ప్రభుత్వ ఆదేశాలు రావాలి..
● అందని ప్రభుత్వ ఫలాలు
● పెట్టుబడి సాయానికి
వడ్డీ వ్యాపారులే దిక్కు
● ఆర్థిక ఇబ్బందులతో సతమతం
మరికల్: సాగు భూములు లేని పలువురు ఇతరు ల భూములను కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కు అందించే పలు సంక్షేమ పథకాలు వారికి వర్తించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట పె ట్టుబడి సాయానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయి స్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల ను ఆదుకుంటామని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా నేటికీ అమలు కావడం లేదు.
గుర్తింపు కరువు..
కౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పెట్టుబడి సాయం భూ యజమానుల ఖాతాల్లో నేరుగా జమవుతోంది. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పు ల పాలవుతున్నారు. యాసంగిలో ప్రభుత్వం ఆ న్‌లైన్ విధానంలో రైతులకు ఎరువులను సరఫరా చేస్తుండటంతో కౌలు రైతులకు అందక పంట దిగుబడి కూడా తగ్గిందనే చెప్పవచ్చు. పండిన కొద్దిపాటి పంటను విక్రయించేందుకు భూ యా జమాన్య హక్కులు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టాల పాలయ్యారు. కొందరు భూ యజమానులు, ఇతరులను ప్రాధేయపడి పంట ఉత్పత్తులను అమ్ముకున్నారు. భూ యజమానుల ఖాతాల్లో జమైన నగదును సకా లంలో కౌలు రైతులకు బదిలీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలున్నాయి.
పది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చే స్తా. ప్రభుత్వం మా లాంటి కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు లు అందజేయాలి. నే రుగా మాకే పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలివ్వాలి. పంట ఉ త్పత్తులను విక్రయించేందుకు అవకాశం క ల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చి న హామీ మేరకు కౌలు రైతులను ఆదుకోవాలి.
– మాసప్ప, కౌలు రైతు, మరికల్
రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశా. ప్రైవేట్‌లో రూ.3 వడ్డీకి రూ.30 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టా. ప్రభు త్వం కౌలు రైతులకు గు ర్తింపు కార్డులిచ్చి పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేస్తే కాస్త ఉప యోగంగా ఉంటుంది. కౌలు రైతుల కష్టాలు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెట్టుబడి మీదపడి నష్టాలను చవిచూస్తున్నాం.
– బాలప్ప, కౌలు రైతు, కన్మనూర్
పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందాలంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. అప్పుడే గ్రామాల వారీగా కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందించి పెట్టుబడి సాయం అందేలా చూస్తాం.
– సక్రియనాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి


