ్డి, సాగర్, ఈశ్వర్, నేతాజీరెడ్డి, పంచలింగాల సర్పంచ్ రామాంజనేయులుగౌడ్, శివారెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8 వేలు గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 1,945 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.8,000, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,920 ధరలు లభించాయి. -
ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. త్వరలో శుభవార్త చెబుతాం.. ‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్ఎల్ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్‌కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్‌కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం -
‘సర్’ గడువు పెంపుతో ఊరట
జిల్లాలో ఇంకా 1.54 లక్షల ఓటర్ల ధృవీకరణ పెండింగ్ ● ఆగస్టు 3 చివరి తేదీ ● పట్టణాల్లో నెమ్మదించిన ప్రక్రియ ● గ్రామాల్లో మెరుగైన పురోగతి నారాయణపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం తుది దశకు చేరుకున్న వేళ జిల్లాలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ అధికారులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడం జిల్లా ఎన్నికల యంత్రాంగానికి కొంత ఊరటనిచ్చింది. మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 4,95,574 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు సగటున 69 శాతం మేర మాత్రమే ధృవీకరణ పూర్తైంది. ఇంకా 1,53,989 మంది ఓటర్ల ధృవీకరణ పెండింగ్‌లో ఉండటంతో ఇంటింటి సర్వేలు, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, బీఎల్ఓల పరిశీలించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగాలు, వలసలు, చిరునామా మార్పులు, మొబైల్ నంబర్ల లభ్యత వంటి కారణాలతో ప్రక్రియ మందగిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బీఎల్ఓలు ఇంటింటికీ చేరుకుని మెరుగైన పురోగతి సాధిస్తున్నారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వారం రోజులుగా మండలాల వారీగా పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. దీంతో బీఎల్ఓలు ఓటర్లకు ఎక్కడికక్కడ సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ ముందుకు సాగుతున్నారు. చివరి దశలో.. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల ధృవీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా 74,151 మంది ఓటర్ల ధృవీకరణ పూర్తి కావాల్సి ఉంది. మొత్తం 2,42,773 మంది ఓటర్లలో 1,68,622 మందికి (69.46%) మాత్రమే ధృవీకరణ పూర్తైంది. మిగిలిన 30 శాతం పూర్తి చేయాల్సి ఉంది. మక్తల్ నియోజవర్గంలోనూ.. మక్తల్ అసెంబ్లీలో మొత్తం 2,52,801 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,66,055 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశారు. వీటిలో 1,65,849 ఫారాలను బీఎల్ఓలు ధృవీకరించారు. ఇది మొత్తం ఓటర్లలో 68.42 శాతం. ఇంకా 79,838 మంది ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. మక్తల్ మండలంలో 67,891 మంది ఓటర్లలో 44,544 మందిదే ధృవీకరణ పూర్తైంది. 24,247 మంది ఇంకా పెండింగ్‌లో ఉండటం మొత్తం నియోజకవర్గంలోనే అత్యధికం. ఆత్మకూర్ మండలంలో 11,621 మంది, కృష్ణా మండలంలో 7,167 మంది ధృవీకరణ కోసం మిగిలి ఉన్నారు. మాగనూర్ మండలంలో 74.62 శాతం, అమరచింత 71.85 శాతం, మరికల్ 71.19 శాతం, ఊట్కూర్ 70.84 శాతం, నర్వ 70.59 శాతం ఆన్లైన్ నమోదు పూర్తైంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా.. నియోజకవర్గం మక్తల్ నారాయణపేట బీఎల్ఓలు 284 270 ఓటర్లు 2,52,801 2,42,773 డిజిటలైజేషన్ 1,66,055 1,61,561 ధృవీకరణ పూర్తి 1,72,963 1,68,622 పూర్తయిన శాతం 68.42 69.46 పెండింగ్ 79,838 74,151 సర్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనను క్షేత్రస్థాయి లో బీఎల్ఓలతో పకడ్బందీగా చేపడుతున్నాం. ఓటరు జాబితా లో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే ఒక ఓటును తప్పనిసరి, మరణించిన ఓటర్ల పేర్లను శాశ్వతంగా జాబితా నుంచి తొల గిస్తాం.ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫా రాలను వెంటనే డిజిటలైజేషన్ చేయిస్తున్నాం. – సీహెచ్ ప్రియాంక, కలెక్టర్ నారాయణపేట మండలంలో 85,004 మంది ఓటర్లలో 55,263 ఓటర్ల ధృవీకరణ పూరైంది. 29,741 మంది ఇంకా పెండింగ్‌లో ఉండటం మొత్తం నియోజకవర్గంలోనే అత్యధికం. గ్రామీణ మండలాల్లో మాత్రం సర్ ప్రక్రియ ఆశాజనకంగా కొనసాగుతోంది. కోయిల్‌కొండ 73.47 శాతం ధృవీకరణతో మొదటి స్థానంలో ఉండగా, దామరగిద్ద 71.90 శాతం, మరికల్ 70.93 శాతం, ధన్వాడ 69.55 శాతం ధృవీకరణ పూర్తయ్యాయి. -
ఘాటెక్కిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధర వినియోగదారునికి చుక్కలు చూపిస్తుండగా.. రైతులకు కాసుల పంట పండుతోంది. ఈసారి సీజన్లో నమోదైన ధరలతో పోల్చితే దాదాపు వందశాతం పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సీజన్లో జనవరి నుంచి మే వరకు 5 నెలలపాటు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలికింది. జూన్‌లో రూ.2,000 నుంచి రూ.2,400 వరకు, జూలై రెండో బుధవారం ఏకంగా రూ.2,500 నుంచి రూ.3,300 వరకు ఉల్లి ధరలు నమోదయ్యాయి. సీజన్లో అమ్ముకున్న రైతుల కన్నా ప్రస్తుతం అమ్ముకుంటున్న రైతులు వందశాతం లాభాలు పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి దిగుబడులు లేకపోవడంతో యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసిన రైతులు ఇప్పుడు మార్కెట్‌కు తీసుకువస్తుండగా అధిక ధరలు పలుకుతున్నాయి. ఉల్లి అమ్మకాలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోనే ఉల్లి క్రయ విక్రయాలకు దేవరకద్ర మార్కెట్ ప్రసిద్ధిగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడి మార్కెట్లో కేవలం ఉల్లిపాయలు మాత్రమే బహిరంగ వేలం వేసి ధరలు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లిని అమ్మకానికి తెస్తారు. ప్రధానంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లి అమ్మకానికి వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పండించిన ఉల్లి అంతా దేవరకద్ర మార్కెట్‌కే అమ్మకానికి తెస్తారు. ఏడాదిలో వచ్చే 56 బుధవారాలు ఉల్లి వ్యాపారంతోనే మార్కెట్ సందడిగా ఉంటుంది. అన్నదాతల ఆనందం.. ఉల్లి ధరలు పెరగడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. నిల్వ చేసుకున్నందుకు ఫలితం దక్కిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో అమ్మిన ఉల్లికి వచ్చిన ధరలతో పోల్చితే ప్రస్తుతం రెండు, మూడింతల ధరలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బుధవారం దేవరకద్ర మార్కెట్లో జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.3,300, కనిష్టంగా రూ.2,500 వరకు ధరలు నమోదయ్యాయి. సన్నటి ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,600 వరకు పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ.1,300 చొప్పున, సన్నటి ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.800 వరకు విక్రయించారు. నిల్వ చేసుకున్న రైతుకు లాభాల పంట క్వింటా గరిష్టంగా రూ.3,300,కనిష్టంగా రూ.2,500 క్రమంగా పెరుగుతున్న ధరలతో వినియోగదారుల ఆందోళన -
చెత్తకుప్పల్లో కాదు.. ‘ఊయల’లో ఉంచండి
నారాయణపేట: ఎవరైనా నవజాత శిశువును పెంచుకునే పరిస్థితిలో లేకపోతే ప్రమాదకర ప్రాంతాల్లో వదిలివేయకుండా.. నిస్సంకోచంగా జిల్లా ఆస్పత్రిలోని ‘ఊయలశ్రీలో వదిలి వెళ్లండని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ శి శువును పూర్తి బాధ్యతతో సంరక్షించి చట్టబద్ధ దత్తత ద్వారా బంగారు భవిష్యత్ కల్పిస్తుందని తెలి పారు. నవజాత శిశువులను చెత్తకుప్పలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి నిర్జన ప్రాంతాల్లో వదిలివేసే హృదయ విదారక ఘటనలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఒకవైపు కొందరు నవజాత శిశువులను అనాథలుగా వదిలివేస్తుండగా.. మరోవైపు సంతానం లేని దంపతులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నిబంధనల ప్రకారం చట్టబద్ధ దత్తత కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఊయల కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య, డీఎంహెచ్ఓ డాక్టర్ జయచంద్రమోహన్, డీసీపీఓ కరిష్మా, వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి మద్దూర్ (కోస్గి): సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేయడం వల్ల రైతులు ఆధిక ఆదాయం పొందొచ్చని కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక అన్నారు. పంటల వైవిద్యీకరణలో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో రైతులు మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తున్న వంకాయ, పచ్చిమిర్చి, టమాట, పూల తోటల సా గును క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాగు విధానా లు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణ తీరుపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని ముక్తిపాడ్ రైతువేదికలో ప్రాజెక్టు కే100 ను ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోని వివిధ గ్రా మాలకు చెందిన రైతులకు సాగులో నూతన విధా నం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికా రి సక్రియానాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, హార్టికల్చ ర్ అధికారి హర్షవర్ధన్, ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయాధికారులు రేష్మారెడ్డి, రమేష్, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
నిర్వాసిత రైతులకు పరిహారం ఎప్పుడు..?
నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్య క్షుడు జి.వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రారంభించి ఏడాది గడిచినా అనేక మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్, పేరపళ్ల రిజర్వాయర్ల పరిధిలో భూము లు కోల్పోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి అందలేదని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ సర్వస్వమైన భూములను ఇచ్చిన రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధర్మరాజు గౌడ్, గోపాల్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉద్మల్గిద్ద గో పాల్ మాట్లాడుతూ.. భూ ములతో పాటు పొ లాల్లో ఉన్న బోరు బా వులు, పైప్లైన్లు, చెట్లు వంటి ఆస్తులకు కూడా సరైన పరిహా రం చెల్లించడం లేదని ఆరోపించారు. పరిహారం ఆలస్యం కావడంతో ఇతర ప్రాంతా ల్లో భూములు కొను గోలు చేయాలనుకు న్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ లోగా భూముల ధర లు భారీగా పెరగడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల కంటే అదనంగా కాంట్రాక్టర్లు భూములను ఆక్రమిస్తున్నారంటూ ఆరోపించారు. ధర్నా అనంతరం భూనిర్వాసితులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు కేశవ్ నర్సప్ప, కృష్ణయ్య, మహేష్‌గౌడ్, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు -
‘సర్’పై నిర్లక్ష్యం వద్దు
అమరచింత (ఆత్మకూర్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై బీఎల్ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పేట జిల్లా రెవె న్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్ పట్టణంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని ఆయన తహసీల్దార్ జేకే మోహన్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్, మేనేజర్ సీత్యానాయక్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు. తప్పులు లేకుండా ఫారాలు నింపాలి మక్తల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయన హెల్ప్‌డెస్క్‌ను బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల ఆన్లైన్ నమోదు వేగంగా జరుగుతున్నా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతుందన్నారు. బీఎల్ఓలు ఆన్లైన్ మ్యాపింగ్‌లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అర్హులెవరూ ఓటరు జాబితా నుంచి తొలగించొద్దని, డబుల్ ఓట్లు, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, తహసీల్దార్ సతీస్‌కుమార్, కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి, గోవిందురావు, గోవర్ధన్, కమిషనర్ రాజయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వంచే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ – ఐఓ ఈగా అప్‌గ్రేడ్ చేయబడిన కేజీబీవీ, నారాయ ణపేటలో 2026–27 విద్యా సంవత్సరానికి గా ను ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో మిగిలిన 10 సీట్ల భర్తీ కోసం గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ఎస్ఓ శ్వేత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల వి ద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి అ న్ని ఒరిజినల్ ధృవ పత్రాలతో కళాశాలకు హా జరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99129 89334 నంబరుకు సంప్రదించలన్నారు. జోగుళాంబ క్షేత్రంపై విస్తృత ప్రచారం అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, స్థల పురాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని హైదవ సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్ క్షేత్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపురంగా పిలువబడుతున్న దేవాలయాల ఆసలు పేరు హేమలాపురం అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హేమలపురం పేరు తెలియపరచాలనే ఆకాంక్షతో పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ సహాయ కార్యదర్శి రాఘవులు, నర్సింహ, వీరేందర్ గుప్తా, సాయిగౌడు, శ్రవణ్ కుమార్, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే పోలీసు శాఖ నిరంత రం పనిచేస్తోందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ‘డ యల్ యువర్ ఎస్పీ‘ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గంట వ్యవధిలో 25 మంది బాధితులు, ఫిర్యాదుదారులు నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి తమ సమస్య లను వివరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతామని ఎస్పీ భరోసానిచ్చా రు. ప్రజలు ప్రధానంగా గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, అక్రమ మద్యం, పాన్ షాపుల్లో గుట్కా విక్రయాలు, భూ వివాదాలు, ట్రాఫిక్ సమస్యలు, మందుబాబుల అరాచకాలు, ఎస్ఐ ఫిర్యాదు స్వీకరించలేదనే ఆరోపణలు, కానిస్టేబుల్ భూ వివాదాల్లో జోక్యం, పెండింగ్ చోరీ కేసుల దర్యాప్తు, బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించడం, రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంపు, చీటింగ్ కేసులు తదితర అంశాలపై ఫిర్యాదు లు చేశారు. మరికల్ మండలం తీలేరు గేట్ వద్ద ప్రమాదాల ని వారణకు భారీకేడ్లు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లు అమర్చాలని ప్రజలు కోరారు. నారాయణపేట పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్, యా ద్గిరి రోడ్, స రాఫ్ బజార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించే చర్య లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేస్తాం ఊట్కూర్‌లో రౌడీ షీటర్లు, క మ్యూనల్ షీటర్ల జాబితాలో ప్ర మేయం లేని వ్యక్తుల పేర్లు ఉన్నాయనే ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ సమగ్ర విచారణ జరిపి అలాంటి వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. మక్తల్‌లో మిస్సింగ్ కారు, వెండి ఆభరణాల చోరీ, మద్దూరులో బెల్ట్ షాపులు, ఓపెన్ డ్రింకింగ్, గొర్రెల చోరీ, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫోన్ కాల్స్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ డాక్టర్ వినీత్ -
సస్యరక్షణ చర్యలతో పంటల సంరక్షణ
దామరగిద్ద: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు బెట్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. బోరుబావుల నీటిని అందించి ఎండకుండా రక్షించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త డా. సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం సమీపంలో పలువురు రైతుల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెసరకు ఎల్లో మోజాయిక్ (పల్లాకు తెగులు) వైరస్ వ్యాప్తిచెంది పంటలు దెబ్బతింటున్నట్లు గుర్తించామని.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పల్లాకు తెగులు సోకిన మొక్కలను మొదటి దశలో ప్రధాన పంట నుంచి తొలగించి కాల్చి వేయాలన్నారు. అజాడిరిక్టిన్ 1500 పీపీఎం 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మూడు రోజుల తర్వాత ఎసిటమాప్రిడ్ 0.3 గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి లేదా ఇమిడాక్లొప్రైడ్ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలన్నారు. తెగులు ఉధృతి అధికంగా ఉంటే దయాఫెంథిరాన్ 1.25 గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎకరాకు 15 పసుపు మరియు 15 నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకోవాలన్నారు. తెగులును తట్టుకునే రకాలైన ఎల్బీజీ 752, ఎల్బీజీ 782, పీ యూ–31 రకాలను ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ చందన రైతులు పాల్గొన్నారు. నానో ఎరువులు వాడాలి.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ నానో ఎరువుల వినియోగాన్ని పెంచాలని జిల్లా వ్యవసా య అధికారి సక్రియానాయక్ సూచించారు. కోర మండల్ ఇంటర్నేషనల్ కంపెనీ రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
18న ప్రత్యేక లోక్ అదాలత్
నారాయణపేట: చెక్‌బౌన్స్ కేసులకు వేగంగా, శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ నెల 18, నవంబర్ 21 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ తెలిపారు. జిల్లా ప్రధా న న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తు లు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టుతో పాటు నారాయణపేట, మక్తల్, కోస్గి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 152 పెండింగ్ కేసులను గుర్తించి రాజీమార్గంలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్ సంస్థలు, న్యాయవాదులు, పోలీసుశాఖ, బీమా సంస్థలు సమన్వయంతో పనిచేసి అధికసంఖ్యలో కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కక్షిదారులు తమ న్యాయవాదులతో కలిసి సంబంధిత కోర్టులకు హాజరై లోక్‌అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. న్యాయసాయం, లోక్‌అదాలత్‌కు సంబంధించిన వివరాల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, టోల్‌ఫ్రీ నంబర్ 15100కు కాల్చేసి ఉచిత న్యాయ సలహాలు, సమాచారం పొందవచ్చని తెలిపారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తి మనోజ్, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ పాల్గొన్నారు. -
ప్రజారంజక పాలనే ధ్యేయం
రాజోళి/మల్దకల్: రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం జూలకల్‌లో వి ద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పచ్చర్ల, మేడికొండలోని 33/11కేవీ సబ్స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని కుర్తిరావులచెర్వులో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు గట్టు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకుముందు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిసన హెలీప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం డీడీలు చెల్లించిన రైతులందరికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసి అందజేస్తున్నామన్నారు. అలాగే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, 1.6 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేశారు. -
జలగండం..!
జిల్లాలో కానరాని వాన జాడ బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026‘ఈ ఫొటోలోని యువ రైతు పేరు రాము. మాగనూరు స్వగ్రామం. ఈ ఏడాది వానాకాలంలో 7 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పటికే రూ.2 లక్షల పెట్టుబడి అయింది. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సాగునీరు అందేది. ప్రస్తుతం జలాశయంలో లో నీరు లేదు. బోరు నుంచి వచ్చే నీరు సరిపోవడం లేదు. వర్షాలు కురవక నీరందకపోతే పంట మొత్తం దెబ్బతింటుంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ మార్గంలో సాగునీరు అందించాలని కోరుతున్నారు. -
శాసీ్త్రయ పద్ధతులు పాటించాలి..
ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగిస్తూ శాసీ్త్ర య సాగు పద్ధతులు అ నుసరిస్తేనే ఎల్‌నినో ప్ర భావాన్ని కొంత మేర తగ్గించుకో వచ్చు. పంట పొలాల్లో తేమ నిల్వ ఉంచే చర్య లు చేపట్టాలి. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పురుగులు, తెగుళ్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి. వ్యవసాయ అధి కారుల సూచనలు పాటించాలి. పంట బీమా, సస్యరక్షణ చర్యలను విస్మరించకూడదు. వాతావరణ హెచ్చరికలను గమనించాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు సాధించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ఎమ్మార్పీలు కృషి చేయాల ని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తున్న ప్రాథమికస్థాయి మండల రిసోర్సు పర్సన్ల జిల్లాస్థాయి శిక్షణకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయుల శిక్షణే పునాది అన్నారు. ఎంఆర్పీలు తమ మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా తరగతి గదిలో ప్రభావవంతంగా అమలవుతుందా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు టీచర్స్ హ్యాండ్‌బుక్ ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందించి బోధించేలా మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల వర్క్‌బుక్స్ క్రమం తప్పకుండా పరిశీలించి దిద్ధుబాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పాఠశాలలో భాషా, గణిత, ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టిసారించి తరగతి గదిలో అందుబాటులో ఉన్న టీఎల్ఎంను సృజనాత్మకంగా వినియోగించాలని సూచించారు. ఏఎక్స్ల్ను సమర్థవంతంగా అమలు చేస్తూ నేర్చుకునే స్థాయిల ఆధారంగా విద్యార్థులను గుర్తించి లక్ష్యా ఉద్ధేశంతో బోధన నిర్వహించాలన్నారు. బోధన, సమూహ అభ్యాసం, నిరంతర మూల్యాంకనం ద్వారా ప్రతి విద్యార్ధిని ఆశించిన అభ్యాసన స్థాయికి తీసుకురావాలని కోరా రు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, జిల్లాసా యి శిక్షకులు భీమప్ప, జానకిరాములు, వినోద్, అఖిల్, లక్ష్మీనారాయణ, నరేష్ పాల్గొన్నారు. -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్‌కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్‌నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్‌ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్‌కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్‌నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్‌లో మెరుగుదల అవసరం -
భూ సేకరణలో వేగం పెంచండి
నారాయణపేట:మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూ సేకరణలో జాప్యానికి తావులేకుండా సర్వే, పరిహారం, స్వాధీ నం ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దామరగిద్ద మండలం కానుకుర్తి, లక్ష్మీపూర్, పేరపల్లిలో ఇంకా ఎంత మేర భూ సేకరణ మిగిలి ఉందని, సర్వే పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వే పనులను వేగంగా పూర్తిచేసి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వేయర్లు రోజువారీగా ఏ పనులు చేస్తున్నారో నివేదిక సమర్పించాలని సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్‌ను ఆదేశించారు. మిగిలిన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రాజెక్టు పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్, ఆర్డీఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ అనిల్‌కుమార్, నీటిపారుదలశాఖ ఈఈతో పాటు దామరగిద్ద, మద్దూరు, గుండుమల్ తహసీల్దార్లు పాల్గొన్నారు. ‘సర్’ పరిశీలన.. మండలంలోని జలాల్పూర్, పేరపల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (ఎన్యూమరేషన్) ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడి ఓటరు జాబితాలో ఉన్న డబుల్ ఓట్లు, చనిపోయిన ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనర్హుల పేర్లను శాశ్వతంగా తొలగించి జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి ఇళ్లకు వెళ్లి తీసుకోవాలన్నారు. అలాగే జలాల్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. బాలామృతం పంపిణీ, గర్భిణుల సంఖ్య, పోషకాహార సేవల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పేరపల్లిలోని పల్లె దవాఖానను తనిఖీ చేసి గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలు, ఎనన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహణ, అవసరమైన మందుల లభ్యతను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెనుక భాగంలో నిర్మాణం పూర్తయిన సబ్‌సెంటర్ భవనం తాళం వేసి ఉండటాన్ని గమనించి జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌కు ఫోన్ చేసి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇంకా చెల్లించలేదని చెప్పడంతో వెంటనే పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఆమె వెంట డీటీ రామకృష్ణ ఉన్నారు. -
సన్నబియ్యానికి రెక్కలు!
మరికల్: వర్షాభావ పరిస్థితులతో వరిసాగు గణనీయంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో సన్నబియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశముందని పసిగట్టిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నా రు. ఇదివరకే మార్కెట్లో ధరలు క్రమంగా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. గతంలో సన్నాలు క్వింటా ధర రూ. 4,500 నుంచి రూ. 4,800 ఉండగా.. ప్రస్తుతం చాలా చోట్ల రూ. 5,600 వరకు ధర పెరిగింది. బియ్యం నాణ్యత మేరకు ఒక్కో చోట రూ. వెయ్యి వరకు అదనంగా భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించడం కొంత ఊరటనిస్తోంది. ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తూ.. జిల్లాలో జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్, అమని తదితర రకాల బియ్యానికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి జనాభాకు అనుగుణంగా దిగుబడి లేకపోవడంతో కర్నూలు, మిర్యాలగూడ, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి సన్నబియ్యం ఎక్కువగా దిగుమతి అవుతోంది. మిల్లర్లు ఆయా జిల్లాల నుంచి వడ్లను తెప్పించి.. మరాడించి విక్రయిస్తుంటారు. అయితే రైస్‌మిల్లర్లు నిల్వల మేరకు బియ్యం తయారీని ప్రారంభిస్తున్నారు. నెలరోజుల నుంచి క్రమంగా సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంతో మిల్లర్లు ఆచిచూచి వడ్లను మరాడిస్తున్నారు. రెండేళ్ల తర్వాత.. వానాకాలంలో మాత్రమే అధిక శాతం రైతులు సన్నరకాలను పండిస్తూ వస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులకు సాగునీటి సదుపాయం లభించడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రెండేళ్ల క్రితం సన్నబియ్యం ధర తగ్గుముఖం పట్టింది. ఈసారి మాత్రం వర్షాభావ పరిస్థితుల కారణంగా సన్నబియ్యం ధరలు అమాంతం పెరుగుతుంగటంతో కొనలేని పరిస్థితి వస్తోంది. తగ్గుతున్న వరిసాగు.. జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో 1.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచేస్తున్నారు. ఇందులో లక్షకు పైగా ఎకరాల్లో వచ్చిన దిగుబడిని ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయిస్తుంటారు. మిగతా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేస్తారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా అంతటా వరిసాగు దాదాపు 50వేల ఎకరాల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే సన్నబియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులతో అమాంతం పెరుగుతున్న ధరలు ఇప్పటికే క్వింటా రూ. 5,600 పలుకుతున్న రేటు సామాన్యులపై అదనపు భారం జిల్లాలో తగ్గుతున్న వరిసాగు విస్తీర్ణం -
ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాం..
బాలానగర్‌లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్‌గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్‌రెడ్డి, వాహనదారు బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్ -
20 రోజుల నుంచి ధరలు పెరిగాయి..
20 రోజుల నుంచి సన్నబియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల రోజుల క్రితం సన్నబియ్యం క్వింటా రూ. 4,500 ఉండగా.. ప్రస్తుతం రూ. 5,600కు చేరుకుంది. మిల్లర్లు వ్యాపారులకే క్వింటా రూ. 5,450 చొప్పున విక్రయిస్తున్నారు. జనాలకు రూ. 5,600కు అమ్ముతున్నారు. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముందని మిల్లర్లు చెబుతున్నారు. – శివ, కిరాణ వ్యాపారి, మరికల్ ప్రజలపై భారం తగ్గించాలి.. ప్రతి కుటుంబానికి నెలకు 25కిలోల బియ్యం అవసరం. రెండు, మూడేళ్ల క్రితం రూ. వెయ్యికే 25 కేజీల బస్తా వచ్చేంది. ప్రస్తుతం రూ. 1,350 వరకు అమ్ముతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు బ్యియం ధరలు కూడా పెరగడంతో అదనపు భారంతో అవస్థలు పడుతున్నాం. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – రఘు, మరికల్ ● -
ఆధార్ సేవల్లో పారదర్శకతకు పెద్దపీట
నారాయణపేట: జిల్లాలో పనిచేస్తున్న ఆధార్ ఆపరేటర్లు యూఐడీఏఐ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేస్తూ.. ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలని యూఐడీఏఐ రాష్ట్ర మేనేజర్ నరేశ్‌చంద్ర అన్నారు. ఆధార్ నమోదు, నవీకరణ సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా కలెక్టరేట్లో సోమవారం ఆధార్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ నమోదు, అప్డేట్, ఈ–ప్రాసెస్, బయోమెట్రిక్ ధ్రువపత్రాల పరి శీలన, సేవల నాణ్యత ప్రమాణాలపై సవివరంగా వివరించారు. ప్రతి ఆధార్ కేంద్రంలో యూ ఐడీఏఐ నిబంధనల మేరకు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఈడీఎం కె.విజయ్ కుమార్, జిల్లా మేనేజర్ కె.రామ్మోహన్, శివప్రసాద్ పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యమే భవిష్యత్‌కు పునాది నారాయణపేట: పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. నులిపురుగుల నివారణతో వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బాటలు వేయవచ్చని మున్సిపల్ చైర్పర్సన్ కొండ శ్వేత, వైస్‌చైర్‌పర్సన్ మంజుల అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.సిద్ధప్పతో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా.. తమ పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారికి ఆరోగ్యవంతమైన భవిష్యత్ అందించడంలో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. కాగా, జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన 1,52,355 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. కాగా, మరికల్ గురుకుల పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్ పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత, వైద్యసేవల అమలును పరిశీలించారు. కార్యక్రమంలో డీఐఓ డా.సాయిరాం, ఎన్సీడీ పీఓ డా. లక్ష్మీకాంత్, ఎన్టీఈపీ పీఓ డా.సత్యప్రకాశ్రెడ్డి, ఎంహెచ్ఎన్ పీఓ డా.సుదీష్ణ, కోఆర్డినేటర్ సురేశ్‌బాబు, యూపీహెచ్సీ వైద్యాఽ దికారి డా.తిరుపతి పాల్గొన్నారు. -
భూ సర్వేలో వేగం పెంచండి : కలెక్టర్
నారాయణపేట: మక్తల్– నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న భూ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన భూ సర్వే, భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. నిర్ణీత గడువులోగా సర్వే పనులను పూర్తిచేసి.. భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ● ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియ జిల్లాలో కీలక దశకు చేరుకుందని.. ప్రతి ఓటరు వివరాలు కచ్చితంగా నమోదై, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిచేసి బీఎల్వోలకు అందిస్తేనే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నెల 24వ తేదీలోగా జిల్లాలోని అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించేలా చూడాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించడం, సందేహాలు నివృత్తి చేయడం, పత్రాలను పూరించడంలో సహకరించడం వంటి బాధ్యతలను బీఎల్ఏలు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి ఆర్డీఓ రమేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వేణుగోపాల్, ఎన్నికల విభాగం అధికారి జయసుధ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్‌రెడ్డి, అబ్దుల్ సలీం, వెంకట్రాంరెడ్డి, రాఘవ చౌదరి, కె.నారాయణ పాల్గొన్నారు. -
ప్రజావాణిలో వినతుల వెల్లువ
నారాయణపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను డీఆర్వో రాజేశ్వరి దృష్టికి తీసుకొచ్చి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం పెంచి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పింఛన్లు తదితర సమస్యలపై 32 అర్జీలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఫణిరాజ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరపాలి.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అక్రమాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి.. అర్హులకు న్యాయం చేయాలి. కొందరు నాయకులు డబ్బులను తీసుకుని అనర్హులకు ఇళ్లు మంజూరు చేయిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలి. – గౌతమ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి, మక్తల్ అన్యాయం చేయొద్దు.. 13 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వివిధ కళలు, వృత్తి, వ్యాయామ విద్య బోధిస్తున్నాం. ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఇతర పాఠశాలలకు పంపేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టడం సరైంది కాదు. మేము కేవలం రూ. 11,700 గౌరవ వేతనంతో సేవలందిస్తున్నాం. తమను మరో పాఠశాలకు మార్చడం వల్ల కుటుంబ, ప్రయాణ, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – తెలంగాణ కళా, వృత్తి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు రికార్డుల్లో తప్పిదాలతో రైతుభరోసా రాలేదు.. తరతరాలుగా సాగుచేస్తున్న భూముల వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడంతో రైతుభరోసా రావడం లేదు. పేట–కొడంగల్ ప్రాజెక్టుకు భూ సేకరణ సందర్భంగా సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, యాజమాన్యుల వివరాల నమోదులో జరిగిన పొరపాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నమోదు లోపాలే ఈ సమస్యకు ప్రధాన కారణం. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలి. – గడిమునకపల్లి గ్రామ రైతులు, దామరగిద్ద మండలం -
హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ●ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్‌హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతినిత్యం వేలాది వాహనాలు.. వందకుపైగా వేగంతో రయ్యుమంటూ దూసుకెళ్లే జాతీయ రహదారి –44పై బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిపై అక్కడక్కడ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ఒకే దారిలో ఇరువైపుల వాహనాలు వస్తుండటంతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు, అధికారిక విధుల్లో వెళ్లేవారు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. – అడ్డాకుల/రాజాపూర్ బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని వాహనదారుల అవస్థలు -
సురక్షితమైన రవాణా వ్యవస్థే లక్ష్యం
● హ్యామ్ రోడ్లతో అభివృద్ధి వేగవంతం ● రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నారాయణపేట/మక్తల్: ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని మక్తల్‌లో రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రహదారి నిర్మాణానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మంచిరోడ్లు ఉంటేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. అభివృద్ధికి నాణ్యమైన రహదారులే పునాదులని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిరక్ష్యం చేసిందని విమర్శించారు. మక్తల్–పేట రహదారి నిర్మాణాన్ని 12 – 16 నెలల్లో పూర్తిచేస్తామన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణలో ప్రజలు సహకరించాలని.. భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్క ప్యాకేజీలోనే రూ. 547కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రవాణా, సాగునీటి పరంగా మక్తల్ మంచి పురోగతి సాధిస్తుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించిన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని భారీ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ. 237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంతకుముందు ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి నుంచి మక్తల్ మండలం కాచువార్ వరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్లు రాధా లక్మారెడ్డి, సదాశివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, ఆర్అండ్బీ సీఈ వెంకటేశ్వర్రావు, ఎస్ఈ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ సభ విజయవంతం చేయాలి : మంత్రి
మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రూ.320 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరవుతారని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గముఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంకుస్థాపన అనంతరం అంబేడ్కర్‌నగర్ సమీపంలోని గురుకుల పాఠశాల ఆవరణలో బహిరంగసభ ఉంటుందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఆనంద్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి హన్మంతు, కట్టా సురేష్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి
జడ్చర్ల టౌన్: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిరంలో ఉమ్మడి జిల్లాలోని సరస్వతి శిశుమందిరాల మాతాజీలు, ఆచార్యులకు నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన హాజరైన మాట్లాడారు. తరచూ పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించటంతో విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశాలుంటాయన్నారు. సమావేశంలో పాలమూరు విభాగ్ మద్ది అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, అధ్యక్షుడు బాలరాజు, సహ కార్యదర్శులు కృష్ణమోహన్, విఠలయ్య, ప్రధానాచార్యులు వెంకటయ్య పాల్గొన్నారు. -
ముహూర్తం కుదిరింది
నేడు హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనరూ.237.71 కోట్లు.. నాలుగు వరుసలు... మక్తల్ – నారాయణపేట ఆర్అండ్బీ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారిని ఎలాగైనా తన హయంలో పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సంకల్పించి పనుల ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. మక్తల్ నుంచి సింగారం చౌరస్తా వరకు 26 కిలోమీటర్ల రహదారిని రూ.237.71 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు పనులు ప్రారంభించనున్నారు. ● నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని పలు రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరికల్– మినాస్‌పూర్–లింగంపల్లి 37.68 కిలోమీటర్ల రహదారికి రూ.49.57 కోట్లు, ఆత్మకూర్–మరికల్ రోడ్ 13.40 కిలోమీటర్లకు రూ.22.47 కోట్లు, మాగనూర్ మండలం నల్లగట్టు–హిందూపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లు కేటాయించగా.. మంత్రులు నేడు పనులు ప్రారంభించనున్నారు. నారాయణపేట/మక్తల్: జిల్లాలో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి పనుల ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని రహదారులను విస్తరించడంతో పాటు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతినిస్తూ తొలిసారిగా రహదారులను అభివృద్ధి చేపట్టింది. జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లకు మహర్ధశ అని చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటికే మొదటిదశ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు రుణంతో నిర్మిస్తారు. ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో రుణం తిరిగి చెల్లించనుంది. ఈ విధానంలో 15 ఏళ్లపాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌దే. గతేడాది డిసెంబర్ 1న మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.210 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. మంత్రి వాకిటి శ్రీహరి నెలరోజులుగా పట్టుబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నాలుగు లైన్ల రహదారికి నిధులు సరిపోవని అదనంగా మరో రూ.27 కోట్లు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. దీంతో 238 రోజులకు మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి పనుల ప్రారంభానికి సోమవారం మహూర్తం కుదిరింది. పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖమంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నారు. హాజరుకానున్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే -
వెట్‌రన్‌కు అడుగులు
కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్‌హౌజ్‌లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్‌హౌజ్‌ను పరిశీలించి సోమవారం వెట్‌రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్ 3న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్ చేపట్టగా.. పంపు మోటార్ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్‌కు చర్యలు మొదలయ్యాయి. నాలుగు మోటార్లు బిగింపు ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్‌లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్‌లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అసంపూర్తి పనులతో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్‌హౌజ్ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 4 పాలమూరు పంప్‌హౌజ్‌లో ఏర్పాటు చేయాల్సిన మోటారు 8నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఒక మోటార్ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు తాజాగా సీఎం ఆదేశాలతో.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్‌లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్‌రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ‘పాలమూరు’ మొదటి పంపును పరీక్షించిన అధికారులు నేడు ఎల్లూరు పంపుహౌజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు మరోవైపు.. ఇంకా అసంపూర్తిగానే కాల్వలు రాజకీయ దుమారం.. గత మే, జూన్ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్ఎస్కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు. -
పురుగును ‘నులి’మేద్దాం..!
నారాయణపేట: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం, 20 తేదీల్లో జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 1,81,313 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ దిశానిర్ధేశంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు కూడా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు వేయనున్నారు. నులిపురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెతుత్తాయి. వీటిని అధిగమించేందుకు ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు వేయడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష్యాలను నిర్దేశించి మాత్రలు సరఫరా చేశారు. ఎందుకు ప్రమాదం? నులిపురుగులు పిల్లల పేగుల్లో పెరిగి వారు తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాప్తి ఇలా.. నులిపురుగుల గుడ్లు మట్టిలో ఎక్కువకాలం జీవిస్తాయి. బహిరంగ మలవిసర్జన, అపరిశుభ్ర పరిసరాలు, చెప్పులు లేకుండా తిరగడం, శుభ్రంగా కడగని కూరగాయలు, పండ్లు తినడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వంటి అలవాట్లతో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా చిన్నారులు నేలపై ఆడుకునే సమయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మాత్రలు ఎలా వేస్తారు? ఆల్బెండజోల్ మాత్రలు వయస్సును బట్టి అందజేస్తారు.1–2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర (200 మి.గ్రా.) పొడి చేసి, 2–3 ఏళ్ల వారికి ఒక మాత్ర (400 మి.గ్రా.) పొడి చేసి, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర (400 మి.గ్రా.) నమిలి మింగాలి. సోమవారం తీసుకోలేని వారికి 20వ తేదీన మరో అవకాశం కల్పించారు. సురక్షితమైన ఔషధం.. ఆల్బెండజోల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారస్ చేసిన సురక్షితమైన నులిపురుగుల నివారణ ఔషధం. ఈ మాత్ర వేసుకోవడంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి మాత్ర తీసుకోవడంతో నులిపురుగుల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చని చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. భోజనం ముందు, మరుగుదొడ్డి తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి, కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి తినాలి, ఎప్పుడూ చెప్పులు ధరించాలి. బహిరంగ మలవిసర్జన చేయరాదు, పిల్లల గోర్లు చిన్నగా కత్తిరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలి. ఇవీ లక్షణాలు.. రక్తహీనత, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, వికారం, అతిసారం, బలహీనత, మలంలో రక్తం పడటం, ఎదుగుదల మందగించడం, చదువులో ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం 1–19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు జిల్లాలో 1.81 లక్షల మంది ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విధిగా వేయించాలి.. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ దిశానిర్ధేశంతో జిల్లాలో 1.81 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తప్పనిసరిగా మాత్రలు వేయించాలి. – డా. సాయిరాం, జిల్లా ప్రొగ్రామ్ అధికారి -
నగర అభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం నగరంలోని లక్ష్మీనగర్ వద్ద మెయిన్‌రోడ్డుపై శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఆర్చ్‌ను ప్రారంభించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నామన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. -
క్రీడలకు కేరాఫ్ పాలమూరు స్టేడియం
మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే క్రీడలకు కేరాఫ్‌గా మారుతోంది. మొదటి నుంచి ఈ స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు వేదికై ంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న మైదానంలో క్రమంగా క్రీడాకారుల కోసం ఎన్నో వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.ఇ ప్పటికే స్టేడియంలో అన్ని వసతులతో కూడిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండగా.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్, కబడ్డీ టోర్నమెంట్లతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే మెయిన్ స్టేడియం ఆవరణలోనే రెండు క్రీడా అకాడమీలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల క్రితం స్టేడియంలో బాలబాలికల వాలీబాల్ అకాడమీ ఏర్పటైంది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటారు. ఇటీవలే బాలుర కబడ్డీ అకాడమీ మంజూరైంది. త్వరలో కబడ్డీ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరగనున్నాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచే 20 మంది బాలురు ఇక్కడ శిక్షణ ఇస్తారు. రూ.10.70 కోట్లతో సింథటిక్ ట్రాక్.. మెయిన్ స్టేడియంలో ఎప్పుడుప్పుడా అని జిల్లా అథ్లెట్లు ఎదురుచూస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాన్ని రూ.10.70 కోట్లతో అధునాతన హంగులతో ఏర్పాటు చేయనున్నారు. 400 మీటర్లు మేర 8 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ పనులకు గత నెల 22న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు చెందిన అథ్లెట్లు నిత్యం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇటీవల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు అధునాతన ఇండోర్ స్టేడియం భవిష్యత్‌లో మరిన్ని వసతులు మరిన్ని క్రీడా అభివృద్ధి పనులు.. క్రీడలకు హబ్‌గా మహబూబ్‌నగర్ నిలుస్తోంది. రాష్ట్ర క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కృషితో మెయిన్ స్టేడియంలో ఎన్నో క్రీడావసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలే సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌కు శంకుస్థాపన చేశారు. బాలుర కబడ్డీ అకాడమీ మంజూరైంది. త్వరలో ఇండోర్ జిమ్ కూడా ఏర్పాటు కానుంది. భవిష్యత్‌లో మెయిన్‌స్టేడియంలో మరిన్ని క్రీడా అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది. – జె.రాజశేఖర్‌రెడ్డి, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ -
నాటి కలెక్టర్ స్ఫూర్తితో..
2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్‌ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి పట్టుదలతో చేరా.. మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రా మంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు, మదనాపురం -
సర్.. సాగడం లేదు!
జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి.. ధ్రువీకరణే బీఎల్వోలకు పెద్ద సవాల్ ● ఇప్పటి వరకు కేవలం 30 శాతంలోపే.. ● చివరి గడువు ఈ నెల 24.. డిజిటలైజేషన్‌పై దృష్టి ● నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో భారీగా పెండింగ్ నారాయణపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్–2026)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఓటరు జాబితా పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలమని పేర్కొంటూ.. వివరాల నమోదు, పరిశీలన, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో జాప్యానికి తావు లేకుండా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎస్ఐఆర్పై దిశా నిర్ధేశం చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అమరచింత ముందు.. ఆత్మకూర్ చివర... అమరచింత మండలంలో 37.31 శాతం పరిశీలన పూర్తయి అగ్రస్థానంలో నిలవగా.. ఊట్కూర్ 36.39, మాగనూర్ 36.08, నర్వ 35.99, కృష్ణా 34.83, మరికల్ 30.13 శాతం పూర్తయ్యాయి. మక్తల్ మండలం 28.66 శాతంతో వెనుకబడగా, ఆత్మకూర్‌లో కేవలం 19.21 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మక్తల్ మండలంలోనే 339 నో మ్యాపింగ్ కేసులు నమోదవడం గమనార్హం. అలాగే పరిశీలన శాతం కూడా 28.66 శాతానికే పరిమితం కావడంతో ప్రత్యేక దృష్టి అవసరమని అధికారులు భావిస్తున్నారు. నియోజకవర్గం ఓటర్లు పంపిణీ చేసిన డిజిటలైజ్ ధ్రువీకరించినవి నో మ్యాపింగ్ ఫారాలు చేసినవి ఓటర్లు నారాయణపేట 2,42,773 2,42,340 63,986 63,093 1,602 మక్తల్ 2,52,801 2,51,605 80,870 80,458 873 ధ్రువీకరణలో జాప్యం.. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయింది. అయితే కీలకమైన బీఎల్వోల ధ్రువీకరణ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు ఐదు లక్షల మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేసినప్పటికీ ధ్రువీకరణ సగం కూడా పూర్తికాలేదు. గడువు సమీపిస్తుండటంతో పెండింగ్ ధ్రువీకరణలు, నో మ్యాపింగ్ ఓటర్ల పరిష్కారం అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. ● మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,52,801 మంది ఓటర్లకుగాను 2,51,605 (99.53 శాతం) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బీఎల్వోలు 80,458 ఫారాలు (31.83 శాతం) మాత్రమే యాప్‌లో నమోదు చేశారు. మరోవైపు 873 నో మ్యాపింగ్ ఓటర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ధ్రువీకరణ చేయాల్సి ఉండటంతో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఇలా.. కోయిల్‌కొండ ముందంజ.. నారాయణపేట వెనుకంజ... ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియలో కోయిల్‌కొండ మండలం 36.59 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. దామరగిద్ద 31.95, ధన్వాడ 28.49, మరికల్ 21.40 శాతం పూర్తవగా.. నారాయణపేట మండలంలో కేవలం 16.15 శాతం పరిశీలన, వివరాల నమోదు పూర్తయింది. నారాయణపేట మండలంలో 707 ఫారాలు బీఎల్వోల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. 367 నో మ్యాపింగ్ ఓటర్లున్నారు. ధన్వాడలో 570 నో మ్యాపింగ్ ఓటర్లుండటంతో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రోజుకు 100 ఎంట్రీలు తప్పనిసరి.. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతి ఓటరును ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చాలని, విచారణ లేకుండా ఏ ఒక్క ఓటరు పేరును జాబితా నుంచి తొలగించొద్దని, పూర్తిస్థాయి విచారణ అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. నారాయణపేటలో.. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయింది. మొత్తం 2,42,773 మంది ఓటర్లుండగా.. 2,42,340 (99.82%) మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే వాటిలో 63,093 ఫారాలను (25.99%) బీఎల్వోలు పరిశీలించి వివరాలు యాప్‌లో నమోదు చేశారు. 1,602 నో మ్యాపింగ్ ఓటర్లుండటం అధికారులకు సవాలుగా మారింది. నిర్లక్ష్యం వద్దు.. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఎన్యూమరేషనన్ ఫారం పూరించి బీఎల్వోకు అందజేయాలి. గతంలో ఓటు వేశామనే కారణంతో నిర్లక్ష్యం చేయవద్దు. – సీహెచ్ ప్రియాంక, కలెక్టర్ -
యూనిఫాంల తయారీ వేగవంతం : కలెక్టర్
అగ్నివీరులు..! వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్ (అగ్నిపథ్)లోకి పంపించేందుకు ఫిజికల్, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్, గబ్బర్‌సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకుల ను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇ స్తూ చైతన్యం చేస్తున్నారు. సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్‌లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్‌సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్‌కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో అందేలా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఐదోవార్డు బాపూనగర్ కమ్యూనిటీ భవనంలో ఆదర్శ మహిళాశక్తి పట్టణ మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న స్కూల్ యూనిఫాంల తయారీని ఆమె సందర్శించి నాణ్యత, పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల, మైనార్టీ గురుకులాల విద్యార్థుల యూనిఫాంలు ఇక్కడే తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత పాఠశాలలకు వెంటనే పంపిణీ చేయాలని మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. సంస్థను ఏర్పాటు చేసి.. దేశ రక్షణకు యువత ముందడుగు 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం శిక్షణ ఉపయోగపడింది.. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం -
రసీదుతోనే నకిలీకి అడ్డుకట్ట
మరికల్: జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగిలో వివిధ రకాల పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. అయితే పలువురు డీలర్లు నిబంధనలను పట్టించుకోకుండా నాసిరకం విత్తనాలు, ఎరువులను ఎలాంటి రసీదులు లేకుండా రైతులకు అంటగడుతున్నారు. దీంతో వారికి పరిహారం దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే కేంద్రం కర్షకులను ఆదుకునేందుకు విత్తన చట్టాన్ని అమలు చేస్తోంది. కానీ ఎక్కడ కూడా ఇది సంక్రమంగా అమలు కావడం లేదు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు నామ్‌కేవస్తేగా తెల్ల కాగితంపై లెక్కవేసి చేతిలో పెడుతున్నారు. జిల్లాలో 200కు పైగా ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. ఒక్కో దుకాణంలో ఏటా సగటున రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వ్యాపారం సాగుతోందని అంచనా. కొందరు రైతులు నగదు, మరికొందరు ఉద్దెరపై కొనుగోలు చేస్తారు. ఈ లావాదేవీలు అత్యధికంగా రసీదు లేకుండానే సాగుతున్నాయి. నిబంధనలు తప్పనిసరి.. విత్తన విక్రయ అధీకృత డీలరు స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నిల్వ చూపాలి. విత్తనాలు కొన్న సమయంలో సంబంధిత కంపెనీ, విత్తనం పేరు, లాట్ నంబరు, ధర రసీదులో రాసి రైతులకు తప్పనిసరిగా ఇవ్వాలి. సంచులపై ఉండే రంగుల వివరాలు పట్టిక ద్వారా తెలియజేయాలి. చట్టం ఏం చెబుతుందంటే .. కేంద్ర విత్తన చట్టం ప్రకారం డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. అడిగినప్పుడు నమూనాలు, ధ్రువీకరణ పత్రాలు చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఉన్నవి మాత్రమే విక్రయించాలి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దు. అట్టి విక్రయ దుకాణాలపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రైతులు తీసుకోవాల్సినజాగ్రత్తలు.. అధీకృత డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. పంట కాలం పూర్తయ్యే వరకు రసీదులు భద్రపర్చుకోవాలి. ఏదైనా విత్తన సమస్య ఎదురైనప్పుడు వెంటనే వ్యవసాయాధికారులకు తెలియజేయాలి. విత్తనాలు మొలకెత్తకపోయినా, పురుగు మందులు పనిచేయక పంట నష్టపోతే విత్తన రసీదు ఉంటే అది ఏ కంపెనీ, ఏ బ్యాచ్ అని గుర్తించి పరిహారం పొందే వీలుంటుంది. ఒకవేళ నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోతే రసీదు ఆధారంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చు. రసీదు ఇవ్వకుంటే వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తున్నట్లు లెక్క. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి విత్తన చట్టాన్ని తుంగలో తొక్కుతున్న డీలర్లు జిల్లాలో 200కు పైగా పురుగు మందుల దుకాణాలు -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి పాఠశాలలో రూ.కోటితో నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ.25 లక్షక్షలతో నిర్మించిన బీసీ, ఎస్సీ కమ్యూనిటి హాల్స్, రూ.30 లక్షలతో నిర్మించిన మన్నూరుకాపు కమ్యూనిటీహల్ను నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో పదోతరగతి వార్షిక ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులకు పతకాలు అందజేశారు. అనంతరం బిజ్జారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభించారు. రూ. 14 లక్షలతో నిర్మించే గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు ఏర్పాటు చేసి కోస్గి బస్‌డిపో నుంచి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. నిధుల కొరత లేదని.. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలు సైతం సహకరిస్తేనే వేగంగా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, సర్జఖాన్‌పేట్ సర్పంచ్ మౌనిక, బిజ్జారం విద్యాసాగర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, నాయకులు అన్నకిష్టప్ప, అంజిలయ్య, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
గోవిందుడికే తెలియాలి!
రద్దు చేసినా.. మళ్లీ డిప్యూటేషన్ సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2019 నుంచి డిప్యూటేషన్‌పై డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా.. 2023–24 విద్యాసంవత్సరంలో అతడి వ్యవహారశైలి చూసి అప్పటి కలెక్టర్ డిప్యూటేషన్ రద్దు చేశారు. ఆ తర్వాత ఆ కలెక్టర్ బదిలీ కాగా.. కొన్ని రోజుల తర్వాత 2024–25 విద్యాసంవత్సరంలో తన పలుకుబడితో డీఈఓ కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకున్నాడు. ప్రభుత్వ కొలువులో ఉండి వేతనం తీసుకుంటూనే యథావిధిగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అన్నీ తానై చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. పైరవీలు (కేరాఫ్) డీఈఓ ఆఫీస్ డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి దందా కార్యాలయం నుంచే ‘ప్రైవేట్’ వ్యవహారాల దిద్దుబాటు పలు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణలో కీలకపాత్ర గత కలెక్టర్ రద్దు చేసినా.. మళ్లీ అదే స్థానంలోకి.. నారాయణపేట జిల్లా విద్యాశాఖపై విమర్శలు -
జూరాల.. వెలవెల
●ఏం తోచడం లేదు.. నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షా లు లేక డ్యాంకు నీరు రాలే దని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు. – సాయన్న, రైతు, ధరూరు ఆరుతడి పంటలు వేసుకోవాలి.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి. వరిపంట వేసుకుని ఇబ్బందులు పడొద్దు. కాల నుగుణంగా పంటలు సాగుచేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. – వీరప్ప, డీఏఓ, సంజీవ్ప్రసాద్ ఇరిగేషన్‌శాఖ డీఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. 10లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఆందోళనలో ఆయకట్టుదారులు.. జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి. జలకళ తప్పిన జలాశయం వర్షాకాలం మొదలైనా కనిపించని వరద గతేడాది మే చివరి నాటికే జూరాలలో జలకళ గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు గడ్డు పరిస్థితి.. జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది. జలాశయంలో 5.52 టీఎంసీలు.. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు. -
భావితరాలకు స్ఫూర్తి శివాజీ స్మృతివనం
నారాయణపేట రూరల్: ఛత్రపతి శివాజీ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు భావితరాలకు స్ఫూర్తిదాయకమని నేరెడుగాం మఠ పీఠాధిపతి సిద్ధిలింగేశ్వరస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద నిర్మించనున్న శివాజీ మహరాజ్ అశ్వారూఢ విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి భూమిపూజ గురువారం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నారాయణపేటలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు యువత ముందుకురావడం అభినందనీయమన్నారు. స్మృతివనం పూర్తయిన అనంతరం పేటకు కొత్త చారిత్రక గుర్తింపు లభిస్తుందని, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. శివాజీ పరాక్రమం, ధర్మరక్షణ, స్వరాజ్య స్ఫూర్తి భావితరాలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. లోకాయపల్లి సంస్థానం మహారాణి లక్ష్మమ్మకు శివాజీ మహరాజ్ అందించిన సహకారం చారిత్రక ప్రాధాన్యం కలిగిన అంశమని పేర్కొంటూ, ఆ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా స్మృతివనం నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల, మదన్‌మోహన్‌రెడ్డి, నందూనామాజీ, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు చేనేత ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు. -
రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
కొల్లాపూర్ రూరల్: రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని సోమశిలలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి గ్రామాలకు చెందిన రైతుల భూ సమస్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతుల సమక్షంలోనే ఒక్కో సమస్యను పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి చెందిన రైతులను విడివిడిగా పిలిపించి వారి సమస్యలను మంత్రి స్వయంగా ఆలకించారు. ప్రతి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అటవీ శాఖ నిబంధనలతో, మరికొన్ని రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో, ఇంకొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్ల వివాదాల వల్ల రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతు భూమి రైతుకు జీవనాధారం అని, అలాంటి భూములకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కాబట్టి వారిని కార్యాలయాల చుట్టూ తిరిగించుకోకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లు, పాత పట్టాలు, సర్వే నంబర్లు, హద్దులు, సరిహద్దుల వివరాలు అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పాలమూరులో రోడ్ల పరుగులు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్‌నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు.కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. హ్యామ్ రోడ్లలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు. మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరణ. బల్మూర్– నాగర్‌కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ. మేర రెండు వరుసలు. పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. పెంట్లవెల్లి ఎక్స్‌రోడ్డు నుంచి కొండూరు, తూంకుంట మీదుగా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు. చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరణ. కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్‌గా విస్తరణ వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 31కి.మీ., వరకు బీటీ రోడ్డు, ఆత్మకూర్– మరికల్ రోడ్డు 13.40 కి.మీ. విస్తరణ అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారుల విస్తరణ మహబూబ్‌నగర్– నవాబ్‌పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్‌పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్‌నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్‌పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. -
ఫారాల సేకరణలో అలసత్వం సరికాదు
నారాయణపేట: ఎన్యూమరేషన్ ఫారాల సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడ, పళ్ల జంగిడిగడ్డలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే జిల్లాకేంద్రంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ చాలా వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 పత్రాలను ఓటర్లతో పూరించి స్వీకరించాలని ఆదేశించారు. పత్రాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సూపర్వైజర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. కొందరు సూపర్వైజర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ అమరేందర్కృష్ణ, పుర మేనేజర్ అజీం, వార్డు అధికారులు ఉన్నారు. అవసరాలకు అనుగణంగా ప్రణాళికలు.. నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని గ్రామపంచాయతీల వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మక్తల్, కృష్ణా, మాగనూర్, నర్వ, మరికల్, ధన్వాడ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ నిర్వహించగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మాదిరిగానే గ్రామపంచాయతీల్లో వచ్చే మూడేళ్లలో ఏయే పనులు చేయాలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ రిసోర్స్ పర్సన్లు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి నిర్ణీత నమూనాను వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణన్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, వివిధ మండలాల ఎంపీడీఓలు ఎంపీఓలు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పూర్ణిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు htt ps://navodaya.gov.in వెబ్సైట్లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. 14న అప్రెంటిస్‌షిప్ మేళా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు (2024, 2025, 2026 విద్యా సంవత్సరం)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14న అప్రెంటిస్‌షిప్ మేళా ఉంటుందని మేళా కో–కన్వీనర్ ఎం.జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మేళాలో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఆస్పత్రులు, సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలమూరు వెంకన్నబ్రహ్మోత్సవాలు ప్రారంభం స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్సాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు. ఓట్లు తొలగించేందుకు కుట్ర : బీఆర్ఎస్ ఆత్మకూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని.. అర్హులైన వారి ఓట్లు తప్పిపోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యదీక్షతో ముందుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నివాసంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలు బీఎల్వోలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారి ఓట్లు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని.. హామీలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పుర మాజీ చైర్పర్సన్ గాయత్రి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీనివాసులు, విరేష లింగం, మాజీ వైస్ ఎంపీపీ కోటేష్, నాయకులు యుగంధర్‌రెడ్డి, మండ్ల రామకృష్ణ, రియాజ్ అలీ, అంజి, భీమన్న, పాండు, మహబూబ్‌పాషా, షరీఫ్, కర్రె శ్రీను, అనీల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,730 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,730, కనిష్టంగా రూ.2,505 ధరలు లభించాయి. అదేవిదంగా మొక్కజొన్న గరిష్టంగా రూ.2,406, కనిష్టంగా రూ.1,900, మినుములు రూ.6,600 ధరలు కేటాయించారు. గద్వాల మార్కెట్‌కు గురువారం 1,220 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్టం రూ.7,599, కనిష్టంగా రూ.4,071, సరాసరిగా రూ.6,800 ధరలు లభించాయి. -
రైతు భరోసా @ రూ.271 కోట్లు
2.02 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి నారాయణపేట: రైతు భరోసా పథకం అమలులో నారాయణపేట జిల్లా కీలక మైలురాయిని చేరుకుంది. జిల్లాలోని 251 గ్రామాల పరిధిలో 2,02,136 మంది అర్హులైన రైతులకు రూ.271.57 కోట్ల రైతు భరోసా నిధులు మంజూరు చేశారు. ఇందులో 1,88,493 మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఏఈ ఓలు నవీకరించగా వారికి సంబంధించిన రూ. 262.15 కోట్ల రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమమైంది. కాగా ఇప్పటి వరకు 1,82,199 మంది రైతులకు సంబంధించిన రూ.259.09 కోట్ల బిల్లులు ట్రెజరీకి చేరాయి. మిగిలిన వారికి సంబంధించిన ఈ కేవైసీ, బ్యాంక్ ఖాతాలో తప్పులు తదితర కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు ఏఈఓలను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మక్తల్ మండలానికి అత్యధికంగా రూ.39.44 కోట్లు 1.88 లక్షల ఖాతాల నవీకరణ 152 డీబీటీ చెల్లింపులు పెండింగ్ విడతల వారీగా చెల్లింపు -
రూ.189.91 కోట్లు జమ
జిల్లాలో 1.67 లక్షల మంది రైతులకు పెట్టుబడి సా యం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఇప్పటికే రూ.189.91 కోట్లు చెల్లించాం. మిగిలిన రైతులకు కూడా విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తాం. రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. – సక్రియా నాయక్, డీఏఓ, నారాయణపేట ●అర్హులైన రైతుల ఖాతాల్లో విడతల వారీగా రైతు భరోసా పథకం కింద నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,67,678 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.189.91 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 152 మంది రైతులకు సంబంధించిన రూ.16. 93 లక్షల డీబీటీ చెల్లింపులు విఫలం కాగా.. అత్యధికంగా నర్వ మండలంలో 23 మందికి చెందిన రూ.2.84 లక్షలు నిలిచిపోయాయి. బ్యాంకు ఖాతాల ధృవీకరణ, ఈ–కేవైసీ, ఆధార్ అనుసంధానం పూర్తిచేసుకున్న రైతులకు ప్రాధాన్యంగా చెల్లింపులు కొనసాగుతున్నాయి. మక్తల్ మండలంలో అత్యధికంగా 20,039 మంది రైతుల ఖాతాల్లో రూ.25.61 కోట్లు జమయ్యాయి. -
మెడికల్ కళాశాల సీట్ల పెంపు
పాలమూరు: పాలమూరు మెడికల్ కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసీ మంగళవారం అనుమతులు ఇచ్చింది. 2016– 17 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఆ తర్వాత ఎదిర శివారులో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల శాశ్వత భవనం నిర్మించారు. 2019లో 150 సీట్ల నుంచి 175 సీట్లకు పెంచగా ప్రస్తుతం కళాశాలలో 825 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2026– 27 నుంచే పెరిగిన సీట్లు ఏర్పాటుకు అనుమతి కల్పించారు. దీంతో పాలమూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. ● 2016 నుంచి 2026 వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆరు బ్యాచ్‌లు బయటకు వెళ్లాయి. అదేవిధంగా 34 పీజీ సీట్లు మంజూరు కాగా 34 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీఎస్సీ సైన్స్‌లో 70 సీట్లు, డీఎంఎల్టీలో 30 సీట్లు, డయాలసిస్‌లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి కళాశాల.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఏర్పాటైన పాలమూరు మెడికల్ కళాశాలలో ఒక్కో విభాగం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట జనరల్ ఆస్పత్రిలో వెనుక భాగంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహణ సాగింది. గత 11 ఏళ్ల కాలంలో మెడికల్ కళాశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా ఉస్మానియా, గాంధీ తర్వాత పాలమూరు కళాశాల మూడో స్థానంలో ఉండటం విశేషం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పాత కలెక్టరేట్ స్థానంలో గత ప్రభుత్వం వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు వసతుల కల్పన కోసం మొత్తం రూ.270 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు నాలుగు బ్లాక్‌లు పూర్తి కాగా.. ఈ–బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో 25 సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్ఎంసీ మొత్తం 200లకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వచ్చిన వాటితో పేద విద్యార్థులకు మేలు -
3 రోజులుగా ఆందోళనలు..
ఎస్ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్ఈ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని బదిలీలు చేశారని.. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆరోగ్య కారణాలు చూపడమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. -
డ్యూటీ మీట్లో నారాయణపేట పోలీసుల సత్తా
నారాయణపేట: జోగుళాంబ జోన్–7 పోలీస్ డ్యూ టీ మీట్లో నారాయణపేట జిల్లా పోలీసు అధికారు లు, సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని మరో సారి చాటిచెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ సాంకేతిక, దర్యాప్తు, ప్రత్యేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నారు. ఈ విజయాలతో నారాయణపేట జిల్లా పోలీసు శాఖ జోన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వృత్తిపరమైన శిక్షణ, అంకితభావం, సేవా తత్పరతకు నిదర్శనంగా అధికారులు, సిబ్బంది పలు విభాగాల్లో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్–క్రిమినల్ లాస్ కృష్ణా ఎస్ఐ ఎస్ఎం నవీద్ (ద్వితీయ స్థానం), ఫొటోగ్రఫీలో పీసీ సి.వెంకట్రాములు (పీఆర్ఓ) ప్రథమ స్థానం, వీడియోగ్రఫీలో పీసీ బి.నరేష్ (ప్రథమ స్థానం), ట్రాకింగ్‌లో పోలీస్ జాగిలం ‘రుద్ర’, హ్యాండ్లర్లు రవి, నరేందర్ (ద్వితీయ స్థానం), బాంబు డిస్పోజల్ టీమ్–రూం సెర్చ్‌లో డి.లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు (ప్రథమ స్థానం) బాంబు డిస్పోజల్–యాక్సిస్ కంట్రోల్లో డి.లక్ష్మీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు (ద్వితీయ స్థానం)లో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లోనూ కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది సాధించిన విజయాలు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని, పోలీసు శాఖలో ఉన్న వృత్తి నైపుణ్యం, నిరంతర శిక్షణకు ఇవి నిదర్శనమని డ్యూటీ మీట్ ఇన్చార్జి, మరికల్ సీఐ భగవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
మక్తల్: పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేమస్వామి ఆలయం వద్ద నిర్మిస్తున్న రాజగోపురం పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మత్య్సశాఖ, క్రీడల, యువజన శాఖల మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం పడమటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి రా జగోపురం నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 60 లక్షలతో పనులకు టెండర్ పూర్తైనా.. పనులు ఎందుకు ఆలస్యం అయ్యాయని ఇంజినీర్, కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో నిర్వహించే ఉత్సవాల వరకు రాజగోపురం పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల వనరులు ఉన్నాయని, అందరి తోడ్పా టు అవసరమన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రాణేశ్చారి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేశ్‌కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ నమోదులో వేగం పెంచాలి
నారాయణపేట రూరల్/మరికల్: ఓటర్ల నుంచి పూరించిన ఎన్యూమరేషన్ పత్రాలను సేకరించి, వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని చిన్నజట్రం, కొల్లంపల్లి, లింగంపల్లి, మరికల్ మండల కేంద్రంతో పాటు అప్పంపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్ల పనితీరు, జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు.. అందులో ఎన్ని పత్రాలు తిరిగి తీసుకున్నారు.. ఇంకా ఎన్ని తీసుకోవాల్సి ఉందనే వివరాలను ఆయా బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి బీఎల్ఓలకు తిరిగి ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని, ఇవ్వకపోతే జాబితాలో పేరు ఉండదు అని ఆమె స్పష్టం చేశారు. చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్ ఓట్లు తొలగించాలన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు అమరేంద్ర కృష్ణ, రాంకోటి, ఎంపీడీఓ పృథ్వీరాజ్, సిబ్బంది వెంకటప్ప, జ్యోతి, సూపర్వైజర్లు ఆంజనేయులు గౌడ్, బాలాజీ, కార్యదర్శులు సుజాత, ఎండీ ఖదీర్, విజయ్, సర్పంచులు జ్యోతి నాగేష్, మణెమ్మ బాలప్ప, భాగ్య జగన్, బిఎల్ఓలు పాల్గొన్నారు. -
పవర్ పాలిట్రిక్స్!
గద్వాల విద్యుత్ శాఖలో హైటెన్షన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వా ల జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బదిలీల లొల్లి తారస్థాయికి చేరింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక్క రోజు ముందు జిల్లా స్థాయిలో చేసిన బదిలీలు వివాదాస్పదంగా మారా యి. విద్యుత్ సంస్థలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరో వైపు ఎస్ఈ సీటు ఆరు రోజులుగా ఖాళీగా ఉండడం.. కనీసం ఇన్చార్జిగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గద్వాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి జూన్ 30వ తేదీన హైదరాబాద్‌కు బదిలీ కాగా.. ఈ నెల ఒకటో తేదీన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఎస్ఈ బదిలీ ఉత్తర్వుల కంటే కంటే ఒక రోజు ముందే డిస్పాచ్‌లతో ఇద్దరు జేఏఓలు, ఒక లైన్‌మన్, ఒక ఆర్టీజన్కు బదిలీ చేసినట్లు.. ఈ నెల 2వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆర్టీజన్ ఫీల్డ్‌లో పని చేయాల్సి ఉంటుంది. కానీ సిస్టం వర్క్ వస్తదనే కారణంతో ఎస్ఈ కార్యాలయంలో చేస్తున్నారు. తాజాగా మళ్లీ స్టోర్ రూమ్‌కు బదిలీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 6 రోజులుగా కుర్చీ ఖాళీ.. గత నెల 30న గద్వాల ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. అయన స్థానంలో వేణుగోపాల్ పదోన్నతిపై ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన జాయిన్ కాలేదు. ఈ క్రమంలో సీఈ ఇన్చార్జిగా వ్యవహరించడం ఆనవాయితీ. లేదంటే కనీసం అక్కడున్న డీఈకి తాత్కాలికంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకపోవడం.. ఆరు రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీగా ఉండడం.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పలు సమస్యలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. పట్టించుకోని సీఈ.. హైదరాబాద్‌కు ఉద్యోగులు ఎస్ఈ లేనిపక్షంలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) సర్కిల్ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. బదిలీలపై గందరగోళం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ అధికారి కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే సీఎం మీటింగ్ ఉందంటూ దాటేస్తూ సీఈ కలవలేదని సమాచారం. దీంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేసేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ అధికారే కారణమా? గద్వాల సర్కిల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న బదిలీలకు సర్కిల్లోని అకౌంట్ సెక్షన్లో ఉన్న ఓ సీనియర్ అధికారి కారణమనే చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. గతంలో గద్వాల డివిజన్ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిణి సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ఆ డివిజన్ డీఈ ఫిర్యాదు చేస్తే.. సదరు సీనియర్ అధికారి తన పలుకుబడితో ఎస్ఈ ద్వారా తన సెక్షన్‌కు బదిలీ చేయించారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన బదిలీల్లో ఆ సీనియర్ అధికారి హస్తమే ఉన్నట్లు సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారికి భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎస్ఈ ద్వారా వ్యూహాత్మకంగా బదిలీ చేయించినట్లు వినికిడి. ఇద్దరు జేఏఓలను ఒకే కార్యాలయంలో ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్‌కు మార్చడం కొసమెరుపు. ఇటీవల సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ ఒక్కరోజు ముందు తేదీతో జిల్లాస్థాయిలో నలుగురికి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు రిలీవ్ అయిన తర్వాత వెలుగులోకి.. బ్యాన్ ఉండగా చేపట్టడంపై విమర్శలు నిబంధనలకు విరుద్ధంగా వివక్షతో వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ఆగ్రహం 3 రోజులుగా ఆందోళనలతో గందరగోళం.. పట్టించుకోని సీఈ 6 రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీ.. ఇన్చార్జిని ఇవ్వకపోవడంపై అనుమానాలు -
సమష్టి కృషితోనే విజయాలు సాధ్యం
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట రూరల్: పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలు శ్రమించిన తీరును ఆదర్శంగా తీసుకొని పార్టీ శ్రేణులు సమష్టి కృషితో రాబోవు ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని, ప్రజల కష్టాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు అవకాశం లేదని.. కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్‌రెడ్డి పాలనను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిబద్ధతతో పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వెన్ను తడతాయని.. సర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు బూత్‌స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సహకరించి నిజమైన ఓటర్లను నమోదు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, లక్ష్మి, కొండయ్య, శ్రీనివాసులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు, ఐమాస్ట్ లైట్లు ప్రారంభం.. మండలంలోని బోయిన్పల్లి, అప్పక్‌పల్లి, కొల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి డబ్బులు వెచ్చించడం లేదని, కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. రైతులకు రాయితీపై ఎరువులు, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో మోదీ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ను అభినందించిన ఎంపీ.. మండలంలోని బోయిన్పల్లి సర్పంచ్ వెంకటేష్ తన గౌరవ వేతనాన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయించారు. ఆ డబ్బులతో కంప్యూటర్ కొనుగోలు చేసి డీకే అరుణ చేతులమీదుగా పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిస్వార్ధంగా సేవ చేయడం అభినందనీయమని.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. మండల అధ్యక్షురాలు జ్యోతి, మాజీ అధ్యక్షుడు సాయిబన్న, మానియమ్మ, భజరంగ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
అపార్.. అంతంతే..!
జిల్లాలో మందకొడిగా సాగుతున్న నమోదు నారాయణపేట రూరల్: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ (అటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయిస్తున్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో 2023, అక్టోబర్ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆధార్‌లోని సమాచారం, విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్‌లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు తలెత్తడంతో గతేడాది చివరి వరకు సైతం పూర్తి కాలేదు. వివిధ సమస్యలతో నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికావడం లేదన్న వాదన వినిపిస్తుంది. టాప్‌లో మరికల్.. చివరిలో గుండుమాల్... మరికల్ మండలంలో 81 శాతం అపార్ పూర్తిచేసి మొదటి స్థానంలో నిలువగా.. 67 శాతంతో గుండుమాల్ చివరి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నా.. సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ● ‘నారాయణపేట మండలం కోటకొండకు చెందిన విద్యార్థి పుట్టిన తేది యూడైస్‌లో ఒక విధంగా, ఆధార్‌లో మరో విధంగా ఉండటంతో అపార్ పునరుద్ధరణ పూర్తి కాలేదు. ● కొల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఇంటి పేరు యూడైస్‌లో ఉండగా.. ఆధార్‌లో లేకపోవడంతో వివరాలు సరిపోలక అపార్ జనరేట్ కావడం లేదు. జిల్లాలో చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది.’ ఇవీ సమస్యలు.. ముఖ్యంగా ఆధార్‌లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలో అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్న వివరాలతో సరిపోలక అపార్ జనరేట్ కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆధార్‌ను సరిచూసుకొని వారి అడ్మిషన్ రికార్డుల్లో వివరాలు సరిచేసి అపార్ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పదోతరగతి పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్‌కార్డులోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండటం.. స్థానికంగా ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు. ఇదీ పరిస్థితి.. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అపార్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఇందులోని గుర్తింపు సంఖ్య ఆధార్‌కార్డు తరహాలో శాశ్వతంగా అందుబాటులోకి ఉంటుంది. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. ఉన్నత విద్య ప్రవేశాలు, పోటీ పరీక్షలకు ఈ డిజిటల్ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. భవిష్యత్‌లో ఒరిజినల్ పత్రాలు లేవనే దిగులు లేకుండా ఈ ప్రక్రియ దోహదపడనుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న అపార్‌కు తల్లిదండ్రుల అంగీకారాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌కార్డులో పుట్టిన తేదీలు తప్పుగా నమోదుకావడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లలో 75 శాతం మాత్రమే పూర్తి ఆధార్ వివరాలు సరిపోలక తీవ్ర జాప్యం విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు కొత్త విద్యా సంవత్సరంలోనూ నామమాత్రంగా ప్రక్రియ -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతీక ప్రజావాణి.. అధికారులు బాధ్యతగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ప్రియాంకతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించాలని, పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 31 వినతులు రాగా.. అందులో చేనేతకు సంబంధించి 1, బ్యాంకు సమస్యలపై ఒకటి, భారత్‌మాల రోడ్డు సమస్యలపై 3, డీపీఓకు 2, డీఈఓకు 1, భూ సమస్యలపై 20, సర్వే కోసం ఒకటి, ఇరిగేషన్ సమస్యలపై రెండు ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరి నాట్లు వేయడానికి యూరియా, డీఏపీ కొనడానికి దుకాణానికి వెళ్లాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వాలని అడిగితే స్టాక్ లేదన్నారు. కొద్దిసేపటి తర్వాత రూ.300 ఇస్తే యూరియా ఉందన్నారు. అంతేగాక ఫలానా పురుగుమందు, విత్తనాలు కొంటేనే ఎరువులు ఇస్తామని చెప్పారు. అవసరం లేకపోయినా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. డీఏపీ బస్తాపై ప్రభుత్వ ధర రూ.1,350 ఉండగా రూ.1800 కంటే ఎక్కువ అడిగారు. రైతుల ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని కొందరు వ్యాపారులు లాభాలు చూస్తున్నారు. – వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు, భారతీయ కిసాన్‌మోర్చా జీవితమంతా కష్టపడి ఐదు ఎకరాలకుపైగా భూమి సంపాదించాం. వృద్ధాప్యంలో పిల్లలే ఆధారం అనుకొని నలుగురు కుమారుల పేర్లపై పట్టా చేశాం. ఏటా ఖర్చులకు డబ్బులిస్తామని, చూసుకుంటామని మాట ఇచ్చారు. భూమి వారి పేరున మారాక ఎవరూ పట్టించుకోవడం లేదు. తిండి కూడా సరిగా పెట్టడం లేదు. అనారోగ్యం పాలైనా.. అడిగేవారు లేరు. పట్టా చేసిన భూమిని తిరిగి మా పేరుపై మార్చాలని కలెక్టర్‌కు విన్నవించాం. – కుర్వ వెంకటయ్య దంపతులు, పాతర్చేడ్, నర్వ మండలం 15 నెలలుగా వేతనాలు లేవు.. కుటుంబాన్ని పోషించలేక విధులకు వెళ్లలేకపోతున్నాం. 2025, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల జీతం కూడా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, అప్పులు అన్నీ పెరిగాయి. చివరకు ఉద్యోగానికి వెళ్లడానికి అయ్యే బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. అందుకే జూన్ 1 నుంచి విధులకు హాజరుకాలేకపోతున్నాం. పలుమార్లు అధికారులకు సమస్య చెప్పినా పరిష్కారం కాలేదు. – 104 సిబ్బంది గతంలో మేము కలెక్టర్ దగ్గర సింగారం గ్రామపంచాయతీ పరిధి కౌరంపల్లి శివారులో ప్లాట్లు కొనుగోలు చేశాం. హద్దు రాళ్లను తొలగించడంతో ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. హైకోర్టులో కేసు నడుస్తుండగా స్టే ఆర్డర్ కూడా వచ్చింది. అయినప్పటికీ కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జిల్లా సర్వేయర్‌తో కొలిపించి సరిహద్దు రాళ్లు పాతించి ప్లాట్లను గుర్తించి అప్పగించాలి. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. -
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం
కొల్లాపూర్: జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానదీ తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజవంశస్థులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. తర్వాతి కాలంలో ఆలయాన్ని జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యధాతథంగా సాగాయి. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో తగిన గుర్తింపు లభించడం లేదు. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆదరణ లేక.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణా తీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్‌తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. చారిత్రక శాసనాలు, విగ్రహాల పరిస్థితి అంతే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. కొల్లాపూర్‌లోని ఆర్ఐడీ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో సురభి రాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోవడం లేదు. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచారు. కొన్ని చెట్ల కిందే ఉన్నాయి. అయితే వాటి విశిష్టతను తెలియజెప్పే వారు లేరు. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి -
కృష్ణమ్మా.. కరుణించుమా!
నదితీర ప్రాంతాల్లో ప్రశ్నార్థకంగా వానాకాలం వరి సాగు నారున్నా.. నాటు వేయలేని స్థితి.. వరినారు పోసి నెల గడిచింది. ఈపాటికే నాటు వేయాల్సి ఉన్నా.. నదిలో నీరు పారక వేయలేకపోతున్నా. 15 రోజులు దాటాక నాటు వేస్తే దిగుబడి తగ్గుతుంది. సరైన సమయంలో నాట్లు వేస్తేనే అధిక దిగుబడి పొందవచ్చు. – కుంబరి చంద్రప్ప, రైతు. మురహర్‌దొడ్డి ఆశలు వదులుకున్నాం.. ఈ ఏడాది వరి పంటపై ఆశలు వదులుకున్నాం. ఇదివరకే నాట్లు వేసుకోవాలి.. కానీ నీరందక వేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న నారుమడులు కూడా నీరందక ఎండిపోతున్నాయి. మరోమారు నారుపోసి నాట్లు వేసే అవకాశం ఉండదు. – దేవేంద్రప్ప, రైతు, కుసుమర్తి కృష్ణా: ఓ పక్క కృష్ణానది.. మరోపక్క పెద్ద వాగు ఉండటంతో ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా మండలం కోనసీమను తలపించేది. 15 ఏళ్లుగా కృష్ణా, భీమా నదుల నుంచి పుష్కలంగా సాగునీరు లభించి పంటల సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రస్తుతం వర్షాకాలం సగం గడిచినా ఆయా నదుల్లో నీరు పారక ఎక్కడ కూడా వరి సాగు చేపట్టకపోవడంతో పోలాలన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు నీరు లేక మూతబడుతున్నాయి. నదిలో ఉన్న నీటిని కాల్వలు తవ్వి ముందస్తుగా నారుమడులు వేసుకున్నారు. నెలలోపు నాట్లు వేయాల్సి ఉండగా.. 45 రోజులు అవుతున్నా నదిలో నీటిజాడ కనిపించపోవడంతో నారుమడులు ఎండుముఖం పడుతున్నాయి. మరోపక్క పెద్ద వాగుపై సంగంబండ ప్రాజెక్టు నిర్మించడంతో వర్షపు నీరు పారడం లేదు. గతంలో కర్ణాటకలో ఎక్కడో వర్షం కురిసినా కూడ వాగుకు పారి పొలాలకు సాగునీరు అందేది. ప్రస్తుతం ప్రాజెక్టులోనే నీరు లేకపోవడంతో దిగువకు చుక్క నీరు రావడం లేదు. వాగు తీరంలోని గ్రామాల్లో ఉన్న బోరుబావుల్లో నీరు రావడం లేదని, కనీసం నారుమడులకు కూడా అందని పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో కేవలం ఎండకాలంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం వర్షకాలంలోనూ పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సాగు సమయం దాటిపోతోందని.. సకాలంలో వరి నాట్లు వేయకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వారంలో నదిలో నీరు పారకపోతే పంటల సాగు ప్రశ్నార్థకం కానుందని అంటున్నారు. నీరు లేక వెలవెలబోతున్న కృష్ణానది మూతబడిన ఎత్తిపోతలు ఎండుతున్న నారుమడులు రెండునెలలుగా ఎదురుచూపులు ముగుస్తున్న సమయం.. ఆందోళనలో అన్నదాతలు -
ప్రైవేటుకు గడ్డుకాలమే
●ఆశించిన స్థాయిలో లేదు.. ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే.. పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్‌కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్‌సెల్ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటా రూ.10 కోట్లు.. యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి 38 ప్రైవేటు కళాశాలల్లో.. పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
బీసీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి
నూతన కార్యవర్గం ఎన్నిక.. బీసీ జాగృతిసేన నారాయణపేట నియోజకవర్గ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, ప్రధానకార్యదర్శిగా ప్రసాద్‌తోపాటు మరికొందరు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. వీరికి నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కురుమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, నాయకులు హర్షవర్ధన్, శివానంద్, ఆంజనేయులు, లాలప్ప, చందు, సంతోష్ పాల్గొన్నారు. నారాయణపేట రూరల్: వెనకబాటుకు గురవుతున్న బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ బాలుర కళాశాలకు వసతిగృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, నాణ్యమైన భోజనం, తాగునీరు అందక అనారోగ్యం బారిన పడిన ఘటనలు చాలా ఉన్నాయని వివరించారు. మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ పూర్తిస్థాయిలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు శిక్షణ, వసతి, అభ్యసన సామగ్రి అందించాలని, ప్రతి హాస్టల్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్‌గౌడ్, మధుసూదన్‌బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదుల్లో నీరు ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్డీఎస్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వార నిర్ణయించిన మేరకు సాగునీరు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద జలాల పేరుతో 2005లో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికరజలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జూరాల, భీమా–1, 2, కోయిల్‌సాగర్ పథకాలకు నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వినోద్‌కుమార్, సుభాన్, వాల్మీకి, డా.ప్రేమ్‌కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు. -
వాడీవేడిగా పుర కౌన్సిల్ సమావేశం
నారాయణపేట: స్థానిక పుర కౌన్సిల్ సమావేశం శనివారం వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య కొనసాగింది. చైర్‌పర్సనన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు, కౌన్సిల్ సమావేశాలకు మీడియా ప్రవేశం, వార్డుల అభివృద్ధికి నిధులు, పారిశుద్ధ్య సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో సమావేశం వాడివేడీగా సాగింది. చివరకు మీడియాకు అనుమతి కల్పించకపోవడం, వార్డుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు సమావేశాన్ని వాకౌట్ చేశారు. అనంతరం బీజేపీ సభ్యులతోనే చైర్‌పర్సనన్ కొండ శ్వేత అధ్యక్షతన సమావేశం కొనసాగింది. మీడియా ప్రవేశంపై తొలి నుంచే వివాదం.. సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మీడియాను కౌన్సిల్ సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమావేశంలో మీడియాకు ప్రవేశం లేదని కమిషనర్ శంకర్ స్పష్టం చేయడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే చైర్పర్సన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు వెచ్చించడాన్ని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కౌన్సిలర్లతో చర్చించకుండా బిల్లును తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజల అవసరాల కంటే చాంబర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. చెత్త తరలింపు ఆటోల మరమ్మతు, పారిశుద్ధ్య కార్మికుల సౌకర్యాల కల్పనకు నిధులు లేవంటూ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అవే నిధులతో వార్డుల్లో డ్రైనేజీలు, తాగునీటి పైప్లైనన్ లీకేజీలు తదితర సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మాటల యుద్ధం అభివృద్ధి పనులకు నిధుల్లేవు... చైర్పర్సన్ చాంబర్‌కు రూ.22 లక్షలా? మీడియాకు ప్రవేశం కల్పించాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం వాకౌట్ -
సమయానికి.. పూర్తయ్యేనా.. సర్!
● ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం ● 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ● ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఏళ్ల క్రితం వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. తిరిగి ఇవ్వడంలో జాప్యం బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలిచ్చి వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్‌గా మారింది. -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
నారాయణపేట రూరల్: పాఠశాల విద్య పూర్తిచేసి కళాశాలలకు వచ్చిన విద్యార్థులు తప్పుడు స్నేహాలతో చెడు అలవాట్లకు బానిస కావొద్దని సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వయసు చాలా సున్నితమైందని, ఎక్కువ సమయం చదువుకునేందుకు కేటాయించాలని, మిగతా సమయంలో క్రీడలు, సాంస్కృతిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. ర్యాగింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అవకాశం లేకుండా అధ్యాపకులు బోధించే విషయాలపై శ్రద్ధ చూపాలని కోరారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతారని, అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుశిక్ష ఉంటుందని, దీంతో జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే వెంటనే కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఈఓ సుదర్శన్‌రావు, న్యాయవాది లక్ష్మీపతిగౌడ్, అధ్యాపకులు రఘువీర్, దత్తాత్రేయ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. బాలసదనం, వృద్ధాశ్రమం తనిఖీ.. నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ శనివారం పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి, ఆహారం, రికార్డుల నిర్వహణ, హాజరుపట్టికలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంతమంది వృద్ధులు, చిన్నారులు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం సిద్ధం చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. కార్యాలయ ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు చేపడుతున్నారా, సంబంధిత వ్యక్తులకే పిల్లలు, వృద్దులను అప్పగిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్యం, అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
10న తేజస్ స్టార్టప్ వర్క్‌షాప్
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 10న తేజస్ స్టార్టప్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.రామలింగేశ్వర్‌గౌడ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ పరిశ్రమలశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కొనసాగే వర్క్‌షాప్‌ను యువత, విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్క్‌షాప్‌లో స్టార్టప్ ఏర్పాటు విధానం, వ్యాపార ఆలోచనల పరిశీలన (ఐడియా వ్యాలిడేషన్), మెంటర్షిప్, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, నిధుల సమీకరణ (ఫండింగ్), నెట్వర్కింగ్ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు గూగుల్ ఫాంలో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 62819 94436 సంప్రదించాలని సూచించారు. -
దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం
నారాయణపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల భూమి, భుక్తి, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన త్యాగం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని, యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాజేందర్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కొణిజేటి రోశయ్యకు నివాళి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోశయ్యకు ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉందని, పరిపాలనలో చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ ఖలీల్, డిప్యూటీ కలెక్టర్ రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ నష్ట పరిహారం పెంచాలి
కోస్గి రూరల్: నారాయణపేట రేడియల్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని ఆర్డీఓ రమేష్‌ను పలువురు రైతులు కోరారు. శనివారం మండలంలోని తోగాపూర్ ఆంజనేయస్వామి ఆలయం, నాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో భూ సేకరణ నాలుగో గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. తోగాపూర్‌లో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, నాచారం గ్రామంలో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాల భూమి కోల్పోతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉన్న కాస్త భూమిని కోల్పోతున్నామని, భూమికి బదులు భూమి ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన ఆయన అలా ఇవ్వడం కుదరదని తేల్చి తెలిపారు. రైతులు ఇచ్చిన అనుమతి పత్రాల మేరకు నష్టపరిహారం పెంపు విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డీటీ బాలరాజు, ఆర్ఐ సుభాష్, సీనియర్ అసిస్టెంట్ భీమమ్మ, సర్పంచ్‌లు రేణుకు, శ్రీనివాస్, జీపీఓలు సత్యనారాయణ, అంజప్ప పాల్గొన్నారు. -
వందనాలు ‘మిడ్జిల్’..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్‌రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 150 మంది ఆత్మీయులతో భేటీ.. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రయాణంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ‘పాలమూరులోని నల్లమలలో పుట్టిన ఈ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిని అయ్యానంటే మీ ఆశీర్వాద ఫలితమే. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం దక్కింది. ఈ నేల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అంటూ ఉమ్మడి పాలమూరులో పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆయన వెల్లడించారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడిన మిడ్జిల్‌లో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనతో కలిసి తిరిగిన ఆనాటి పెద్దలు, నాయకులు, అనుచరులతో ఊర్కొండ ఆలయ ఆవరణలో మమేకం కానున్నారు. ఈ మేరకు మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లోని 150 మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఒక్కో టేబుల్ దగ్గర ఐదుగురు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలానికి వస్తుండడంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలోని కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు ఊర్కొండ ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. నేడు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన ఊర్కొండపేటలోని హనుమాన్ ఆలయంలో పూజలు ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ -
అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు
ఆత్మకూర్/నర్వ: సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, మక్తల్ నియోజకవర్గ ఈఆర్ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్ పురపాలికలోని ఖానాపూర్‌లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్ తహసీల్దార్ జేకే మోహన్, సూపర్వైజర్ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత తదితరులు ఉన్నారు. -
విత్తన రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. మండలంలోని జాజాపూర్ రైతువేదికలో మహిళా రైతులు శంకరమ్మ, సాయమ్మ, కళావతితో పాటు మరికొందరు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకంలో భాగంగా మండలానికి నూజివీడు, ప్రవర్ధన్, రాశి కంపెనీలకు చెందిన 800 విత్తన ప్యాకెట్లు వచ్చాయని.. ప్యాకెట్ ధర రూ.901 ఉండగా, రాయితీ రూ.900 పోను రైతు రూపాయి మాత్రమే చెల్లించాలన్నారు. పథకంలో బయో ఫెర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్, న్యూట్రియన్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకం ఐదేళ్ల వరకు అ మలులో ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసా య విస్తరణ అధికారులు ప్రకాష్, అనిల్‌కుమార్, రాజేష్, అంజమ్మ, తార, రైతులు, నాయకులు పాల్గొన్నారు. వేద సాగు పద్ధతి పాటించాలి.. మరికల్: రైతులు వేద సాగు పద్ధతిని అవలంబించడంతో విత్తనాల వినియోగం తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక రైతువేదికలో జాతీయ ఆహార భద్రత పథకం కింద ఆర్ఎన్ఆర్ రకం వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేద సాగు విధానంతో రైతులకు నీటి ఆదా, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నయ్య, ఏఓ రహమాన్, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, ఏఈఓ పరశురాం, ఆనంద్, హర్షవర్ధన్‌రెడ్డి, హరీశ్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
బాల్యానికి భరోసా..
జిల్లాలో ప్రారంభమైన 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ ● బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకే.. ● నెలరోజుల పాటు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు ● మూడురోజుల్లో 9 మంది చిన్నారుల చేరదీత నర్వ: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్నిశాఖల సమన్వయంతో ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండునెలల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలకార్మికుల విముక్తికి కృషి చేస్తోంది. ఈ కొత్త ఏడాది జనవరిలో జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించి 71 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడంతో పాటు 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రారంభించి ఇప్పటికే 9 మంది బాలబాలికలకు విముక్తి కల్పించారు. గతేడాది కంటే ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగించేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీసు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. పలుశాఖల సమన్వయంతో.. పోలీసు, కార్మిక, విద్య, సీ్త్ర, శిశుసంక్షేమశాఖ, చైల్డ్‌లైన్, సఖి, బాలరక్షక భవన్ సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు పనులు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. వారిని చేరదీసి ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. వీరితో పాటు తప్పిపోయిన పిల్లలు, అనాథలను గుర్తించి ఆయా కేంద్రాల్లో చేర్పిస్తారు. పిల్లలతో బలవంతంగా పనులు చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ‘బడికి వెళ్లాల్సిన వయస్సు, ఆటలాడుకోవాల్సిన ప్రాయం వారిది.. కాని తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తున్నారు. పాఠశాలల్లో పాఠాలు వినాల్సిన వీరు ఇటుక బట్టీలు, పొలాల్లో కూలీ పనులు, గొర్రెలకాపరులుగా, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులు, వ్యాపారస్తులు పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చదువుకునే వయసులో పనులు చేస్తూ బాలకార్మికులుగా మారుతున్నారు.’ బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా దాడులు నిర్వహిస్తాం. బాలలను చేరదీసి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. బాలకార్మికుల సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – డా. వినీత్, ఎస్పీ కేసులు నమోదు చేస్తాం.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం మూడు రోజులుగా దాడులు ముమ్మరం చేస్తున్నాం. అనాథ బాలలు, బిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన పిల్లలను చేరదీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంతోపాటు వివిధ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇతర పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం. – బాసిత్, కార్మికశాఖ జిల్లా అధికారి -
వేతనాల సంబురం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్‌లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్‌టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్‌సోర్సింగ్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్‌లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. ● పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. 1వ తేదీనే చెల్లింపులు.. పీయూలో గతం నుంచే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, గార్డెనింగ్ తదితర సిబ్బందికి ఏజెన్సీల నుంచి వేతనాలు అందిస్తున్నారు. ప్రభుత్వం గతనెల రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారికి తప్పకుండా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సూచించడంతో పీయూ అధికారులు సైతం అలాగే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ రమేష్‌బాబు చెప్పారు. కాగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్లు, లైబ్రేరియన్, అసిస్టెంట్ ఇంజినీర్, టైపిస్ట్ కం క్లర్క్, వీసీ పీఏ, రిజిస్ట్రార్ పీఏ, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్స్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్, గేమ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సూపర్వైజర్, ప్లంబర్లకు రూ.19,500 ఉండాలి. హౌస్‌కీపింగ్ శానిటేషన్, హెల్పర్స్, గార్డెనింగ్, స్కావెంజర్, కేర్ టేకర్, కుక్, సెక్యూరిటీ గార్డు, బుక్ కీపర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేటర్, ల్యాబ్ అటెండర్లకు రూ.15,600 ఇవ్వాల్సి ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్‌కు రూ.22,500 వేతనం ఇస్తున్నారు. ఎట్టకేలకు పీయూ నాన్‌టీచింగ్ సిబ్బందికి జీతాల పెంపు ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు వేతనాలు పెంచాం. గత కొన్నేళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన సిబ్బందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. జీఓ ఆధారంగా క్యాడర్ల వారిగా వేతనాలు పెరిగాయి. దీంతో యూనివర్సిటీలో పనిచేస్తున్న చాలామంది మెజార్టీ సిబ్బందికి న్యాయం జరుగుతుంది. సిబ్బంది ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ -
నేరాల ఛేదనలో జాగిలాలదే కీలక పాత్ర
నారాయణపేట: నేరాల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసు జాగిలాల నిర్వహణపై ఎస్పీ డా. వినీత్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకేంద్రంలోని పత్తిబజార్‌లో ఉన్న జిల్లా పోలీస్ డాగ్ కెన్నెల్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కెన్నెల్‌లో ఉన్న రూప (ఎక్స్‌ప్లోజివ్), రుద్ర (ట్రాకర్), విక్కీ (నార్కోటిక్స్), లక్కీ (ఎక్స్‌ప్లోజివ్) ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాల ఆరోగ్య పరిస్థితి, ఆహార నిర్వహణ, వసతి, పరిశుభ్రత, శిక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. ఆరోగ్యం, శిక్షణ, శుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనలో నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్‌లను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి జాగిలం వద్ద దాని పేరు, ప్రత్యేక నైపుణ్యం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సాధించిన విజయాలు, అవార్డులు, సేవల వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ జాగిలాలు శాఖకు అమూల్యమైన ఆస్తి అని పేర్కొన్నారు. హత్యలు, దొంగతనాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, నార్కోటిక్స్ కేసులు, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ గుర్తింపు వంటి క్లిష్టమైన కేసుల్లో జాగిలాలు నేరాల ఛేదనను వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. జాగిలాలకు రోజూ నిర్దేశిత డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు, సమయానికి వైద్య పరీక్షలు, అవసరమైన టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ డాగ్ కెన్నెల్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఆర్ ఎస్సై శివశంకర్ తదితరులు ఉన్నారు. -
లక్ష్య సాధనలో జాప్యానికి తావులేదు
● గుడిసెల సర్వే పకడ్బందీగా చేపట్టాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని.. జాప్యానికి తావు లేదని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్, డీఆర్డీఏ (సెర్ఫ్), పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్లు, వీఓ భవనాల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలన్నారు. 767 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, లబ్ధిదారులు చేపట్టకపోవడానికి గల కారణాలను రాతపూర్వకంగా తీసుకొని అవసరమైతే అర్హత రద్దు చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హౌసింగ్ ఏఈలకు అప్పగించిన లక్ష్యాలను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుడిసెల లెక్కింపు సర్వే త్వరగా పూర్తి చేయాలని.. గుడిసెల్లో జీవించే వారినే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించాలని చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖపై సమీక్షిస్తూ జిల్లాకు గతంలో మంజూరైన 39 వీఓ భవనాల్లో ఒక్కటి కూడా పూర్తిగాకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా మరో 180 వీఓ భవనాలు మంజూరైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో నిర్మాణాలు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో స్థల సేకరణ పూర్తిచేసి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నిధుల మంజూరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అధికారులకు భరోసా ఇచ్చారు. మహిళా సంఘాలకు మంజూరైన గిడ్డంగుల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఉపాధి కూలీల సంఖ్య పెంచి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, బ్యాంకు లింకేజీలు, శ్రీనిధి రికవరీలు, సూక్ష్మ వ్యాపారాలు, పాఠశాల యూనిఫాం కుట్టు పనులు, కిశోర బాలికల సంఘాలు, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై కూడా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఇన్చార్జ్ డీఎల్పీఓ ఉదయ్‌కుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పీఆర్ ఏఈలు, డీపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు. -
ఎగువన కొత్త పథకాలు..
తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్‌పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్‌వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. -
సువర్ణావకాశం!
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● చదువుకు దూరమైన వారికి ప్రయోజనం ● జిల్లాలో 17 అధ్యయన కేంద్రాలు ● ప్రారంభమైన ప్రవేశాలు.. ఆగస్టు 29 వరకు గడువు –8లో uచదువు మధ్యలో మానేసిన ప్రతి విద్యార్థిని సా ర్వత్రిక పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే నిరక్షరాస్యులను గుర్తించాం. అందరి సహకారంతో నిరక్షరాస్యులైన వయోజనులకు టెన్త్ పరీక్షలు రాయించేందుకు కృషి చేస్తున్నాం. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటి వద్దే ఉండి సెలవులో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. – శ్రీనివాస్, టాస్ కోఆర్డినేటర్, నారాయణపేట నారాయణపేట రూరల్: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదో తరగతి, ఇంటర్ విద్య అభ్యసించే అవకాశం కల్పించింది. 2008 నుంచి పదో తరగతి, 2009 నుంచి ఇంటర్లో అడ్మిషన్లు కల్పిస్తుండటంతో ఎంతో మంది ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకొని ఉపాధి మార్గాలు పొందుతున్నా రు. వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి వేదికగా నిలుస్తోంది. ఎంతో ప్రయోజనకరం.. విద్యార్హత లేక ఎంతో మంది ఉపాధికి నోచుకోకపోవడంతో పాటు ఉద్యోగాలు సాధించిన వారు పదోన్నతికి దూరమవుతున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పూర్తిచేసి.. ఆ తర్వాత డిగ్రీ, పీజీ సైతం చేసేందుకు ఆస్కారం ఉంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు పదోన్నతులు సైతం పొందవచ్చు. ఇందులో చదువుకునే అభ్యాసకులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఆదివారం, రెండవ శనివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో 30 రోజులకు మించకుండా తరగతులు ఉంటాయి. రెగ్యులర్ విద్యతో సమానమైన బోధన లభిస్తుంది. జిల్లాలో వందలాది మంది రెగ్యులర్ విద్య కంటే సార్వత్రిక విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆగస్టు 29 వరకు గడువు.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల కోసం జూన్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 28 వరకు అపరాధ రుసుం లేకుండా, ఆగస్టు 29 వరకు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాల్లో రూ.150 చెల్లించి, సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెన్త్‌కు రూ. 1,400, ఇంటర్‌కు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఫీజులో రూ. 300 రాయితీ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో అందజేస్తే సీటు కేటాయిస్తారు. -
ఎఫ్ఆర్ఎస్ హాజరుపై నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు విషయంలో నిర్లక్ష్యం వీడాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ పాఠశాలలో బుధవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అవకాశం మేరకు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. విద్యార్థుల నమోదుకు సంబంధించి యూడైస్ ప్లస్‌లో పూర్తిగా వెనకబడి ఉందని.. వారం రోజుల్లో పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్యానెల్ తనిఖీ బృందాల నియామకంలో ఆలస్యం లేకుండా వెంటనే పూర్తిచేసి.. పాఠశాలలకు పంపించాలన్నారు. భవిత కేంద్రాల్లోని పిల్లల సమగ్ర అభివృద్ధికి అడుగులు పడాలన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన టీచర్లు, ఆయాల నియామకం ప్రక్రియను త్వరగా పూర్తిచేసి.. అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచాలని తెలిపారు. నియామకాలపై ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేయాలన్నారు. కాగా, మోడల్ స్కూల్ ప్రవేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. కేజీబీవీ కళాశాలలో సీట్ల భర్తీని వేగవంతం చేయాలన్నారు. అనంతరం కోటకొండకు నూతనంగా మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతి ఏర్పాట్లను ఆర్జేడీ పరిశీలించారు. డ్రోన్ ద్వారా వీడియోలు, సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. కాగా, తొలిసారిగా నారాయణపేటకు వచ్చిన ఆర్జేడీని జిల్లా విద్యాశాఖ తరఫున శాలువాతో సత్కరించారు. జిల్లాలో టీచర్ల కొరత కారణంగా విద్యార్థులు నష్టం వాటిల్లుతుందని.. తాత్కాలికంగా వలంటీర్లను నియమించాలని తపస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, శ్రీనివాస్, తపస్ నాయకులు షేర్ కృష్ణారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎస్పీ
నారాయణపేట: జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యా ప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి.. బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయ న ఆదేశించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల్లో రాజీ పడొద్దని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని.. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి.. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించాలని చెప్పారు. పోలీస్స్టేషన్లలో సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ.. రోజూ రోల్‌కాల్ నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలపై విస్తృత ప్రచా రం నిర్వహించడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నిరంతరం పర్యవేక్షించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజుల్ హక్, డీఎస్పీలు మహేశ్, లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, భగవంత్‌రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ శ్యాంసుందర్ రాజు ఉన్నారు. -
రాజోళి ‘బండ’..!
ప్రశ్నార్థకంగా ఆర్డీఎస్ భవితవ్యం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ.. ఈ మూడు రాష్ట్రాలతో ముడిపడిన రాజోళి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తుంగభద్రపై నిర్మించిన ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోగా.. ప్రస్తు తం దీని భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ని జాం కాలం నాటి ఈ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఆనకట్ట, కాల్వలు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఈ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలోని నడిగడ్డ రైతులకు శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రాజెక్ట్ నేపథ్యం.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి తాలుకాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ 1958లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 143 కిలోమీటర్ల పొడవున (కర్ణాటకలో 43 కి.మీ.లు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 100 కి.మీ.లు) కాల్వ నిర్మించారు. ఆర్డీఎస్కు మొత్తం 17.1 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో కర్ణాటకకు 1.2 టీఎంసీలు.. తెలంగాణకు 15.9 టీఎంసీలు. తుంగభద్ర నది నుంచి 10 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 7.1 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంది. ఒకటి నుంచి 12 డిస్ట్రిబ్యూటరీలు కర్ణాటకలో.. 13 నుంచి 42 వరకు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట పొడవు 850 మీటర్లు. తెలంగాణకు వచ్చే కాల్వ ఎడమవైపు ఉండగా.. కుడి వైపున ఏపీ సరిహద్దు ఉంటుంది. 2006లో ఆధునికీకరణ ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఏళ్ల తరబడి ఏపీ, తెలంగాణ రైతుల మధ్య వివాదం కొనసాగింది. 2001లో ఇరు ప్రాంతాల రైతులు దాడులకు దిగడంతో ఆర్టీఎస్ శాశ్వత పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టా రు. ఆనకట్ట వద్ద వివాదాలకు కారణంగా ఉన్న స్లూయిస్‌ను మూసివేయించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆర్టీఎస్ ఆధునికీకరణకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటకకు అందజేశారు. అయితే నాలుగు ప్యాకేజీల్లో నూ అరకొర పనులు చేసి అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకోగా..ఆ తర్వాత ఆధునికీకరణ అటకెక్కింది. ఏడు దశాబ్దాల క్రితం గచ్చుతో నిర్మించిన ఆర్టీఎస్ ఆనకట్ట బలహీనపడింది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో ఇసుక, బురద పేరుకుపోయింది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ తెలంగాణలోని సింధనూరు నుంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడి నుంచి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. 45 వేల ఎకరాలకే సాగు నీరు ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87, 500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. 45 వేల ఎకరాలకే అందుతోంది. యాసంగిలో నీళ్లు రా క క్రాప్ హాలిడే ప్రకటించడం ఏటా పరిపాటిగా మా రింది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టింది. 2018లో నీటి పంపింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండగా.. 5.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క మోటారు ద్వారానే వ రద వచ్చినప్పుడు తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూటరీ 23, 24 నుంచి డిస్టిబ్యూటరీ 35 వరకు తడులు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఆ తర్వాత నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ 40 వరకు నీరందడం లేదు. దీనికింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతీగతి లేదు. అటకెక్కిన ఆధునికీకరణ.. అధ్వానంగా ఆనకట్ట, కాల్వలు కర్ణాటకలో మోటార్లతో యథేచ్ఛగా నీటి చౌర్యం జల విద్యుత్ ప్రాజెక్ట్‌లకు విచ్చలవిడిగా నీటి వినియోగం అక్రమంగా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నడిగడ్డకు పొంచి ఉన్న ముప్పు.. రైతుల్లో ఆందోళన ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా జరిగే పనులను సాకుగా చూపి రైతులను మభ్యపెట్టొద్దు. కర్ణాటకలో జరుగుతున్న కొ న్ని ప్యాకేజీ పనులు ఇప్ప ట్లో పూర్తి అయ్యేలా లేవు. దాని కోసం ఎదురుచూడటం వృథా. ప్రస్తుతం వర్షాలు లేకపోయినప్పటికీ, తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా విడుదల అవుతున్న నీటితో ఆయకట్టుకు జీవం ఉంది. రిజర్వాయర్ నిర్మించి ఉంటే నీటి నిల్వ ఉంచుకుని మరో నెలరోజులు పాటు అందించుకునేవాళ్లం. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ -
పంటల మార్పిడిపై అవగాహన కల్పించండి
● ఏఓలు, ఏఈఓల పనితీరులో మార్పు రావాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట:జిల్లాలో పంటల మార్పి డిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. ఈ ప్రక్రియలో ఏఈఓలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ వార్షిక కార్యాచరణపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రైతులు సాగుకు సిద్ధమయ్యే దశలోనే పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. అదే విధంగా భూసార పరీక్షల నిమిత్తం మట్టి నమూనాల సేకరణ, ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఏఓలు, ఏఈఓల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీఏఓను ఆదేశించిన కలెక్టర్.. ఇకపై వారి హాజరు, క్షేత్ర పర్యటనలు, పనితీరుపై నెలకోసారి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పనితీరులో మార్పు కనిపించని అధికారుల నుంచి సంజాయిషీ కోరాలని స్పష్టంచేశారు. ఆయిల్‌పామ్ సాగు కేవలం ఉద్యానశాఖ బాధ్యత మాత్రమే కాదని.. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉద్యానశాఖతో సమన్వయం చేసుకుని జిల్లా లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం సాయిల్ హెల్త్ కార్డుల నవీకరణ పురోగతిని అధికారులతో తెలుసుకున్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయ క్, ఏడీఏ నగేశ్‌కుమార్ ఉన్నారు. వందశాతం ఫలితాలు సాధించాలి.. నర్వ: యాస్పిరేషన్ బ్లాక్‌లో సూచికల ప్రకారం వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక అన్నారు. నర్వ మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు రూపొందించిన రిమోట్ ఎలక్ట్రికల్ కారు, త్రీడి ప్రింటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రదర్శనలను ఆమె తిలకించారు. విద్యార్థులు కలెక్టర్ పేరును త్రీడి ప్రింటర్‌తో ముద్రించి బహుమతిగా అందించగా.. అభినందనలు తెలిపారు. అనంతరం రాయికోడ్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అదే విధంగా కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, యాస్పిరేషన్ బ్లాక్ కోఆర్డినేటర్ బాలాజీ, సర్పంచులు హన్మంతురెడ్డి, లింగమ్మ, శశికళ ఉన్నారు. -
గుడిసెల సర్వే పరిశీలించిన విజిలెన్స్
మద్దూరు(కోస్గి):ఇందిరమ్మ ఇళ్ల పథకం అమ లులో భాగంగా మద్దూరు మండలం ఖాజిపూర్లో చేపట్టిన గుడిసెల సర్వేను బుధవారం రాష్ట్ర విజిలెన్స్ బృందం పరిశీలించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికచేసే లబ్ధిదారుల గుడిసెలను ఈఈ బలరాం, పీడీ శంకర్, డీవైఈఈ హరికృష్ణ సందర్శించి.. గుర్తించిన లబ్ధిదారుల నివాస పరిస్థితులు, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఏఈ శాంతకుమార్, ఎంపీడీఓ భార్గవరాం, పంచాయతీ కార్యదర్శి షాజిల్, సర్పంచ్ సాయప్ప ఉన్నారు. మీటర్ రీడింగ్ సులభతరం నారాయణపేట: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్) మీటర్ రీడింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నూతన విధానంపై స్పాట్ బిల్లర్లు, మీటర్ రీడర్లకు డీఈటీ రాజునాయక్, ఏఈ మహేశ్‌గౌడ్ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందుగా డేటా డౌన్లోడ్ చేసిన తర్వాత కొత్త ఆప్షన్లో ఈఆర్ఓ కోడ్ నమోదు చేయాలన్నారు. అనంతరం సెక్షన్ కోడ్, స్ట్రక్చర్ కోడ్, డీటీఆర్ కోడ్లను ఎంట్రీ చేయడం ద్వారా ఫీడర్ మ్యాపింగ్, స్ట్రక్చర్ మ్యాపింగ్ పూర్తవుతాయని తెలిపారు. అనంతరం యాప్‌లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా వినియోగదారుల తాజా ఫోన్ నంబర్లను నమోదుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంతో బిల్లుల పెండింగ్ బకాయిల సమాచారం నేరుగా వినియోగదారుల ఫోన్లకు చేరడంతో పాటు బిల్లుల వసూళ్లు వేగవంతం అవుతాయని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి పొందాలని సూచించారు. జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ప్రోత్సాహానికి పడిగాపులు
జిల్లాలో రూ.115.86 కోట్ల వరి బోనస్ పెండింగ్ ● రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు ● గతేడాది 1.40 లక్షల మె.ట. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు ● ఈ ఏడాది 90,859 మెట్రిక్ టన్నులు –8లో uగతేడాది యాసంగిలో సన్నరకం వరి ధాన్యం విక్రయించగా రూ.20 వేల బోనస్ రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా యాసంగి ధాన్యానికి మరో రూ.25 వేల బోనస్ మొత్తం కలిపి రూ.45 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు. వెంటనే చెల్లించి ఆదుకోవాలి. – నర్సింహులు, రైతు, మరికల్ బోనస్ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రైతులు ఆందోళన చెందొద్దు. రెండేళ్లకు సంబంధించిన బోనస్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – బాలరాజు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నారాయణపేట: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నమ్మి రెండేళ్లుగా యాసంగిలో సైతం రైతులు సాగు చేసి విక్రయించారు. 2025 యాసంగిలో రూ.460 కోట్లు, 2026 యాసంగి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినా బోనస్ మాత్రం నేటికీ చెల్లించడం లేదు. గతేడాది యాసంగికి రూ.70.44 కోట్లు, ఈ ఏడాది యాసంగికి రూ.45.42 కోట్లు మొత్తం రూ.115.86 కోట్ల బోనస్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు చెల్లిస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో.. ఈ ఏడాది యాసంగిలోనూ జిల్లా రైతులు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. సన్నరకం 1,81,998 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 62,815 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసింది. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 22,769 మంది రైతుల నుంచి 1,53,076 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. అందులో 62,216 మె.ట. దొడ్డు రకం, 90,859 మె.ట. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 2026 యాసంగి సన్నరకం వరిధాన్యానికి సంబంధించి రూ.45.42 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతోనే రైతులకు బోనస్ చెల్లింపుల్లో ఆలస్యమవుతోందనేది బహిరంగ రహస్యమే. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతోంది. పంటల సాగు కోసం పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బోనస్ బ్యాంకు ఖాతాలో జమకాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కేశవరెడ్డి. మాగనూర్ మండలం వర్కూర్ గ్రామం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పడంతోనే సాగు చేశా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయి.. కాని బోనస్ మాత్రం నేటికీ జమ కావడం లేదు. రెండేళ్ల బకాయిలు రూ.1.72 లక్షలు రావాల్సి ఉంది. ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే అప్పులు కొంతైనా తీరేవి. -
అంకితభావంతో వైద్యసేవలు అందించాలి
మరికల్: ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు అంకితభావంతో వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. రవీందర్‌నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తీలేరులో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, మరికల్ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్స్‌పోలియో కార్య క్రమ అమలు, ఇంటింటి సర్వే, సీజనల్ వ్యాఽ దుల నివారణకు చేపట్టిన చర్యలను వైద్యుల తో ఆరా తీశారు. అలాగే మరికల్ పీహెచ్సీలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ, ప్రసూతి గది, ప్రయోగశాలతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులు అందుబాటులో ఉండి రోజులకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. మరికల్ పీహెచ్సీలో రోగులకు అందు తున్న వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేసి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్దప్ప, ప్రోగ్రామ్ అధికారి సాయి రాం, డా. రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్‌లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. నారాయణపేట 11 వనపర్తి 3 మహబూబ్‌నగర్ 8 జడ్చర్ల 8 నాగర్‌కర్నూల్ 17 కల్వకుర్తి 18 గద్వాల 9 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
ఆధునిక హంగులతో స్టేడియం నిర్మాణం
నారాయణపేట (మక్తల్): మక్తల్‌లో రూ.25 కోట్లతో ఆధునిక వసతులతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఇన్డోర్, ఔట్‌డోర్ పనులకు సంబంధించి పలు మార్పుచేర్పులు చేయించాలని అధికారులను ఆదేశించారు. పురుషులు, మహిళా క్రీడాకారులకు వేర్వేరు గదులు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కళాశాల భవనం పెచ్చులూడి విద్యార్థులపై పడి గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి ఇతర భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 16 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించి నాణ్యత పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో వంతెనల నిర్మాణానికి రూ.50 కోట్లకుపైగా మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామాలు అభివృద్ధి దిశలో పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కట్ట సురేష్, హన్మంతు, డీవైఎస్ఓ వెంకటేష్, ఉపేందర్ పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం
నారాయణపేట: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం నుంచి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లలోపు చిన్నారులతో పనులు చేయించడం చట్టవిరుద్ధ మని స్పష్టం చేశారు. బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే నేరాన్ని పునరావృతం చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం పిల్లలను పనులకు పంపించి వారి భవిష్యత్‌ను దెబ్బ తీయవద్దని తల్లిదండ్రులను కోరారు. చదువు మాన్పించి పిల్లలను పనులకు పంపుతున్న తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు, బలవంతంగా పని చేయిస్తున్న చిన్నారులు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, ఆశ్రయం అవసరమైన బాలలు లేదా తప్పిపోయిన వీధి బాలలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, ఆపరేషన్ ముస్కాన్ బృందం ఎస్ఐ బాలరాజు, డా. లక్ష్మీకాంత్, డీసీపీఓ కరిష్మా, ఎన్జీఓ ప్రతినిధి నరేష్, లేబర్ ఆఫీసర్ బాసిత్, ఎంఈఓ బాలాజీ, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి నర్సింహ, సోషల్ వర్కర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన చేనేత ఉత్పత్తులపై దృష్టి
నారాయణపేట: మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్లో సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్సలెన్‌న్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పురోగతిపై జరిగిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. వీవర్లు, మాస్టర్ వీవర్లు ఎదుర్కొంటున్న ముడి సరుకుల కొరత, మార్కెటింగ్ సమస్యలు, ఉపాధి అవకాశాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తుల విక్రయాలను విస్తరించేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి హ్యాండ్లూమ్ ఎక్స్‌పోలు, ప్రదర్శనలు, ఇతర మార్కెటింగ్ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీవర్ల సమస్యలను కలెక్టర్ శ్రద్ధగా విని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు హ్యాండ్లూమ్ డైరెక్టర్ ద్వారక, జిల్లా హ్యాండ్లూమ్ అధికారి రాజేష్, డీఆర్డీఓ వెంకట్రాములు తదితరులు ప్రభుత్వ పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాలపై వీవర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో చేనేతశాఖ అధికారులు, వీవర్లు, మాస్టర్ వీవర్లు తదితరులు పాల్గొన్నారు. ఊట్కూర్: మండలంలోని నిడుగుర్తి రైతువేధికలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక రైతులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, సర్పంచ్ రాములు, ఏఓ గణేశ్‌రెడ్డి, ఏఏఓ ప్రశాంతి, తిప్రాస్‌పల్లి, బాపూర్, పెద్దజట్రం, లక్ష్మీపల్లి, మొగ్దుంపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు
నారాయణపేట: బాలసదనం, వృద్ధాశ్రమాల్లో ఉన్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జూని యర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్ సూ చించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బారంబావి ప్రాంతంలో ఉన్న బాలసదనం,వృద్ధాశ్రమా న్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించి వృద్ధులు, చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న సౌక ర్యాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా పరిశీలించి రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం తయారు చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి ఆదేశించారు. కార్యాలయ ఆదేశాల మేరకే ప్రవేశాలు జరుగుతున్నాయా.. సంబంధిత వ్యక్తులకే చిన్నారులు, వృద్ధులను అప్పగిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. మందులు, టాబ్లెట్లు, సిరప్‌ల గడువు తేదీలను పరిశీలించి గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సూచించారు. అనంతరం వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, ఇతర అవసరాలను తెలుసుకున్నారు. బిస్కెట్లు పంపిణీ చేసి బంధువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెడ్రూమ్లు, వాష్‌రూమ్‌లు ఎల్లప్పు డూ శుభ్రంగా ఉంచాలని, లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. -
విత్తనశుద్ధితో తెగుళ్ల నివారణ
మరికల్: విత్తనశుద్ధితో పంటలకు తెగుళ్ల శాతం తగ్గించవచ్చని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయ్‌శంకర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విత్తనశుద్ధి, సురక్షిత పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో, పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం విత్తనశుద్ధి చేయడం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ విధానంతో నేల ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం, రైతులు పాల్గొన్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి కొత్తపల్లి: బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కొత్తపల్లి, మద్దూరులో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్టాడారు. బీఎల్వోలు ఐదురోజులుగా ప్రతి ఇల్లూ తిరుగుతూ ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారని.. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని నమోదు చేయించాలని, ఒక్కరికి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండేలా బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, వంచర్ల గోపాల్, పుర కౌన్సిలర్లు దినేష్ కుమార్, నర్సింహులు, అంజయ్య, రాంరెడ్డి, రాజురెడ్డి, గోపాల్ నాయక్, వెంకటేష్, సుల్తాన్, పలు గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి ఊట్కూర్: వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలని తెలిపారు. ఆయన వెంట ఏఓ గణేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: లబ్ధిదారులకు భరోసా కల్పించి మొదటి విడత గ్రామాలకు ఇచ్చిన లక్ష్యం మేర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. సోమవారం గుండుమాల్ రైతువేధికలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూర్ మండలాల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్‌పై శ్రద్ధ వహించాలని.. ఎస్బీఎం నిధులు రూ.3 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి మండలానికి రెండు కమ్యూనిటీ మరుగు దొడ్లు మంజూరయ్యాయని.. నిర్మాణాలు చేపట్టాలని,జనావాసం ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో రూ.5 లక్షలతో కాంప్లెక్స్‌లను నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్పీఓ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓ లు శ్రీధర్, వేణుగోపాల్‌రెడ్డి, కొండన్న, భార్గవరాం, హౌసింగ్ ఏఈ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
గోడు వినండి.. సమస్య పరిష్కరించండి
● జిల్లా ప్రజావాణికి వినతుల వెల్లువ నారాయణపేట: గోడు వినండి.. సమస్యలు పరిష్కరించండి... అంటూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఫిర్యాదుదారులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ సీహెచ్ ప్రి యాంకను స్వయంగా కలిసి వినతులు అందజేశా రు. మొత్తం 23 మంది వినతులు అందజేయగా కలెక్టర్ స్వీకరించి పరిశీలించి వారితో మాట్లాడి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును అ త్యంత ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జలం.. కలుషితం!
పరీక్షలు చేయకుండానే గ్రామాల్లో నీటి సరఫరా ● వర్షాకాలం.. ముంచుకొస్తున్న ముప్పు ● అటకెక్కిన పరీక్షల కిట్లు ● స్పందించని అధికారులు –8లో uమరికల్: గ్రామాల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీలు, పైపులైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలోని పలు మండల్లాలో కలుషిత నీరు సరఫరా అవుతున్న విషయా న్ని ఇటీవల సంబంధిత అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. అరకొరగా సరఫరా చేస్తున్న నీరైనా స్వచ్ఛంగా లేకపోవడంతో ప్రజలు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. కొళాయిల ద్వారా వచ్చే నీటి ని పరీక్షించేందుకు క్లోరింగ్ కిట్లు ఉపయోగపడుతా యి. ఇందుకుగాను సంబంధితశాఖ అధికారులు అన్ని పంచాయతీలకు గతంలో కిట్లు అందజేసింది. వీటిన్ని శిక్షణ పొందిన సిబ్బందితో సక్రమంగా నీటి పరీక్షలు చేయిస్తే శుద్ధమైన నీటిని సరఫరా చేయ వచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 280 గ్రామాలు.. జిల్లావ్యాప్తంగా 280 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో క్లోరింగ్ కిట్లు ఉండాలి. కానీ వీటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. వర్షాకాలం ప్రారంభంలో గ్రామాల్లోని ప్రజా కొళాయిలు, సోర్సు బోర్లు, బావుల దగ్గర క్లోరింగ్ కిట్లతో నీటి పరీక్షలు చేసిన తర్వాతే సరఫరా చేయాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్కరోజు కూడా సిబ్బంది పరీక్షలు చేసిన దాఖా లాలు లేవు. ఒకవేళ చేసినా అవి మూడుసార్ల కంటే ఎక్కువగా పని చేయడం లేదు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కిట్లు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో మూలనపడేశారు. శుద్ధమైన నీటినే ప్రజలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో తాగునీటి పరీక్ష కిట్లను పంచాయతీలకు అందజేసినా.. ఫలితం లేకపోవడంతో కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. క్లోరింగ్ కిట్లను ఏటా పంచాయతీలకు అందజేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నా.. వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణాలు వినిపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో తప్పనిసరిగా క్లోరింగ్ కిట్లతో నీటి పరీక్షలు చేయాలి. పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్ శాతం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి గతంలో ప్రభుత్వం కిట్లను అందజేసింది. ప్రస్తుతం కిట్లు అందుబాటులో లేకుంటే గ్రామపంచాయతీ నిధులతో కొనుగోలు చేసుకోవాలి. ఇప్పటికే ప్రతి పంచాయతీలో ఒకరిని గుర్తించి నీటి పరీక్షలు చేసే విధానంపై శిక్షణ ఇప్పించాం. – రంగారావు, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్, నారాయణపేట రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి గ్రామాలకు నీటి పరీక్షల కిట్లను అందజేస్తోంది. అంతేగాకుండా గ్రామపంచాయతీలోని తాగునీటి సరఫరా సిబ్బందికి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడకూడా పరీక్షించిన దాఖలాలు కనిపించడం లేదు. బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచూ పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నల్లమలలో వేట!
ప్రజల సహకారం అవసరం.. అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మన్ననూర్, లింగాల, కొల్లాపూర్‌లో సర్వేలెన్స్ టవర్స్ ఏర్పాటుచేశాం. సిస్టమ్ ద్వారా లైవ్‌లో పరిశీలించి మానిటరింగ్ చేపడుతాం. కెమెరా ట్రాప్ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – రేవంత్‌చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి అచ్చంపేట: నల్లమలలో వేటగాళ్ల దాడులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. అడవిలో నీరు దొరక్క బయటకొస్తున్న వాటిని కొందరు వేటాడి చంపేస్తున్నారు. మరికొందరు ఉచ్చులు బిగించి మరీ ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా అటవీ సంపదకు నిలయంగా ఉన్న అనేక అరుదైన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల అమ్రాబాద్ అభయారణ్యంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వేటగాళ్లను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నలుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. 2024–25 సంవత్సరంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన 1,076 ఉచ్చులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తొలగించారు. దీన్ని బట్టి నల్లమలలో వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిఘా ఉన్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్‌లు, ప్రత్యేక నిఘా బృందాలున్నా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. అభయారణ్యంలో నిత్యం ఏదో ఒకచోట వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసంతో పచ్చళ్లు తయారుచేసి.. రహస్య మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా 15 నుంచి 20 వరకు వన్యప్రాణుల వేటపైనే అటవీశాఖ కేసులు నమోదు చేస్తోంది. నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కి అటవీ ప్రాంతంలో ట్యాంకర్లు వెళ్లే ప్రాంతంలోనే నీటి వసతిని ఏర్పాటుచేశారు. కోర్ ఏరియాలో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అడవి నుంచి బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో దారితప్పి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాలైన సిద్ధాపూర్, మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు ఉడిమిళ్ల, మద్దిమడుగు, తిర్మలాపూర్ (బీకే) తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉండే బోరుబావుల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో కొద్దిపాటి నీరు ఉంది. వన్యప్రాణులు అక్కడికి అధికంగా వస్తుంటాయి. ఏటీఆర్‌లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు నిత్యం ఏదో ఒకచోట వేటాడుతున్న వైనం కెమెరా ట్రాప్‌ల్లో చిక్కుతున్న వేటగాళ్లు నీటి కోసం బయటికొచ్చి బలవుతున్న వన్యప్రాణులు -
ప్రజలకు పారదర్శక సేవలు అందాలి
ఊట్కూర్: ప్రజలకు పోలీసుశాఖపై న మ్మకం, భద్రత, భరోసా పెంచేలా సి బ్బంది పారదర్శక సేవలు అందించాల ని ఎస్పీ డా. వినిత్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రాంలాల్, ఎస్ఐ రమేశ్ పూ ల మొక్కలు అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల నమోదు, నిర్వహణ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచి విధిగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలన్నారు. ప్రతి గ్రామ పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులకు వేగంగా స్పందించి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. -
భూసార పరీక్షలు అందని ద్రాక్షే
నర్వ: రైతులు తమ పొలాల్లోని మట్టి పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లాలో ఉన్న అతి తక్కువ భూసార పరీక్ష కేంద్రాలతో అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మినీ భూసార పరీక్షా కేంద్రాలను గతంలో మంజూరు చేసింది. ఈ కేంద్రాల్లో ఆయా గ్రామాల్లో సేకరించిన మట్టి నమూనాలను అక్కడే పరీక్షించి రైతులకు భూ సార పరీక్ష పత్రాలు అందజేయాలని ఆదేశించింది. జిల్లాలోని 77 క్లస్టర్లలో.. 2018లో జిల్లా వ్యవసాయశాఖ ద్వారా ఏఈఓల క్లస్టర్ల వారీగా 77 మినీ భూసార పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మట్టి పరీక్షల నిమిత్తం వినియోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయక నేటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించేందుకు కిట్లున్న కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక జడ్చర్ల ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదని రైతులు చెబుతున్నారు. అటకెక్కిన కిట్లు.. ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టిని సేకరించి కొన్నాళ్ల పాటు సజావుగా పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను రైతులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోపు భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు భాగానే ఉన్నా.. గత కొన్నేళ్లుగా భూసార పరీక్షల ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పాత పద్ధతిలో సాగు.. రైతులకు నష్టాలు 2018లో మంజూరు.. ఒక్కో కేంద్రానికి రూ.1.30 లక్షలు మంజూరు ప్రారంభం ఘనం.. ఆపై సేవలు కనం నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం -
ట్రామా ‘కేర్’ కలేనా?
● గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు 600కి.మీ.మేర జాతీయ రహదారుల విస్తరణ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సకు అవస్థ ● వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ముందుకు కదలని వైనం మహబూబ్‌నగర్ క్రైం: జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరుగుతోంది.. కానీ అదే వేగంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడాల్సిన శ్రీగోల్డెన్ అవర్’ (తొలి గంట)లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందకపోవడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రెండున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4,231 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,109 మంది మృత్యవాతపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. 13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లా మీదుగా 44, 167, 167ఏ, 765 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. దాదాపు 600 కి.మీ.మేర విస్తరించి ఉంది. కనీసం 12 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు హడావుడి చేయడం మినహా దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అత్యవసర చికిత్స అందకపోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం, గోల్డెన్ అవర్‌లో చికిత్స అందకపోవడం, జనరల్ ఆస్పత్రిలో సరైన వసతులు లేక ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎన్‌హెచ్–44పై 2013లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా బాలానగర్–రాజాపూర్ మధ్యలో, జానంపేట, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి, అలంపూర్ ఎక్స్‌రోడ్ దగ్గర ట్రామా కేర్ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే పరికరాలు, సౌకర్యాలు, వైద్యులు కూడా అందుబాటులో లేరు. అత్యవసరంలో స్కానింగ్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక అత్యవసర వైద్య సేవల కోసం నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్లలో మూడేళ్ల క్రితం 50 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క నాగర్‌కర్నూల్ మినహా మిగతావి పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కోస్గి, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, మక్తల్, కొత్తకోట, తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మహబూబ్‌నగర్, హైదరాబాద్ లేదా కర్నూలుకు తరలించాల్సి వస్తుంది. ప్రయాణానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలియోకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సిందేనని పేర్కొన్నారు. జిల్లా లక్ష్యాన్ని సాధించేలా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య, ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వే బృందాలు, వ్యాక్సిన్ నిల్వలు, పంపిణీ ఏర్పాట్లను ప్రోగ్రామ్ అధికారిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఒక్క చిన్నారి కూడా తప్పిపోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్రామాలు, తండాలు, దూర ప్రాంతాలు, ఇటుక బట్టీలు, వలస కార్మికుల కాలనీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేందుకు 416 బృందాలు పనిచేశాయి. ఉదయం నుంచే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగనన్‌వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది, పర్యవేక్షకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. కొందరు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కేంద్రాలకు తీసుకొచ్చారు. అత్యధికంగా కోస్గి మండలంలో 8,369 మంది చిన్నారులకు, మద్దూర్‌లో 8,039, గుండుమాల్ 7 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా.. అత్యల్పంగా ఊట్కూర్‌లో 2,024 మంది చిన్నారులకు వేశారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, ఆర్ఎంఓ డా. బాలాజీ, పోలియో ప్రోగ్రామ్ అధికారి డా. సాయిరాం, కౌన్సిలర్లు ప్రభాకర్, రాజేష్ ఘట్ పాల్గొన్నారు. మండలం చిన్నారుల సంఖ్య దామరగిద్ద 5,153 ధన్వాడ 3,095 గుండుమల్ 7,000 కోస్గి 8,369 కోటకొండ 5,966 మద్దూర్ 8,039 మాగనూరు 5,533 మరికల్ 3,120 నారాయణపేట 4,231 నర్వ 4,097 పులిమామిడి 2,842 ఊట్కూర్ 2,024 మండలాల వారీగా పోలియో చుక్కలు వేసిన చిన్నారులు -
సైబర్ మాయలో పడొద్దు : ఎస్పీ
నారాయణపేట: తక్కువ సమయంలో భారీ లాభాలు.. ఇంట్లో నుంచే ఉద్యోగం.. సులభంగా రుణం.. లక్కీ డ్రాలో రూ.కోట్ల బహుమతి.. వంటి ఆశాజనక ప్రకటనలతో సైబర్ మోసగాళ్లు వల వేస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్‌లైనన్ వ్యాపారాలు, లక్కీడ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని డబ్బులు అడగడం, ఫేక్ ప్రొఫైళ్లతో స్నేహం చేసి ఆర్థిక సాయం కోరడం, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి ఖాతాలోని నగదు దోచుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, లింకులు, మెస్సేజ్‌లు, యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల్లో నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ముందస్తు డబ్బులు వసూలు చేసే మోసాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని, ముందుగానే డబ్బులు అడిగే సంస్థలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా చీటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించినా, మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. చీటింగ్, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
రైతువేదికలో ఏర్పాటు చేయాలి..
గతంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతువేదికల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫలితంగా పంటల సాగులో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. – మారుతి, రైతు, నాగిరెడ్డిపల్లి ఉన్నతాధికారులకు విన్నవిస్తాం.. రైతులు ప్రతి మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. దీంతో 2018లో ఏఈఓల క్లస్టర్ల వారీగా నాటి ప్రభుత్వం మినీ కేంద్రాలను మంజూరు చేసింది. ఆయా కేంద్రాలకు రసాయనాలు, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా నిలిచిపోయింది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులు జడ్చర్ల ల్యాబ్‌లో నామినల్ ఫీజు చెల్లించి భూసార పరీక్షలు చేయించుకోవచ్చు. – నాగేష్, ఏడీఏ, మక్తల్ ● -
జూలై 4న మిడ్జిల్కుసీఎం రేవంత్‌రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్‌లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
చేనేత.. ఎన్నిక
చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ● జూన్ 29న నోటిఫికేషన్ జారీ ● జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ ● జూలై 5న పరిశీలన ● జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ● జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా జిల్లా సంఘాలు ఓటర్లు జో.గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్‌కర్నూల్ 3 96 మహబూబ్‌నగర్ 1 146 ఎన్నికల షెడ్యూల్.. నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
కోస్గి రూరల్: బీఎల్ఏలు అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా పర్యవేక్షించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యవకులను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి బీఎల్వోలకు అందజేసే సమయంలో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. ఎన్యూమరేషన్ ఫారాల్లోని తప్పొప్పులను సరి చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కోస్గి పుర ఇన్చార్జ్ వెంకటనర్సింహులు, నరేందర్‌రెడ్డి, సాయిలు, వెంకటయ్య, శ్యాసం రామకృష్ణ, కిష్టయ్య, నీలప్ప, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్థిక చేయూత నారాయణపేట: తల్లిదండ్రులు లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న ఇద్దరు అనాథ బాలికలకు మీ భవిష్యత్‌కు మేమున్నామంటూ అండగా నిలిచారు నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. అనాథ బాలిక పద్మశ్రీకి గతేడాది బీటెక్ విద్య కోసం అవసరమైన రూ.1.10 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె చదువు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకున్నారు. తాజాగా ధన్వాడ మండలానికి చెందిన అనాథ బాలిక ఝాన్సీరాణి బీటెక్‌లో సీటు సాధించగా అడ్మిషన్, ప్రాసెసింగ్ ఫీజుకు అవసరమైన రూ.10,100 వెంటనే అందజేశారు. అంతేగాకుండా ఆమె చదువు పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన బాలికలను సొంత పిల్లల్లా భావించి వారి ఉన్నత విద్యకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఉత్సాహంగా ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్‌లు రాములు, నరేష్, రాజ్‌కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
జూలై 5 వరకు అవకాశం..
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జూలై 5 వరకు కంది, పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. ఆశించిన మేర వరా్షాలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు విత్తడం ప్రారంభించాలి. సరిపడా తేమ లేకుండా తొందరపడి విత్తనాలు వేయొద్దు. భూమిలో తగినంత తేమ వచ్చిన తర్వాతే సాగు పనులు చేపట్టాలి. వరి సాగు చేయాలనుకునే రైతులు ప్రస్తుతం నారుమడులు (నార్లు) పోసుకోవచ్చు. తగిన వర్షపాతం నమోదైన తర్వాత ప్రధాన పొలాల్లో నాట్లు వేయాలి. వాతావరణ పరిస్థితులు గమనిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
కెమెరాలతో నిఘా..
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్‌లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్‌లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. -
అజిత్‌రెడ్డికి మరో కీలక పదవి
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్‌కు చెందిన బి.అజిత్‌రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్‌రెడ్డి పేషీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్‌రెడ్డి 2012 సివిల్ సర్వీస్‌కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్‌రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. -
పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
నారాయణపేట: జిల్లా ప్రజలకు అత్యాధునిక పాలనా సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సింగారం మలుపు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ చాంబర్లు, సమావేశ మందిరం సందర్శించి నిర్మాణ నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిటికీలు, తలుపుల బిగింపు, వైరింగ్, శానిటరీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మీటింగ్ హాల్లో ప్రొజెక్టర్, సౌండ్ సిస్టం, ఇంటీరియర్ డిజైన్‌ను ఇతర జిల్లాల కలెక్టరేట్లను అధ్యయనం చేసి ఉత్తమ నమూనాలను అమలు చేయాలని చెప్పారు. భవనం వెనుక భాగంలో ప్రత్యేక రహదారి, గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవనం వెలుపల హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో హెలీప్యాడ్ ఏర్పాటు సాధ్యం కాదని అధికారులు వివరించడంతో ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. పార్కింగ్ షెడ్‌పై మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వెనుక రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా సమాఖ్య భవనం పనులను పరిశీలించారు. అక్కడ హెలీప్యాడ్ ఏర్పాటుకు అవకాశం పరిశీలించాలని, భవన ఆవరణలో ఓ వైపు రహదారి, మిగతా ప్రాంతంలో పచ్చదనం పెంపొందించేలా అభివృద్ధి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములుకు సూచించారు. ఆమె వెంట ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, పీఆర్ ఈఈ అశోక్‌కుమార్, ఆయా శాఖల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వేగంగా పంపిణీ చేయాలి.. ఊట్కూర్: జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్వోలు, రెవెన్యూ అఽధికారులు వేగంగా పంపిణీ చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కార్గిల్ చౌరస్తా, గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి బీఎల్వోలతో కలిసి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వచ్చే బీఎల్వోలకు సహకరించి పత్రాలు పూరించి ఇవ్వాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంఈఓ మాధవి, డీపీఆర్వో రషీద్, ఆర్ఐ కృష్ణారెడ్డి, కోరం శివరాజ్‌రెడ్డి, వెంకటేశ్వరమ్మ, సునీత తదితరులు ఉన్నారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
నేడు పల్స్ పోలియో ● జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాలు.. 53,666 మంది చిన్నారులు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణానికిగాను ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాల్లో 53,666 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 72 వేల డోసులను అందుబాటులో ఉంచగా.. 1,880 మంది వైద్యసిబ్బందిని విధుల్లో నియమించారు. వీరిలో వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ప్రయాణాల్లో ఉండే చిన్నారులకు కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా 12 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాపరిధిలోని 5 ప్రధాన బస్టాండ్లలో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే చిన్నారులకు కూడా చుక్కలు వేయనున్నారు. ● కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లాను 40 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు 45 మంది సూపర్వైజర్లను నియమించారు. వ్యాక్సిన్ నిల్వలు, బూత్‌ల నిర్వహణ, లక్ష్యసాధన తదితర అంశాలను వీరు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఆదివారం బూత్‌లలో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి తర్వాతి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి అందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మండలాల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులు మండలం చిన్నారుల సంఖ్య నారాయణపేట 8,921 గుండుమాల్ 7,562 మద్దూరు 6,835 మక్తల్ 6,669 దామరగిద్ద 5,379 మాగనూరు 5,040 ఊట్కూర్ 4,622 నర్వ 3,664 ధన్వాడ 2,190 మరికల్ 2,784 -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
డోలారోహణ కార్యక్రమానికి తరలివచ్చిన జనంపీర్ల వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఊట్కూర్‌లో ఊరేగుతున్న హసేన్, హుసేన్ పీర్లు ఊట్కూర్: మతసామరస్యానికి ప్రతీకై న మొహర్రంను పట్టణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పెద్దపీర్ల మసీద్‌లో హసేన్, హుసేన్ పీర్లను పది రోజుల కిందట ప్రతిష్టించారు. నవమి సవారి సందర్భంగా తెల్లవారుజామున పీర్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించి ఉదయం 9 గంటలకు తిరిగి మసీద్‌కు తీసుకొచ్చారు. దశమి సవారి సందర్భంగా తిరిగి సాయంత్రం సవారి ప్రారంభమై గ్రామంలో ఊరేగిస్తూ నిమజ్జనానికి పెద్దచెరువుకు తీసుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు బొడ్డెమ్మలు, యువకులు డప్పులు కొడుతూ అలయ్ ఆడారు. కొందరు మేకలు, గొర్రెలతో కుందూర్లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొహర్రం సందర్భంగా చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. ముంబై, పూణె, సోలాపూర్, బెంగళూర్, హైదరాబాద్ తదితర పట్టణాల నుంచి అధికమంది తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కనులపండుగగా డోలారోహణం.. మొహర్రంలో భాగంగా దేవినగర్‌లో అనాదిగా వస్తున్న డోలారోహణ కార్యక్రమం కనులపండుగా నిర్వహిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో ఆరెకటిక కులానికి చెందిన శిశువును వేయగా హసేన్, హుసేన్ పీర్లు ఊయలను ఊపి బాలుడికి నామకరణం చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొని చప్పట్లు కొట్టి శిశువును దీవించారు. ఆరెకటికె కుటుంబాలకు చెందిన మగ శిశువుకు నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హసేన్, హుసేన్ పీర్లకు దట్టీలు, చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మసీద్ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. నాయకులు లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కోరం శివరాజ్‌రెడ్డి, ఆనంద్, తరుణ్, మోనప్ప, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తుకు బానిసైతే భవిష్యత్ అంధకారం
నారాయణపేట: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని, యువత యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా పని చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి సత్యనారాయణచౌరస్తా వరకు కొనసాగింది. అక్కడే మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, స్నేహితులు, ఎంజాయ్ పేరుతో సమయాన్ని వృథా చేస్తే కష్టకాలంలో ఎవరూ అండగా ఉండరని చెప్పారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేవి టెరర్రిస్టుల కంటే ప్రమాదకరమైనవన్నారు. యువత అధికంగా ఉన్న భారతదేశాన్ని బలహీనపర్చేందుకు డ్రగ్స్‌ను ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదని.. యువతను వ్యసనాలకు బానిస చేస్తే చాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే విద్య, ఉద్యోగం, జీవితం పూర్తిగా దెబ్బతింటుందని, అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్‌గా మారాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఎకై ్సజ్ సీఐ అశోక్‌కుమార్, ఆర్ఐ విజయభాస్కర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, కృష్ణచైతన్య, ఎకై ్సజ్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పలుచోట్ల వర్షం
● నారాయణపేటలో అత్యధికంగా 16.8 మి.మీ. వర్షపాతం నమోదు నారాయణపేట: జిల్లాలో గురువారం పలుచోట్ల చిరు జల్లులు, తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లా సగటు వర్షపాతం 2.72 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే నారాయణపేటలో అత్యధికంగా 16.8 మి.మీ, కృష్ణాలో 10.8 మి.మీ., గుండుమల్లో 3.0 మి.మీ., ధన్వాడలో 2.4 మి.మీ., ఊట్కూర్‌లో 2.0 మి.మీ., మాగనూర్‌లో 0.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు దామరగిద్ద, మక్తల్, నర్వ, మరికల్, మద్దూర్, కోస్గి, కొత్తపల్లి మండలాల్లో వర్షం కురవలేదు. సర్‌పై అపోహలు వద్దు: కలెక్టర్ నారాయణపేట రూరల్: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్నామని.. ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మండలంలోని జాజాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామానికి చెందిన బసుదె కిష్టప్ప ఇంటికెళ్లి స్వయంగా ఫారాలు అందజేశారు. అంతేగాకుండా ఫారాలను ఎలా నింపాలో యజమానికి అర్థమయ్యేలా వివరించారు. నింపిన ఫారాలను రెండు, మూడురోజుల్లో తిరిగి బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. రెండురోజుల్లో ఫారాల పంపిణీ పూర్తి చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. ఫారాలు ఇచ్చేటప్పుడే ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం బసుదె కిష్టప్ప ఇంట్లో మగ్గంపై నేత కార్మికులు నేస్తున్న నారాయణపేట కాటన్ చీరలను ఆమె ఆసక్తిగా తిలకించారు. చీర నేసే మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చీరలను పరిశీలించి మూడింటిని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రెండ్రోజులకే నిలిచిన నీటి పంపింగ్ మరికల్: జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్‌ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు సరఫరా చేశారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్‌సాగర్‌కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఎల్‌నినో ప్రభావంతో ఎగువన కూడా భారీ వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్పా ఈ ఏడాది కోయిల్‌సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు. రేపు జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక మహబూబ్‌నగర్ క్రీడలు: నిజామాబాద్ జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు జరగనున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికను ఈనెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో నిర్వహిస్తునట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే బాలికలు ఒరిజినల్ ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9396439663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, మహిమూద్, జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రాఘవేంద్ర, కౌన్సిలర్ డీసీ మాధవి, పాంరెడ్డిపల్లి ఉపసర్పంచ్ వెన్నెల, చంటి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
రైతు సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక భగత్‌సింగ్ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 30వ తేదీ వరకు మండల అధికారులు, కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు, పెరుగుతున్న పెట్టుబడితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని రద్దు చేసి అవసరమైనంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఎరువుల ధరలను నియంత్రించి రైతులకు అందుబాటు ధరలో సరఫరా చేయాలని కోరారు. రైతులు పండించిన అన్నిరకాల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కొనుగోళ్లపై పరిమితులు విధించవద్దని డిమాండ్ చేశారు. పంట మార్పిడీని ప్రోత్సహించాలంటే అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు కొనుగోలు హామీ ఇవ్వాలని, అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించించారు. సమావేశంలో నాయకులు చెన్నారెడ్డి, నారాయణ, తాయప్ప, మల్లేష్, కనకప్ప, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు.. 11 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు
ఊట్కూర్: తప్పిపోయిన ఓ మానసిక దివ్యాంగుడు 11 ఏళ్ల తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన మండలంలోని తిప్రాస్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుర్వ భీమప్ప, ఎల్లమ్మకు ముగ్గురు మగ పిల్లలు. చిన్నవాడైన హన్మంతు (13) బుద్ధిమాంద్యంతో ఇంటి దగ్గర ఉండేవాడు. 11 ఏళ్ల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడి ఆచూకీ కోసం ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ‘మనసు‘ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సర్పంచ్ విజయలక్ష్మి నర్సింహకు ఫోన్ చేసి గ్రామానికి చెందిన ఓ మా మానసిక దివ్యాంగుడు తమ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారని వాట్సప్‌లో ఫొటో పంపారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో గ్రామస్తులతో కలిసి చైన్నెకి వెళ్లారు. యువకుడు తల్లిదండ్రులను గుర్తించడంతో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వారికి అప్పగించారు. 2015, సెప్టెంబర్ 29న తమిళనాడులోని చెంగల్పట్టు రైల్వేస్టేషన్లో 13 ఏళ్ల హన్మంతు తిరుగుతుండగా.. స్వచ్ఛంద సంస్థ వారు గమనించి చైన్నెలోని ఆశ్రమంలో చేర్పించి చికిత్స అందించారు. నాలుగు రోజుల కిందట తన గ్రామం తిప్రాస్‌పల్లి, మక్తల్ అని చెప్పడంతో సంస్థ సభ్యులు గూగుల్ సాయంతో సర్పంచ్‌కు సమాచారం అందించారు. 11 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సాగుకు సహకారమేది?
జిల్లావ్యాప్తంగా 45 ఏఈఓ పోస్టులు ఖాళీ ● మొత్తం 77 క్లస్టర్లు.. 32 మంది విధుల్లో... ● ఒక్కొక్కరికి 6 నుంచి 8 గ్రామాలు అదనం ● పని ఒత్తిడికి గురవుతున్న అధికారులు–8లో uమరికల్: వానాకాలం పంటల సాగు ప్రారంభమైంది. మేలైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పలు రకాల ప్రభుత్వ పథకాలను అన్నదాతలకు చేరువ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర ఎంతో కీలకం. జిల్లాలోని పలుచోట్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. అన్నదాతలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే ఏఈఓలను పూర్తిస్థాయిలో నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో మొత్తం 77 క్లస్టర్లు ఉండగా.. కేవలం 32 మంది ఏఈఓలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా క్లస్టర్లలో లేకపోవటంతో పలురకాల సేవలు రైతులకు సకాలంలో అందడం లేదు. జిల్లాలో ఇలా.. జిల్లా సాగు విస్తీర్ణం 4.34 లక్షల ఎకరాలు ఉండగా.. 1.92 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో ఏటా 4లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకా ల పంటలు సాగు చేస్తున్నారు. రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లో పంటల సాగుపై సలహా లు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం 5 వేల ఎక రాలకు ఓ క్లస్టర్‌గా విభజించి జిల్లావ్యాప్తంగా 77 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతువేదికలు నిర్మించింది. కాగా జిల్లాలో ప్రస్తుతం 32 మంది ఏఈఓలు మా త్రమే విధులు నిర్వర్తిస్తుండగా.. 45 ఖాళీలున్నాయి. ఆయా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఒక్కో ఏఈఓకు 6 నుంచి 8 గ్రామాల చొప్పున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వారు తమ విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. యూరియా యాప్, పంటలు పండిన సమయంలో 8 గ్రామాల రైతులు ఒక్కసారిగా రావడంతో తాకిడిని తట్టుకోలేక ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఏఈఓల విధులు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫర్టిలైజర్ యాప్ విడుదల చేసింది. రైతులు పట్టాదారు పాసు పుస్తకాలను ఏఈఓల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్థానికంగా ఏఈఓ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కూడా రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. క్రాప్ బుకింగ్‌కు సైతం విస్తరణాధికారి లేకుంటే ఇబ్బందే. మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు చేతికొచ్చిన తర్వాత మార్క్‌ఫెడ్, ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలి. భారత పత్తి సంస్థ(సీసీఐ) కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా రైతుల వివరాలు ఆన్లైన్ చేసి ఉండాలి. రైతుభరోసా దరఖాస్తులు ఆలస్యమైనా, దరఖాస్తు చేయలేకపోయినా ఆ కుటుంబం ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా సాయం కోల్పోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుభరోసా నిధుల విడుదలలో ఇబ్బందులు పరిష్కరించే బాధ్యత ఏఈఓలపైనే ఉంది. -
సంక్షేమం.. కాగితాలకే పరిమితం కావొద్దు
● రొటీన్ పాలనకు స్వస్తి పలకండి ● ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయండి ● జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన నారాయణపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కేవలం ఒక ప్రత్యేక కార్యక్రమం కాదని.. ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే ఫలితాల ఆధారిత పరిపాలన విధానమని రాష్ట్ర కార్మిక, ఉపాఽ ది శిక్షణ, కర్మాగారాలశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి లబ్ధిదారుడి ఇంటి గుమ్మం వరకు చేరేలా అధికారులు పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పాలనకు అసలైన ప్రమాణమని పేర్కొన్నారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ రోజువారీ విధులకు మాత్రమే పరిమితం కాకుండా.. ఇతర జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జిల్లాలో అమలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించాలని కోరారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలి.. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలని, ఆహార భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎనీమియా నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని కోరారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో పాటు అన్ని శాఖల అధికారులను అభినందించారు. ఇదే పనితీరును భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని కోరారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కృష్ణాబేసిన్‌లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు. రివర్స్ పంపింగ్ విధానం.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.6 వేల కోట్లతో.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్‌ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి. ఉమ్మడి జిల్లాలో.. కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్‌సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
మొహర్రంకు పటిష్ట బందోబస్తు
నారాయణపేట/ఊట్కూర్: మొహర్రంను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్ కోరారు. గురువారం ఆయన డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌తో కలిసి ఊట్కూర్ పోలీస్‌స్టేషన్‌లో బందోబస్తు విధులకు హాజరైన 164 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పీర్ల ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక పికెట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, మొబైల్, ఫుట్ పెట్రోలింగ్‌తో పాటు సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలోనే అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులు జరగకుండా ప్రత్యేక బృందాలను మొహరించినట్లు చెప్పారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టే, ఇతరులకు ఇబ్బందులు కలిగించే పోస్టులు, సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఆర్ఐ నర్సింహ, ఎస్ఐలు రమేష్, శివశంకర్, రేవతి, గాయత్రి పాల్గొన్నారు. -
‘సర్’పై అపోహలు వద్దు: కలెక్టర్
నారాయణపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అపోహలకు తావివ్వొద్దని.. అర్హులైన ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ఎస్ఐఆర్–2026 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన 2కే రన్‌ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణ చౌరస్తా వరకు సాగింది. అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొని ఓటరు చైతన్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ఉద్దేశం ఓటర్ల పేర్లు తొలగించడం కాదని, మృతిచెందిన, డబుల్ నమోదులను తొలగించి ఓటరు జాబితాను మరింత కచ్చితంగా, ప్రామాణికంగా రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని.. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఓటర్లు ఆ ఫారాలను పూర్తిచేసి తిరిగి సమర్పించడంతో తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు నిర్ధారించుకోవాలని సూచించారు. నెలరోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. 2కే రన్లో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎస్పీ నల్లపు లింగయ్య, కలెక్టరేట్ ఏవో అనిల్, డీవైఎస్ఓ వెంకటేష్‌శెట్టి, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే వికసిత్ భారత్ సాధ్యం
నారాయణపేట రూరల్/ధన్వాడ: సంపూర్ణ విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్ ప్రారంభించారు. అలాగే ధన్వాడలో ఎస్సీ విద్యార్థుల వసతిగృహాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న సింగిల్‌విండో గోదాం విద్యార్థులకు అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్ నారాయణపేటకు తరలించడం నిలిపివేయాలని.. ఇక్కడే అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని అధికారుల కు సూచించారు. అనంతరం కిష్టాపూర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోటకొండ పాఠశాల జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న పీఎం శ్రీ పాఠశాలగా.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను పొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కోటకొండలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రాములుగౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, యాదయ్యశెట్టి, సంగీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పార్టీ మాజీ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, ధన్వాడ, కిష్టాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి కొండయ్య, తహసీల్దార్ సింధూజ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాకం సురేందర్, రతంగ్‌పాండురెడ్డి, రామచంద్రయ్య, శివరాజు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకేంద్రంలో 2కే రన్
నారాయణపేట: ప్రత్యేక సవరణ కార్యక్రమం–2026లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు జిల్లాకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన భోజనం అందించాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. బుధవారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం చేయాలని, కూరగాయలను శుభ్రంగా కడిగి వండాలన్నారు. వారానికి మూడు గుడ్లు తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంతకుముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, ఏపీఎం నారాయణ, ప్రధానోపాధ్యాయులు భారతి, భానుప్రకాష్, నిర్మల, నర్సింహులు, శిరీష తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల అభివృద్ధే తన లక్ష్యమని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో జరిగిన జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో అధ్యక్షుడిగా మక్తల్ మండలంలోని మంతన్గోడు సర్పంచ్ రాజేందర్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతామన్నారు. అనేక గ్రామపంచాయతీల వారీగా సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
పేదలకు నాణ్యమైన వైద్యసేవలు
నారాయణపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు ఎలాంటి లోటు లేకుండా అందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మండలంలోని అప్పక్‌పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముుుందుగా యూడీఐడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నమోదు ప్రక్రియ, రోజువారీ సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఆడియాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ విభాగాలతో పాటు సౌండ్ ప్రూఫ్ గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులతో సమావేశమై మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలు, మందుల లభ్యత, ఆర్థిక అవసరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉన్న విభాగాలను గుర్తించి వీలైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘సంకల్ప్’పై ప్రత్యేక దృష్టి.. శిశు మరణాల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆస్పత్రి డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సంపత్‌కుమార్‌సింగ్, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌కు కలెక్టర్ సూచించారు. మాత, శిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు, చికిత్స సకాలంలో అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసి సంతప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డా. మల్లికార్జున్, ఆర్ఎంఓ డా. బాలాజీ, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


