నారాయణపేట: అర్జీదారులు ఎన్నో ఆశలతో ప్రభు త్వ కార్యాలయాలకు వస్తారని, వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధితశాఖ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావా ణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది అర్జీదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


